అప్ డేట్ తో మెరవనున్న మహీంద్రా క్వాంటో?

By Vinay

భారత్ లో యుటిలిటీ వెహికల్ తయారీలో పేరుగాంచిన మహీంద్రా, ఇప్పుడు ఆధునీకరణ గుండా అడుగులు వేస్తోంది. భారత మార్కెట్ కోసం తన స్కార్పియో మరియు ఎక్స్.యు.వీ 500 మోడళ్లను ఇప్పటికే అభివృద్ధి చేసింది.

పాత మోడళ్లను అభివృద్ధి చేస్తూనే, కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని మహీంద్రా సన్నాహాలు చేస్తోంది. క్వాంటో కూడా అభివృద్ధి చేస్తున్న మోడళ్లలో ఒకటి.

mahindra

కొత్త మహీంద్రా క్వాంటో రాకతో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ కి కొత్త కళ రానుంది. తయారీ సంస్థ మంచి ఉత్పత్తులను కాకపోయినా క్సైలో వంటి వాటిని అభివృద్ధి చేసి అందిస్తోంది.

మహీంద్రా క్వాంటో చాలా మోడ్రన్ గా అద్భుతమైన డిజైన్ తో రూపొందుతోంది. బహుషా ఈ కాంపాక్ట్ ఎస్యూవీ ఇప్పుడు పరీక్ష చేయబడి, 2015 లో ఆవిష్కరణకు సిద్ధమవుతోంది.

mahindra side

మహీంద్రా క్వాంటో ముందు భాగం కొత్త హెడ్ ల్యాంప్స్, బంపర్ మరియు గ్రిల్ తో తయారవుతోంది. వెనుక భాగం కూడా చాలా స్మూత్ ఫినిషింగ్ మరియు ఓవర్ హాల్ తో కొత్తగా కొనుగోలుదారుల ముందుకు రానుంది.

ఈ భారత ఆటోమొబైల్ తయారీ కంపెనీ ఈ మోడల్ లో ఇంజన్ పరంగా ఎటువంటి మార్పులు చేయలేదు. క్వాంటో లోపలి భాగం కూడా కొత్త డిజైన్ తో రూపొందించబడింది. ఎలాగైతేనేం, కొత్త మోడళ్లు వాహనదారుల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకురానున్నాయి.
మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......

Most Read Articles

English summary
India's most popular manufacturer of Utility Vehicles, Mahindra, is going through a modernisation phase. They have already updated their Scorpio and XUV 500 models for Indian market.
Story first published: Tuesday, June 30, 2015, 9:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X