లేటెస్ట్ టెక్నాలజీ డీజిల్ ఇంజన్లు లంగ్ క్యాన్సర్‌ను కలిగించవు: స్టడీ

By Ravi

డీజిల్ ఇంజన్లు విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్‌ను మనుషులు పీల్చడం మూలంగా లంగ్ క్యాన్సర్ రిక్స్ ఎక్కువగా ఉంటుందనే అపోహలు ఇది వరకు విస్తృతంగా ఉండేవి. ఇప్పుడు ఆ అపోహలు నిజం కావని తాజా అధ్యయనాలు తేలుస్తున్నాయి.

ఈ అంశంపై ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో.. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన డీజిల్ ఇంజన్ల వలన ఎలాంటి లంగ్ క్యాన్సర్ రాదని తేలింది. పాత తరం డీజిల్ ఇంజన్లతో పోల్చుకుంటే, ఈ కొత్త తరం డీజిల్ ఇంజన్లు 90 శాతం తక్కువ కర్భన వ్యర్థాలను విడుదల చేస్తాయని రుజువైంది.

మొత్తం 30 నెలల పాటు వారానికి 80 గంటల చొప్పున వెలువడి డీజిల్ పొగ నుంచి సేకరించిన దత్తాశం ఆధారంగా, ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షలలో ఈ నిజాలు బయటపడ్డాయి. ఈ అధ్యయనం కోసం ఈపిఏ07 రకం ఇంజన్లను మరియు డీజిల్ పర్టిక్యులేట్ ఫిల్టర్లను ఉపయోగించారు.

Diesel

పాత ఇంజన్లతో పోల్చుకుంటే, ఈ కొత్త తరం డీజిల్ ఇంజన్ల నుంచి వచ్చే పొగ జీవితకాలం పాటు కూడా ఎలాంటి హాని కలిగించదని ఈ పరిశోధనలో తేలింది. వాస్తవానికి దీర్ఘకాలం పాటు ఎన్ఓ2ని పీల్చడం వలన లంగ్స్‌లో కొన్ని మార్పులు వస్తాయి. కానీ ఈ ఈపిఏ10 ఇంజన్ల వలన అది కూడా గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది.

అమెరికా, యూరప్ దేశాలలో దాదాపు 30 శాతం ట్రక్కులు, బస్సులు ఈ ప్రమాణాలతో కూడిన ఇంజన్లనే ఉపయోగిస్తున్నాయి. చైనా వంటి ఇతర దేశాలు ఇలాంటి ఇంజన్లను నడిపేందుకు వీలైన ఆల్ట్రా-లో సల్ఫర్ డీజిల్‌ను అమలు పరచేదిశగా చర్యలు తీసుకుంటున్నాయి.

Most Read Articles

English summary
According to a recent study, fumes from the latest technology diesel engines do not cause lung cancer. The study showed that new generation diesel engines produce up to 90 percent less emission than the old ones.
Story first published: Wednesday, January 28, 2015, 18:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X