5-సీటర్, 7-సీటర్ ఆప్షన్లతో వస్తున్న నెక్స్ట్ జనరేషన్ వ్యాగన్ఆర్

By Ravi

గడచిన సంవత్సరం సెలెరియో, సియాజ్, రిఫ్రెష్డ్ ఆల్టో కె10 వంటి సరికొత్త మోడళ్లను మార్కెట్‌‌కు పరిచయం చేసిన దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, ఈ ఏడాది కూడా ఆకర్షణీయ కార్లను విడుదల చేసి ఇండియన్ల మది దోచుకోనుంది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, మారుతి సుజుకి ఓ కొత్త ప్రాజెక్టుపై పనిచేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోడ్ నేమ్ వైసిఏ. వైసిఏ వాస్తవానికి ఓ నెక్స్ట్ జనరేషన్ వ్యాగన్ఆర్ ప్రాజెక్ట్. ఈ కారును గుజరాత్‌లో ఉన్న మారుతి సుజుకి తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేయనున్నారు.

ఈ నెక్స్ట్ జనరేషన్ వ్యాగన్ఆర్‌ను పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్నారు. ఈ మోడల్ కేవలం 5-సీటర్ ఆప్షన్‌తోనే కాకుండా 7-సీటర్ ఆప్షన్‌తో కూడా లభ్యం కానున్నట్లు సమాచారం. డాట్సన్ గో, గో ప్లస్ మోడల్ శ్రేణి స్ఫూర్తి పొంది మారుతి ఈ సరికొత్త వ్యాగన్ఆర్ మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

maruti suzuki wagonr mpv

ఈ కొత్త తరం వ్యాగన్ఆర్ ఎమ్‌పివి ఇటు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో పాటుగా అటు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో కూడా లభ్యం కానుంది. అంతేకాకుండా.. ఇందులో పాపులర్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) ఆప్షన్ కూడా అందుబాటులో ఉండనుంది.

ఇదే కాకుండా.. మారుతి సుజుకి 2015లో మరిన్ని ఆసక్తికరమైన ఉత్పత్తులను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఇందులో భాగంగానే.. ఎస్ఎక్స్-4 క్రాస్ అనే క్రాసోవర్‌ను, అలాగే వైఆర్ఏ పేరుతో అభివృద్ధి చేస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను మరియు ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
The Japanese manufacturer Maruti Suzuki is not looking at small goals, it has a bigger picture in its mind. They are working on a project named YCA, it will be manufactured from their Gujarat facility. This vehicle will be developed at the beginning of 2017 and by mid-year will be available.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X