ఫాల్టీ ఎయిర్‌బ్యాగ్స్: భారత్‌లో 646 రెనో వాహనాల రీకాల్!

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న వాహనాలలో ఎయిర్‌బ్యాగ్స్ సమస్య కారణంగా 646 కార్లను రీకాల్ చేయనుంది. కంపెనీ విక్రయించిన పల్స్ హ్యాచ్‌బ్యాక్, స్కాలా సెడాన్ కార్లలో ఈ సమస్యను గుర్తించినట్లు సమాచారం.

సెప్టెంబర్ 2011 నుండి జులై 2012 మధ్యలో ఉత్పత్తి అయిన రెనో పల్స్, రెనో స్కాలా మోడళ్లలోని లోపపూరితమైన ఎయిర్‌బ్యాగ్స్‌ను సరిచేసేందుకు రెనో ఇండియా ఈ రీకాల్‌ను ప్రకటించనుంది. ఈ కార్లలో టకటా నుంచి గ్రహించిన ఎయిర్‌బ్యాగ్స్ ఉపయోగించారు.

Pulse

కేవలం రెనో కంపెనీనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆటోమొబైల్ కంపెనీలకు జపాన్‌కి చెందిన టకటా సంస్థే ఎయిర్‌బ్యాగ్స్‌ను సప్లయ్ చేస్తోంది. ఈ కంపెనీ ఎయిర్‌బ్యాగ్స్ ఉపయోగించిన కార్లలో, ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్స్ అధిక తీవ్రతో విచ్చుకొని ప్రయాణీకులకు హాని కలిగించవచ్చనే సమాచారంతో అనేక అన్ని కార్ కంపెనీలు లక్షల సంఖ్యలో తమ వాహనాలను వెనక్కి పిలిస్తున్నాయి.

ఈ రీకాల్‌కు వర్తించే కార్లలో 620 పల్స్ హ్యాచ్‌బ్యాక్‌లు, 26 స్కాలా సెడాన్లు ఉన్నాయి (వాస్తవానికి ఇవి రెండు కూడా నిస్సాన్ అందిస్తున్న మైక్రా, సన్నీ సెడాన్లకు రీబ్యాడ్జ్ వెర్షన్లే). ఈ రీకాల్‌కు సంబంధించి తాము తమ కస్టమర్లను సంప్రదిస్తున్నామని, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లో ఏదైనా లోపాన్ని గుర్తిస్తే, ఉచితంగా దానిని సరిచేస్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Scala
Most Read Articles

English summary
In 2014 there were several manufacturers that issued recall of vehicles due to faulty parts. Honda, Ford, Toyota, almost all of them at some point called back vehicles for either minor or major faults. Now Renault India is ordering a recall of certain vehicles.
Story first published: Tuesday, January 20, 2015, 11:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X