డ్రైవర్ ఎటువైపు చూస్తే అటువైపు తిరిగే లైట్లు

By Ravi

ఆటోమొబైల్ వాహనాల హెడ్‌లైట్లలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనం ఆన్ చెయ్యాల్సిన అవసరం లేకుండా సూర్యకాంతి తగ్గగానే ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే హెడ్‌లైట్లు, మలుపుల వద్ద కారుతో పాటుగా మలుపు తిరిగి కాంతిని పంచే హెడ్‌లైట్లు, ఎల్ఈడి హెడ్‌లైట్లు, లేజర్ హెడ్‌లైట్లు ఇలా అనేక రకాల హెడ్‌లైట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

కాగా.. అడాప్టివ్ హెడ్‌లైట్స్ టెక్నాలజీకి మరింత అధునాతన సాంకేతికతను జోడించి ఓపెల్ ఓ సరికొత్త హెడ్‌లైట్ టెక్నాలజీని సృష్టించనుంది. రాత్రి సమయంలో డ్రైవర్ ఎటువైపు చూస్తే, అటువైపు మాత్రమే కాంతి ప్రసరించేలా ఓ సరికొత్త హెడ్‌లైట్ తయారీకి ఓపెల్ శ్రీకారం చుట్టింది.

Adaptive Headlight

ఈ సిస్టమ్‌లో భాగంగా ఓ కెమెరా మరియు పెరిఫెరల్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు మరియు సెంట్రల్ ఫొటోడయోడ్స్ డ్రైవర్ కళ్లను సెకనుకు 50 సార్లకు పైగా స్కాన్ చేసి, ఈ అడాప్టివ్ హెడ్‌లైట్ సిస్టమ్‌ను దానికి అనుగుణంగా పనిచేసేలా సహకరిస్తాయి.

ఇలా సేకరించిన దత్తాంశాన్ని సమీక్షించి, డ్రైవర్ ఎటువైపు చూస్తున్నాడో గుర్తించి దానికి అనుగుణంగా హెడ్‌లైట్స్ కాంతి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ హెడ్‌లైట్లను ఫైనల్ టెస్టింగ్ చేస్తున్నారు. మరో18 నెలల సమయంలో ఎల్ఈడి మ్యాట్రిక్స్ హెడ్‌లైట్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి రావచ్చని అంచనా.

Opel Developing Adaptive Headlights
Most Read Articles

English summary
Adaptive headlight technology has gone a long way from it began or first introduced. It is a continuous evolution process to try and make road safer while driving in the night. Opel is planning on taking this feature to the next level by designing adaptive headlights that will focus where the driver is looking.
Story first published: Saturday, March 14, 2015, 17:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X