సెకండ్ హ్యాండ్ కార్ వ్యాపారంలోకి ప్రవేశించనున్న రెనో ఇండియా

By Ravi

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త కార్ల వ్యాపారం కన్నా సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం జోరుగా ఉంటున్న నేపథ్యంలో, సాధారణ కార్ కంపెనీల నుంచి లగ్జరీ కార్ కంపెనీలు కూడా ఈ వ్యాపారంలోకి ప్రవేశించి ప్రత్యేకంగా వీటి విక్రయాలు సాగిస్తున్నాయి. తాజాగా.. ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా ప్రీ-ఓన్డ్ (సెకండ్ హ్యాండ్/యూజ్డ్) కార్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

రెనో ఇండియా తమ సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ అవుట్‌లెట్ల ద్వారా కేవలం తమ (రెనో) బ్రాండ్ కార్లను మాత్రమే కాకుండా ఇతర బ్రాండ్లకు చెందిన వాహనాలను కూడా విక్రయించాలని భావిస్తోంది. ఎక్సేంజ్ ఆఫర్ల ద్వారా వచ్చిన కార్లను రీట్యూన్ చేసి ప్రీ-ఓన్డ్ కార్ షోరూమ్‌లలో విక్రయించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పలు కార్ కంపెనీలు ఈ తరహా వ్యాపారంలో మంచి విజయాన్ని సాధించాయి.

renault used vehicle india

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు మారుతి సుజుకి తమ ట్రూ వ్యాల్యూ అనే బ్రాండ్ ద్వారా ప్రీఓన్డ్ కార్లను విక్రయిస్తుంటే, మహీంద్రా తమ ఫస్ట్ ఛాయిస్ ద్వారా, టొయోటా తమ ఐట్రస్ట్ ద్వారా సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తున్నారు.

రెనో కంపెనీ సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం కొత్తేమీ కాదు. అనేక దేశాల్లో రెనో ఈ తరహా వ్యాపారాన్ని సాగిస్తోంది. ఈ నేపథ్యంలో, భారత మార్కెట్లో కూడా ఈ వ్యాపారంలో మంచి విజయాన్ని సాధించగలమని కంపెనీ ధీమాగా ఉంది. ప్రస్తుతం ఇది ప్రారంభ దశలో ఉంది కాబట్టి, తమ ప్రీ-ఓన్డ్ కార్ బ్రాండ్ పేరును కంపెనీ ఇంకా ఖరారు చేసుకోలేదని తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
French automobile manufacturer, Renault offers a few products in India. They are definitely not among the top sellers and only a few of their products are doing well. Now the manufacturer is setting up plans to enter the used vehicle business to create more presence.
Story first published: Monday, March 9, 2015, 10:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X