మారుతి సుజుకి 'ప్రీమియం' ప్లాన్స్ ఏంటో తెలుసా..?

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, బడ్జెట్ కార్లకు అత్యంత ప్రాధాన్యమైన బ్రాండ్‌గా మంచి బ్రాండ్ వ్యాల్యూని దక్కించుకున్న సంగతి తెలిసినదే. దేశీయ ప్యాసింజర్ కార్ మార్కెట్లో అత్యధిక వాటా కలిగి ఉన్న బ్రాండ్, తక్కువ ధర కలిగిన కార్లను విక్రయించడం ద్వారా మార్కెట్లో మంచి పట్టు సాధించింది.

కాగా.. ఇప్పుడు మారుతి సుజుకి ఇండియా తమ దృష్టిని బడ్జెట్ కార్ల నుంచి ప్రీమియం కార్ల వైపుకు మళ్లించినట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి తమ ప్రీమియం మోడళ్లను విక్రయించేందుకు గాను దేశవ్యాప్తంగా కొత్త డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రానున్న ఐదేళ్లలో 20 లక్షల వాహనాలను విక్రయించాలనే కంపెనీ లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు చేస్తున్నట్లు సమాచారం.

maruti new dealership

ప్రస్తుతం దేశంలో ఉన్న మారుతి సుజుకి డీలర్‌షిప్‌లు అదనంగా వస్తున్న ఈ ప్రీమియం డీలర్‌షిప్‌లలో ఖరీదైన మారుతి కార్లను మాత్రమే విక్రయిస్తారట. గతంలో మారుతి సుజుకి తమ కిజాషి లగ్జరీ సెడాన్‌ను, గ్రాండ్ విటారా ప్రీమియం ఎస్‌యూవీని విక్రయించడంలో వైఫల్యం చెందింది. కాగా.. కంపెనీ ఇప్పుడు కేవలం ఇలాంటి ప్రీమియం కార్లను మాత్రమే టార్గెట్‌గా చేసుకొని కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించనుంది.

ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ తరహా ప్రీమియం డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయనున్నారు. రానున్న ఏడాది కాలంలో ఇలాంటివి దాదాపు 35 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేస్తామని మారుతి సుజుకి ఇండియా సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సి తెలిపారు. మారుతి సుజుకి నుంచి రానున్న ఎస్ఎక్స్4 క్రాసోవర్, వైఆర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లను కూడా ఈ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
Maruti Suzuki, the country's largest carmaker is planning to set up new dealerships across the country to sell premium models. This move is to help achieve Maruti Suzuki's yearly target of selling two million cars in the next five years.
Story first published: Thursday, February 26, 2015, 11:21 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X