ఆటోమేటిక్ ఆప్షన్‌తో అదరగొట్టనున్న మహీంద్రా స్కార్పియో?

By Vinay

భారత ఆటోమొబైల్ తయారీ సంస్థ మహీంద్రా తన స్కార్పియోకు కొత్త సొబగులతో తీర్చిదిద్ది అదరగొట్టనుంది. ఈ సంస్థ దాన్ని లోపలి భాగం, బయటి భాగం రీ డిజైన్ చేయనుంది.

ప్రతి ఒక్కరూ మహీంద్రా స్కార్పియో నుంచి ఆటోమేటిక్ ఆప్షన్‌ను కోరుకుంటున్నారు. ఈ ఆప్షన్ ఈ ఆవిష్కరణలో లేకపోయునా త్వరలోనే ఈ ఆటోమేటిక్ ఆప్షన్‌ను అందించనుంది.

scarpio

కొన్ని నెలల్లోనే మహీంద్రా స్కార్పియో నుంచి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ వస్తుందని వారు వాగ్దానం చేస్తున్నారు. మహీంద్రా స్కార్పియో ప్రస్తుతం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కోసం ఆర్‌టీవో వద్ద రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది.

మహీంద్రా తన స్కార్పియోలోని టాప్ మూడు వేరియంట్లను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌‌ను అందిచనుంది. ఇది టూవీల్ డ్రైవ్, ఫోర్ వీల్ డ్రైవ్ రెండింటికి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటోంది.

mahindra

మహీంద్రా స్కార్పియోలో మిగతా ఎటువంటి మార్పులు లేవు. మిగిలిన వాటి మాదిరే ఇది కూడా కన్పించనుంది. అయితే ఇతర వాటితో పోలిస్తే వెనుక భాగంలో ఆటోమేటిక్ అనే బ్యాడ్జ్‌ను కలిగి ఉండనుంది.

భారత ఆటోమొబైల్ తయారీ సంస్థ సెల్ఫ్-షిఫ్టింగ్ హైడ్రాలిక్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌ను స్కార్పియోలో అందించనుంది. మహీంద్రా తన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ కలిగిన స్కార్పియోను సుమారు రూ.1,00,000 అదనంగా వసూలు చేసి కస్టమర్లకు అందించనుంది.
మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......

Most Read Articles

English summary
Ever since the modern and more appealing Scorpio was launched in India, everyone was expecting an automatic option. Mahindra, however, did not introduce it during the launch.
Story first published: Friday, July 3, 2015, 14:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X