డ్రైవర్‌లెస్ కార్లను అభివృద్ధి చేయనున్న మహీంద్రా

By Ravi

ఇప్పటి వరకూ గూగుల్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, టెస్లా వంటి అంతర్జాతీయ కంపెనీలు మాత్రమే డ్రైవర్‌లెస్ కార్లను అభివృద్ధి చేస్తున్నట్లు మనం తెలుసుకున్నాం. కాగా.. తాజాగా భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఈ జాబితాలోకి చేరనున్నట్లు సమాచారం.

మహీంద్రా గ్రూపుకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల విభాగం మహీంద్రా రేవా కూడా డ్రైవర్ రహిత కార్లను తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీ డ్రైవర్ కార్స్ కాన్సెప్ట్‌ల ప్రూఫ్‌లను యూకే మరియు సింగపూర్‌లలో సమర్పించినట్లు సమాచారం.

mahindra driverless car under development

బెంగుళూరులో ఇప్పటికే ప్రయోగాలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది, వీటికి అనుమతి లభించగానే ఈ డ్రైవర్‌లెస్ కార్లను రోడ్లపై టెస్టింగ్ చేస్తారు. ఈ తరహా కార్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయటానికి మహీంద్రా రేవాకు దాదాపు మూడు నాలుగేళ్ల సమయం పట్టే ఆస్కారం ఉంది.

మహీంద్రా రేవా తయారు చేయనున్న డ్రైవర్‌లెస్ కార్లను యూకే, సింగపూర్‌లలో పరీక్షించనున్నారు. మహీంద్రా గ్రూపుకి చెందిన టెక్నాలజీ విభాగం టెక్ మహీంద్రా డ్రైవర్‌లెస్ కారును ఆపరేట్ చేయటానికి అవసరమైన సాంకేతిక మద్ధతును, సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయనుంది.

Most Read Articles

English summary
Driverless cars have become the trending technology of today. Companies like Google, BMW, Audi and Tesla are on the forefront of this development and the latest company who has taken this step seriously is the Mahindra Group.
Story first published: Friday, March 6, 2015, 12:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X