అమ్మకాలకు సిద్దమైన రేంజ్ రోవర్ స్పోర్ట్ యస్.వి.ఆర్ : ధర, ఫీచర్స్..

By Anil

రేంజ్ రోవర్ కు చెందిన యస్ వి ఆర్ స్పోర్ట్స్ వెహికల్‌ భారత్‌లో అమ్మకాలను ప్రారంభించింది. చాల కాలం నుండే రేంజ్ రోవర్‌ కు చెందిన వాహనాలకు మంచి గిరాకి ఉంది. అయితే ప్రస్తుతం భారత్ లో అమ్మకాల పరంగా విడుదలైన యస్.వి.ఆర్ స్పోర్ట్స్ కారు మంచి ఫలితాలను అందించగలదని కంపెని వర్గాలు ఆశిస్తున్నాయి.

ఈ రేంజ్ రోవర్ యస్.వి.ఆర్ స్పోర్ట్స్ వెహికల్‌ను జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క ప్రత్యేక కార్యకలాపాల విభాగం ద్వారా అభివృద్ధి చేశారు. మరియు ఇది మార్కెట్లో గల మెర్సిడెస్ బెంజ్-ఎ.ఎమ్.జి ఎమ్ఎల్63 మరియు పోర్చ్సే కయేన్ టర్బో యస్ వాహనాలకు గట్టి పోటి ఇవ్వనుంది.
ధరలు: రేంజ్ రోవర్ యొక్క ధరలు కోసం...

మరి రేంజ్ రోవర్ యస్.వి.ఆర్ స్పోర్ట్స్ వెహికల్‌ యొక్క పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే క్రింద గల స్లయిడర్‌లను గమనించండి.

ధర :

ధర :

రేంజ్ రోవర్ సామాన్య ప్రజలు ఏమాత్రం ఊహించలేనంతగా వీటి ధరలు ఉంటాయి. ఇప్పుడు విడుదలైన యస్.వి.ఆర్ స్పోర్ట్స్ కారు ధర మాత్రం అక్షరాల రూ. 2.12 కోట్లు.

ఇంజన్ స్పిసిఫికేషన్స్ :

ఇంజన్ స్పిసిఫికేషన్స్ :

రేంజ్ రోవర్ యస్.వి.ఆర్ స్పోర్ట్స్ కారులో 5.0-లీటర్ ఇంజన్ కలదు ఇందులో గల సూపర్ ఛార్జ్‌డ్ వి8 ఇంజన్ ఏకంగా 542 బిహెచ్‌పి ని ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులో పెడల్ షిఫ్టర్స్ కలిగి ఉన్న 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలదు.

వేగం :

వేగం :

రేంజ్ రోవర్ యస్.వి.ఆర్ స్పోర్ట్స్ వెహికల్ కేవలం 4.5 సెకండ్లలోనే 100 కిమి/అవర్ వేగాన్ని అందుకోగలదు. మరియు దీని యొక్క గరిష్ట వేగం 261 కెమ్/హెచ్ ఇది పూర్తిగా ఎలక్ట్రానిక్ కంట్రోల్ ఉంటుంది.

డిజైన్ :

డిజైన్ :

దీని డిజైన్ గురించి వివరించే ముందు ఇది సాధారణ రేంజ్ రోవర్ డిజైన్‌‌ను పోలి ఉంటుందని చెప్పవచ్చు. అయితే కొన్ని కొత్తవి కూడా ఇందులో పరిచయం అయ్యాయి. లోపలికి ఎక్కువ గాలిని తీసుకునే విధంగా అతి పెద్ద బంపర్, కొత్త గ్రిల్, రాజుల కాలం నాటి రథాలకున్న చక్రాల యొక్క డిజైన్ వీటి చక్రాలలో మనం చూడవచ్చు. మరియు ఇందులో నాలుగు పొగ గొట్టాలు, వెనుకవైపున బంపర్ ఉన్నాయి. స్పాయిలర్ ఇందులో ఉన్న మరొ ప్రత్యేకత.

ఫీచర్స్:

ఫీచర్స్:

రేంజ్ రోవర్ యస్.వి.ఆర్ స్పోర్ట్స్ వెహికల్‌లో కొన్ని స్పోర్టివ్ ఫీచర్స్ ఉన్నాయి అందులో స్పోర్ట్ సీట్లు, మీ ఇష్టాన్ని బట్టి అల్యుమినియం లేదా కార్బన్ ఫైబర్ ట్రిమ్ తో వచ్చాయి మరియు నాలుగు రకాల రంగులలో ఇంటీరియర్ లభించును.

మరిన్ని ఫీచర్స్ :

మరిన్ని ఫీచర్స్ :

వర్షం వస్తే ఆటోమేటిక్ గా పని చేసే వైపర్స్, వేడిని పుట్టించే వెనుకవైపు విండో, విండ్ స్క్రీన్ మరియు ఫాలో మి హోమ్ ల్యాంప్స్ ఇందులో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్స్.

భధ్రత :

భధ్రత :

ఒక విధంగా చెప్పాలంటే రేంజ్ రోవర్ భధ్రతకు పెద్దపీట వేస్తుందని చెప్పవచ్చు.

  • ఎమర్జెన్సి బ్రేక్ అసిస్ట్ (ఇబిఎ)
  • యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబియస్)
  • కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (సిబిసి)
  • నాలుగువైపులా ఎయిర్ సస్పెన్షన్
  • పార్కింగ్ కోసం ప్రత్యేకంగా కెమెరాలు ఏర్పాటు చేశారు.

Most Read Articles

English summary
The Range Rover Sport SVR is now on sale in India for a price tag of INR 2.12 crore, ex-showroom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X