వీడియో: కుందేలు, తాబేలు కథ (మెర్సిడెస్ స్టైల్‌లో)

By Ravi

మీకు కుందేలు, తాబేలు పరుగు పందెం కథ గుర్తుందా..!? చిన్నప్పుడు మనమందరం ఈ కథను వినే ఉంటాం. కుందేలు, తాబేలుకి పరుగు పందెం పెడితే, తాబేలు సత్తాను చులకన చేసిన కుందేలు నేరుగా గమ్యం చేరకుండా, మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకుంటుంది. ఈలోపు కుందేలు కన్నా ముందుగా తాబేలు గమ్యాని చేరుకుంటుంది. ఇదీ ఒకప్పటి కథ.

కానీ, మెర్సిడెస్ బెంజ్ కథ మాత్రం ఇంకో రకంగా ఉంటుంది. జర్మన్ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ తమ ఏఎమ్‌జి జిటి ఎస్ మోడల్‌ను ప్రమోట్ చేసేందుకు గాను ఓ సరికొత్త టెలివిజన్ కమర్షియల్‌ను విడుదల చేసింది. ఇందులో కూడా కుందేలు, తాబేలు కథనే స్ఫూర్తిగా తీసుకుంది.

ఈ ప్రకటనలో కూడా కుందేలు గమ్యానికి చేరువగా వెళ్లి, స్నేహితులతో ఆటలాడుతుంటుంది. ఈలోపుగా తాబేలు మెర్సిడెస్ బెంజ్ షోరూమ్‌కి వెళ్లి ఏఎమ్‌జి జిటి ఎస్ కారులో కుందేలు కన్నా ముందుగా గమ్యం చేరుకుంటుంది. చూడటానికి ఇదంతా ఫిల్మీగా ఉన్నప్పటికీ, ఈ యానిమేషన్ ప్రకటనను మాత్రం చక్కగా తీర్చిదిద్దారు. మరి ఆ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!

<iframe width="600" height="450" src="//www.youtube.com/embed/LQvdIGeUUvo?rel=0&showinfo=0&autoplay=0" frameborder="0" allowfullscreen></iframe>

Most Read Articles

English summary
Mercedes is back with an all new commercial for its AMG GT S. The company has dug out a classic story and turned it into something brilliant! The good old story of the race between the hare and the tortoise has found new life in this commercial. The story has also transformed the hare and the tortoise to new age characters.
Story first published: Thursday, January 29, 2015, 12:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X