చరిత్రను తిరగరాసిన రెనొ క్విడ్ బుకింగ్స్

By Anil

రెనొ క్విడ్ విషయంలో మనం అనుకున్నదే జరిగింది అయితే కంపెని విడుదల చేసిన ప్రకటన ప్రకారం రెనొ క్విడ్ బుకింగ్స్ లో అత్భుతం చోటు చేసుకుంది. ఎవరు ఊహించనటువంటి బుకింగ్స్ చోటు చేసుకున్నాయి. భారతదేశంలో కొన్ని సంవత్సరాల పాటు మారుతి ఆల్టో తనదైన ముద్ర వేసుకుంటు వస్తోంది అయితే రెనొ క్విడ్ యొక్క బుకింగ్స్ చూస్తే ఆల్టో చతికిల పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రెనొ క్విడ్ యొక్క ప్రత్యేకతల కోసం క్రింద గల స్లైడ్స్ మీద ఒక లుక్కేయండి.

రెనొ క్విడ్

రెనొ క్విడ్

సెప్టెంబర్ 24, 2015 న విడుదలైన రెనొ క్విడ్ తో అత్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపుగా 25,000 బుకింగ్స్ అయ్యాయి.

ఇందులో 40 శాతం మంది 28 సంవత్సరాల వయసులోపు వారు ఉండటం ఒక ఎత్తైతే వారిలో దాదాపుగా 15 శాతం మంది ఆడవాళ్లున్నారు.

రెనొ క్విడ్

రెనొ క్విడ్

రెనొ ఇండియా ఈ మోడల్ మీద ఎంతో సమయం మరియు దాదాపుగా 3000 కోట్ల రుపాయలను పెట్టుబడిగా పెట్టింది.

రెనొ

రెనొ

రెనొ నుండి వచ్చిన ఈ ప్రారంభ దశ హ్యాచ్‌బ్యాక్ దేశం అగ్రభాగాన ఉన్న మారుతి సుజుకి ఆల్టో 800 కి గట్టి పోటిగా నిలిచింది.

బుకింగ్స్ :

బుకింగ్స్ :

35 శాతం బుకింగ్స్ నాశిక్, రాజ్‌కోట్, లుథియానా, నాగ్‌పూర్, జలంథర్ వంటి నగరాలలో గల డీలర్స్ నుండి అయినట్లు సమాచారం.

అందుబాటు :

అందుబాటు :

త్వరలో పండుగ సీజన్ మొదలవుతుండటంతో, రెనొ క్విడ్ ని దేశవ్యాప్తంగా గల అన్ని రెనొ షోరూమ్‌లలో అందుబాటులోకి తేవాలిని యోచిస్తున్నారు.

ధర :

ధర :

రెనొ క్విడ్ ప్రవేశ స్థాయి వేరియంట్ యొక్క ప్రారంభ ధర రూ. 2,56,968 ఎక్స్-షోరూమ్ (ఢిల్లి) గా ఉంది.

మైలేజ్ :

మైలేజ్ :

రెనొ క్విడ్ భారతదేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ ఇంజన్ గల కారుగా చరిత్ర సృష్టించనుంది. దీని మైలేజ్ 25.17 కిలోమీటర్/లీటర్.

పోటి :

పోటి :

ఎంట్రి లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లలో రెనొ క్విడ్ ఈ క్రింది వాటికి గట్టి పోటిగా ఉండనుంది.

  • మారుతి ఆల్టో 800
  • టాటా నానొ
  • హ్యూందాయ్ ఇయాన్
  • డాట్సన్ గొ.
  • వేరియంట్స్ :

    వేరియంట్స్ :

    రెనొ క్విడ్ మనకు దాదాపుగా నాలుగు రకాల ఇంజిన్ వేరియంట్లను అందుబాటులోకి తెచ్చింది అవి.

    1.యస్.టి.డి

    2.ఆర్.ఎక్స్.ఇ

    3.ఆర్.ఎక్స్.ఇ(ఒ)

    4.ఆర్.ఎక్స్.ఎల్

    5.ఆర్.ఎక్స్.టి

    6.ఆర్.ఎక్స్.టి(ఒ)

    వారంటి :

    వారంటి :

    రెనొ క్విడ్ మీకు అందిస్తోంది 2-సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వరకు ఇందులో ఏది ముందుగా వస్తే దానికి వారంటి ఉంటుంది.

    ఇంజన్ స్పెసిఫికేషన్స్ :

    ఇంజన్ స్పెసిఫికేషన్స్ :

    • ఇంజన్ : 799సీసీ ఇంజిన్
    • హార్స్‌పవర్ : 84 హెచ్.పి
    • పవర్ : 53 బి.హెచ్.పి
    • టార్క్ : 72 ఎన్ఎమ్
    • స్పెసిఫికేషన్స్ :

      స్పెసిఫికేషన్స్ :

      ట్రాన్స్‌మిషన్ : 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్

      ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి: 28 లీటర్స్

      ఫూయల్ : పెట్రోల్

      Also Read : సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు. మరి అందులో మీ కారు ఉందా?

Most Read Articles

English summary
We expected this to happen, and now we have received official confirmation from Renault India. The all-new Kwid has received an overwhelming response
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X