సరికొత్త మహీంద్రా జీతో ఆవిష్కరణ

By Vinay

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మహీంద్రా ఫిక్ అఫ్ వాహన సెగ్మెంట్లో సరికొత్త జీతోను ఆవిష్కరించింది. ఈ ఆవిష్కరణ బెంగళూరులో జరిగింది. ఈ జీతో మినీట్రక్ గా పలురకాలుగా వినియోగదారులకు ఉపయోగపడనుంది.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఉపాధ్యక్షులు జ్యోతి మల్హోత్రా, సీనియర్ జనరల్ మేనేజర్ రాజేష్ గుప్తా " మాట్లాడుతూ ఈ జీతో సెగ్మెంట్ ను క్రియేట్ చేసేలా, ఇది ఇతర వాటితో పోల్చితే 30 శాతం ఆదా చేస్తుంది. అన్ని రకాల వినియోగదారులకు ఇది సౌకర్యంగా ఉంటుంది. జీతో అంటే విజయం అనే అర్థం వస్తుంది" అని తెలిపారు.

జీతో క్రింది విధంగా మూడు సిరీస్ లతో 8 రేంజ్ లలో లభ్యం కానుంది. దీని గురించిన ఫీచర్స్, కలర్స్, మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.....

ఎస్ 6-11

ఎస్ 6-11

ఇది ఎస్ సిరీస్ కు చెందిన మొదటి రేంజ్. 11 హెచ్.పీ సామర్య్థం గల ఇంజన్ తో, 600 కేజీల బరువును మోయగలిగేలా రూపొందించబడింది. దీని ధర రూ.2.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) గా ఉంది. ఇది తక్కువ లగేజిను రవాణా చేసేందుకు వీలుగా ఉంటుంది.

ఎస్ 6-16

ఎస్ 6-16

ఇది ఎస్ సిరీస్ కు చెందిన రెండవ రేంజ్. 16 హెచ్.పీ సామర్య్థం గల ఇంజన్ తో, 600 కేజీల బరువును మోయగలిగేలా రూపొందించబడింది. దీని ధర రూ.2.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) గా ఉంది. ఇది కొరియర్ లాగా లగేజిను రవాణా చేసేందుకు వీలుగా ఉంటుంది.

ఎల్ 6-11

ఎల్ 6-11

ఇది ఎల్ సిరీస్ కు చెందిన మొదటి రేంజ్. 11 హెచ్.పీ సామర్య్థం గల ఇంజన్ తో, 600 కేజీల బరువును మోయగలిగేలా రూపొందించబడింది. దీని ధర రూ.2.55 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) గా ఉంది. ఇది పౌల్ట్రీ, బేకరి వంటి లగేజిను రవాణా చేసేందుకు వీలుగా ఉంటుంది.

ఎల్ 6-16

ఎల్ 6-16

ఇది ఎల్ సిరీస్ కు చెందిన రెండవ రేంజ్. 16 హెచ్.పీ సామర్య్థం గల ఇంజన్ తో, 600 కేజీల బరువును మోయగలిగేలా రూపొందించబడింది. దీని ధర రూ.2.65 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) గా ఉంది. ఇది ఇటుకలు, ఆటోయాక్సిలరీ వంటి లగేజిను రవాణా చేసేందుకు వీలుగా ఉంటుంది.

ఎల్ 7-11

ఎల్ 7-11

ఇది ఎల్ సిరీస్ కు చెందిన మూడవ రేంజ్. 11 హెచ్.పీ సామర్య్థం గల ఇంజన్ తో, 700 కేజీల బరువును మోయగలిగేలా రూపొందించబడింది. దీని ధర రూ.2.65 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) గా ఉంది. ఇది విద్యుత్ సామాగ్రి వంటి లగేజిను రవాణా చేసేందుకు వీలుగాను. మొబైల్ ఫుడ్ వ్యాన్ గాను ఉంటుంది.

ఎల్ 7-16

ఎల్ 7-16

ఇది ఎల్ సిరీస్ కు చెందిన నాల్గవ రేంజ్. 16 హెచ్.పీ సామర్య్థం గల ఇంజన్ తో, 700 కేజీల బరువును మోయగలిగేలా రూపొందించబడింది. దీని ధర రూ.2.76 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) గా ఉంది. ఇది సిమెంట్, కూల్ డ్రింక్స్ వంటి లగేజిను రవాణా చేసేందుకు వీలుగా ఉంటుంది.

ఎక్స్ 7-11

ఎక్స్ 7-11

ఇది ఎక్స్ సిరీస్ కు చెందిన మొదటి రేంజ్. 11 హెచ్.పీ సామర్య్థం గల ఇంజన్ తో, 700 కేజీల బరువును మోయగలిగేలా రూపొందించబడింది. దీని ధర రూ.2.76 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) గా ఉంది. ఇది ప్లాస్టిక్, ఎఫ్.ఎమ్.సీ.జీ వంటి సామాగ్రిని రవాణా చేసేందుకు వీలుగా ఉంటుంది.

ఎక్స్ 7-16

ఎక్స్ 7-16

ఇది ఎక్స్ సిరీస్ కు చెందిన రెండవ రేంజ్. 16 హెచ్.పీ సామర్య్థం గల ఇంజన్ తో, 700 కేజీల బరువును మోయగలిగేలా రూపొందించబడింది. దీని ధర రూ.2.86 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) గా ఉంది. ఇది అధిక బరువు కలిగిన గ్యాస్ సిలిండర్ వంటి సామాగ్రిని రవాణా చేసేందుకు వీలుగా ఉంటుంది.

ఫీచర్స్

ఫీచర్స్

సరికొత్త స్టైల్.

37.6 కి.మీ/లీ మైలేజ్.

2 సంవత్సరాలు లేదా 40,000 కి.మీ వారెంటీ.

కలర్స్

కలర్స్

మహీంద్రా సరికొత్త జీతో క్రింది 5 కలర్స్ లో లభిస్తుంది.

  • డైమండ్ వైట్
  • సన్ రైజ్ రెడ్
  • మ్యాంగో ఎల్లో
  • అల్ట్రా మెరిన్ బ్లూ
  • ప్రీమియమ్ బీజ్

Most Read Articles

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X