రెనో పల్స్, స్కాలా ఉత్పత్తి బంద్.. కారణం ఏంటంటారు..?

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న పల్స్ హ్యాచ్‌బ్యాక్, స్కాలా సెడాన్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. గత కొంత కాలంగా ఈ మోడళ్ల అమ్మకాలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మే 2014లో 180 స్కాలా కార్లను ఉత్పత్తి చేసిన తర్వాత రెనో ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేసింది. అలాగే, అక్టోబర్ 2014లో రెనో ఇండియా 59 పల్స్ కార్లను ఉత్పత్తి చేసిన తర్వాత ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలుస్తోంది.

Renault Stops Pulse and Scala Production Due To Slow Sales

ఏదేమైనప్పటికీ, రెనో ఇండియా మాత్రం ఈ మోడళ్లను భారత మార్కెట్ నుంచి తొలగించే యోచనలో లేదు. ఈ రెండు మోడళ్ల ఇన్వెంటరీని సర్దుబాటు చేసుకునేందుకే రెనో వీటి ఉత్పత్తిని తాత్కాలికంగా ఆపివేసినట్లు సమాచారం. పరిశ్రమ వర్గాల సమాచారాన్ని పరిశీలిస్తే.. రెనో పల్స్, రెనో స్కాలా మోడళ్లలో కంపెనీ కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్లను ప్రవేశపెట్ట వచ్చని తెలుస్తోంది. నిస్సాన్ మైక్రా, నిస్సాన్ సన్నీ మోడళ్లకు రీబ్యాడ్జ్‌డ్ వెర్షన్లే ఈ రెనో పల్స్, మైక్రా.

గడచిన ఏప్రిల్ 2014 - జనవరి 2015 మధ్య కాలంలో రెనో పల్స్ అమ్మకాలు 53 శాతం పడిపోయి, 1646 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో నిస్సాన్ మైక్రా అమ్మకాలు కూడా 35 శాతం పడిపోయి 7040 యూనిట్లుగా నమోదయ్యాయి. అలాగే, ఇదే సమయంలో రెనో స్కాలా అమ్మకాలు 10 నెలల కనిష్టానికి పడిపోయి 74 శాతం తగ్గి 1777 యూనిట్లుగా నమోదు కాగా, నిస్సాన్ సన్నీ అమ్మకాలు కూడా 38 శాతం తగ్గి 4373 యూనిట్లుగా నమోదయ్యాయి.

Most Read Articles

English summary
According to data released by the Society of Indian Automobile Manufacturers (Siam), the French carmaker Renault India has stopped the production of its Pulse hatchback and Scala sedan due to slow sales.
Story first published: Tuesday, February 24, 2015, 12:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X