8న భారత్ కు రానున్న హోండా జాజ్?

By Vinay

భారత ఆటోమొబైల్ తయారీ సంస్థ హోండా ప్రీమియమ్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లోకి తన సరికొత్త జాజ్ ను ప్రవేశపెట్టనుంది. జూలై 8న జాజ్ భారత మార్కెట్లోకి రానుంది.

ఇంతకు ముందు భారత మార్కెట్లోకి విడుదల చేసిన జాజ్ ఎక్కువ ధర వల్ల కస్టమర్ల ఆదరణ పొందలేకపోయింది. దీంతో హోండా సరికొత్త జాజ్ ను రూ.5.5లక్షలతో ఆవిష్కరణకు సిద్ధమైంది.

honda jazz

హోండా జాజ్ ఈ, ఎస్, ఎస్.వీ, వీ మరియు వీఎక్స్ వంటి ఐదు వేరియంట్లలో లభ్యం కానుంది. ఈ ఐదు వేరియంట్లను ప్రీమియమ్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లోకి ప్రవేశపెట్టడం ద్వారా మంచి కస్టమర్ల నుంచి మంచి ఆదరణ పొందేందుకు హోండా ప్రయత్నాలు చేస్తోంది.

హోండా జాజ్ పెట్రోల్, డీజల్ రెండు వేరియంట్లలో లభించనుంది. పెట్రోల్ వేరియంట్లో 90 బీహెచ్పీ మరియు 110 ఎన్ఎమ్ ల టార్క్ ను ఉత్పత్తి చేయగల 1.2 లీటర్ ఐ-వీటెక్ ఇంజన్ ఉంది. డీజల్ వేరియంట్ 100 పీఎస్ మరియు 200 ఎన్ఎమ్ ల టార్క్ ను ఉత్పత్తి చేయగల 1.5 లీటర్ ఐ-డీటెక్ ఇంజన్ ను కలిగి ఉంది.

honda

పెట్రోల్ వేరియంట్ 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో 19.0 కి.మీ/లీ మైలేజ్ ఇచ్చే విధంగా తయారైంది. డీజల్ వేరియంట్ 6- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో 23.7 కి.మీ/లీ మైలేజ్ ఇచ్చే విధంగా రూపొందించబడింది.

హోండా జాజ్ ఫీచర్స్:

  • 15.7 సెం.మీ టచ్ స్క్రీన్ ఏవీఎన్ సిస్టమ్.
  • అడ్జస్టెబుల్ రేర్ హెడ్ రెస్ట్.
  • ఆటో ఏ.సీ.
  • హ్యాండ్స్ ఫ్రీ టెలిఫోనిక్ కంట్రోల్.
  • ఎలక్ట్రిక్ ఫోల్డింగ్స్ ఓవీఆర్ఎమ్స్.
  • మల్టీ వ్యివ్ రేర్ పార్కింగ్ కెమెరా.
  • ఏబీఎస్.

మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......

Most Read Articles

English summary
Decks have been cleared for Honda's highly anticipated Jazz premium hatchback. Honda will break the cover of all new Jazz in India on 8 July.
Story first published: Wednesday, July 1, 2015, 9:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X