ఎక్స్‌యువి500 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ను విడుదల చేసిన మహీంద్రా

By Anil

దేశీయ దిగ్గజ వాహనం రంగం మహీంద్రా తమ ఎక్స్‌యువి500 వేరియంట్లలో ఆటో మేటిక్ ట్రాన్స్‌మిషన్‌‌ను కల్పింస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా తమ యస్‌యువి500 మోడల్‌లో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తోంది.

ఆయితే ఈ సందర్భంగా మహీంద్రా విడుదల చేసిన ఈ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడల్‌లో గల ఇంజన్ వివరాలు, ఇందులో గల వేరింయట్స్, ఫీచర్స మరియు ధర వంటి మరిన్ని విశేషాలు చూడండి.

 ఇంజన్

ఇంజన్

ఈ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడల్ ఎక్స్‌యువి500 లో గల ఇంజన్ ఏవిధమైన మార్పులు చోటు చేసుకోలేదు. ఇందులో 2.2-లీటర్ టర్భోచార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు.

పవర్

పవర్

ఇందులో ఉన్న ఇంజన్ 140 బిహెచ్‌పి పవర్ మరియు 300యన్‌యమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

ఈ మొత్తం పవర్‌ను పాత 6-స్పీడ్ మ్యాన్యుల్ గేర్ బాక్స్ లేదా కొత్తగా వచ్చిన ఆటోమేటిక్ గేర్ బాక్స్ చక్రాలకు అందజేస్తుంది.

ఆల్ వీల్ డైవ్

ఆల్ వీల్ డైవ్

ఆల్ వీల్ డ్రైవ్ అనగా ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్‌ను వాహనంలోని అన్ని చక్రాలకు చేరడం అన్నమాట. అనగా అప్పుడు నాలుగు చక్రాలు కూడా ఇంజన్ చేత నడుపబడతాయి.

మహీంద్రా యక్స్‌యువి500 ముందు-చక్రాల డ్రైవ్ మరియు నాలుగు-చక్రాల డ్రైవ్‌‌ ఆప్షన్‌లలో లభించును

ఫీచర్స్

ఫీచర్స్

ఎక్స్‌యువి500 లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే యల్‌ఇడి ల్యాంప్స్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ మరియు ఎలక్ట్రానికల్ గా డ్రైవర్ సీటును సర్దుబాటు చేసుకునేటుంవంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మల్టీ మీడియా

మల్టీ మీడియా

మల్టీ మీడియా పరంగా ఇందులో ఉన్న ప్రత్యేకతలు.

7-అంగుళాల తాకే తెర పరమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, జిపియస్, ఆటో మేటిక్ టెంపరేచర్ కంట్రోల్ కలవు.

 ఇతర ఫీచర్స్

ఇతర ఫీచర్స్

బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్

రివర్స్ పార్కింగ్ సెన్సార్స్

క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతనమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

భద్రత

భద్రత

ఎక్స‌యువి500లో భద్రత పరమైన ఫచర్లు అధికంగా ఉన్నాయి.

యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఎబియస్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ఇయస్‌సి), ఆరు ఎయిర్ బ్యాగులు మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి) వంటి ఆప్షన్‌లు ఇందులో ఉన్నాయి.

ధర

ధర

మహీంద్రా అండ్ మహీంద్రా వారి ఆటోమెటిక్ ఎక్స్‌యువి500 ఫ్రంట్-వీల్ డ్రైవ్ వేరియంట్ యొక్క ప్రారంభ ధర రూ 15.36 ఎక్స్-షోరూమ్ (ముంబాయ్)గా ఉంది.

పోటి

పోటి

ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ విడుదల చేసిన ఈ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎక్స్‌యువి500 మోడల్ యస్‌యువి కారు హ్యూంద్యాయ్ వారు ఈ మద్యనే విడుదల చేసిన క్రెటా మోడల్‌కు గట్టి పోటిగా నిలిచిందని చెప్పవచ్చు.

మరిన్ని మహీంద్రా యస్‌యువి ల గురించి తెలుసుకోండి...
  1. ఇది మహీంద్రా ఎక్స్‌యూవీ500నే..
  2. అప్ డేట్ తో మెరవనున్న మహీంద్రా క్వాంటో?

Most Read Articles

English summary
Mahindra Launches XUV500 With Automatic Transmission
Story first published: Thursday, November 26, 2015, 10:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X