2015 చివరి నాటికి సుజుకీ స్విఫ్ట్ హైబ్రిడ్ ఆవిష్కరణ.

By Vinay

మారుతి సుజుకీ భారత ఆటోమొబైల్ రంగంలో ఓ ప్రముఖ సంస్థ. కస్టమర్లకు సంతోషానివ్వడానికి విస్తృతంగా ఉత్పత్తులను అందిస్తూ వస్తోంది.

ఇటీవల ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా తక్కువ కాలుష్యానికి మరియు పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తామని ఈ జపనీస్ కార్ తయారీ సంస్థ వాగ్దానం చేసింది.

maruthi suzuki front


ఇటీవల భారత్ లో బాగా అమ్ముడవుతున్న హ్యాచ్ బ్యాక్ లలో సరికొత్తగా అఫ్ డేట్ అయిన స్విఫ్ట్ కూడా ఒకటి. మారుతి సుజుకీ 2015 చివరికి హ్యాచ్ బ్యాక్ ఆప్షన్ లో సుజుకీ స్విఫ్ట్ హైబ్రిడ్ను ఆవిష్కరించే ఆలోచనలో ఉంది. ఈ కొత్త సుజుకీ స్విఫ్ట్ హైబ్రిడ్ ను భారత ప్రభుత్వం యొక్క ఫేమ్ పథకం వర్తించే విధంగా ఏర్పాట్లు చేసింది. ఫేమ్ పథకం క్రింద భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాలపై రాయితీలను అందించనుంది.

maruthi suzuki side

ఇంతకు ముందు మారుతి సుజుకీ తన స్విఫ్ట్ హైబ్రిడ్ రేంజ్ ను ప్రభుత్వం కోసం మాత్రమే డిజైన్ చేసింది. భారత్ లోని కష్టమర్లకు సరిపడే విధంగా దాన్ని అభివృద్ధి చేస్తోంది. హైబ్రిడ్ రేంజ్ ఎక్స్ టెండ్ తో స్విఫ్ట్ మూడు ఆప్షన్ లను ఆఫర్ చేస్తోంది.

ఇవన్నీ ఎలక్ట్రిక్, ప్యార్లర్ హైబ్రిడ్ మరియు సిరీస్ హైబ్రిడ్. ఈ మూడు మోడళ్లు భారత ప్రభుత్వం అందించే ఫేమ్ పథకం వర్తించే విధంగా ఉన్నాయి. ప్రయోజనాలను పొంది ఈ సెగ్మెంట్లో ముందుకెళ్లాలని మారుతి సుజుకీ భావిస్తోంది.

Most Read Articles

English summary
Maruti Suzuki is one of the leading automobile manufacturers in India. They offer a wide range of products that cater to a wide variety of customers.
Story first published: Thursday, June 25, 2015, 18:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X