కొత్త 2015 ఫోర్డ్ ఎండీవర్ ఇంజన్ వివరాలు వెల్లడి

By Ravi

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పవర్‌ఫుల్ అండ్ పాపులర్ ప్రీమియం ఎస్‌యూవీ 'ఎండీవర్'లో కంపెనీ ఓ సరికొత్త తరం (నెక్స్ట్ జనరేషన్) మోడల్‌ను ఈ ఏడాది భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. కాగా.. కంపెనీ ఇప్పుడు తమ ఎస్‌యూవీకి సంబంధించిన ఇంజన్ వివరాలను వెల్లడి చేసింది.

కొత్త 2015 ఫోర్డ్ ఎండీవర్ ఇంజన్ ఆప్షన్స్:

  • 2.0 లీటర్ ట్విన్-స్క్రాల్ ఈకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్ - 234 బిహెచ్‌పి పవర్, 360 ఎన్ఎమ్ టార్క్
  • 2.2 లీటర్ డ్యురాటార్క్ టిడిసిఐ డీజిల్ ఇంజన్ - 147 బిహెచ్‌పి పవర్, 385 ఎన్ఎమ్ టార్క్
  • 3.2 లీటర్ డ్యురాటార్క్, 5-సిలిండర్ డీజిల్ ఇంజన్ - 197 బిహెచ్‌పి పవర్, 470 ఎన్ఎమ్ టార్క్
2015 ford endeavour india launch

ఈ ఇంజన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, ఆప్షనల్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి. అలాగే, ఇందులో ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ లేదా స్టాండర్డ్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడా లభ్యం కానుంది.

కాగా.. భారత మార్కెట్లో 2015 ఫోర్డ్ ఎండీవర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు, కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మాత్రమే ఇది లభ్యం కావచ్చని సమాచారం. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మాదిరిగా పెద్ద ట్రాపేజోయ్‌డల్ గ్రిల్, క్రోమ్ సైడ్ మిర్రర్స్, పెద్ద వీల్ ఆర్చెస్ వంటి ఎక్స్టీరియర్ మార్పులతో పాటుగా ఇంటీరియర్లలో కూడా అనేక అప్‌గ్రేడ్స్ ఈ కొత్త ఎండీవర్ ఎస్‌యూవీలో ఉండనున్నాయి.

కొత్త 2015 ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ ఈ సెగ్మెంట్లో మిత్సుబిషి పాజెరో స్పోర్ట్, శాంగ్‌యాంగ్ రెక్స్టన్, టొయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

Most Read Articles

English summary
The American car manufacturer Ford will be introducing an all new Endeavour for 2015. They plan to introduce the 2015 Endeavour in India by the end of the calendar year. The Figo twins are expected to arrive in India by mid-2015.
Story first published: Thursday, January 29, 2015, 14:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X