అదనపు ఫీచర్లతో మారుతి సుజుకి సియాజ్ జెడ్ ప్లస్ వేరియంట్

By Ravi

మారుతి సుజుకి ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న లేటెస్ట్ మిడ్-సైజ్ సెడాన్ 'సియాజ్'లో కంపెనీ తాజాగా ఓ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. మరిన్ని అదనపు ఫీచర్లతో కూడిన 'సియాజ్ జెడ్ ప్లస్' వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది.

ప్రస్తుతం కంపెనీ ఆఫర్ చేస్తున్న టాప్-ఎండ్ వేరియంట్ సియాజ్ జెడ్‌కు ఎగువన ఈ సియాజ్ జెడ్ ప్లస్ వేరియంట్‌ను విక్రయిస్తారు. మారుతి సుజుకి సియాజ్ జెడ్ ప్లస్ వేరియంట్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో లభించే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

సియాజ్ జెడ్ ప్లస్ వేరియంట్లో లభించే ఫీచర్లు:

  • లెథర్ సీట్స్
  • లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్
  • కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‍‌మెంట్ సిస్టమ్
  • బెల్ట్ లైన్ ఆర్నమెంట్
  • బూట్ లిడ్ గార్నిష్
  • 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్
  • వాయిస్ కమాండ్
  • నావిగేషన్ సిస్టమ్

Maruti Ciaz New Variant
పెట్రోల్ ఇంజన్:
పెట్రోల్ వెర్షన్ సియాజ్‌లో 1373సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 91.15 హార్స్‌పవర్‌ల శక్తిని, 130 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

డీజిల్ ఇంజన్:
డీజిల్ వెర్షన్ సియాజ్‌లో 1248సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 88.47 హార్స్‌పవర్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

సియాజ్ జెడ్ ప్లస్ వేరియంట్ ధరలు

  • సియాజ్ జెడ్ఎక్స్ఐ (పెట్రోల్) - రూ.9.08 లక్షలు
  • సియాజ్ జెడ్ఎక్స్ఐ (డీజిల్) - రూ.10.37 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Most Read Articles

English summary
Japanese manufacturer Maruti Suzuki has introduced a new trim level with even more features than before in its mid-size sedan Ciaz. Currently their top of the line offering was the Z(O), which will be replaced by the Ciaz Z+ trim level. This new trim level will be their most feature rich offering and will provide more value to the buck.
Story first published: Wednesday, January 28, 2015, 17:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X