ఐఫోన్ కంపెనీ యాపిల్ సీక్రెట్‌గా కారు తయారు చేస్తోందా..?

By Ravi

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్, ఇప్పుడు మొబైల్స్ వది ఆటోమొబైల్స్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఐఫోన్ల తయారీ కంపెనీ యాపిల్, ఓ ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేస్తోందట. ఇప్పటికే, ఈ ప్రాజెక్టుపై 100 మందికి పైగా పనిచేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, యాపిల్ 'టైటన్' అనే కోడ్‌నేమ్‌తో ఓ మినీవ్యాన్ లాంటి ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టెస్లాకు పోటీగా యాపిల్ ఎలక్ట్రిక్ వాహనం రానుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

యాపిల్ చేపట్టిన ఈ ఎలక్ట్రిక్ వాహన ప్రాజెక్ట్ ఇన్షియల్ డిజైన్ ఓ మినీవ్యాన్‌ను తలపిస్తోందని ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. దాదాపు ఏడాది క్రితమే ఓ మాజీ ఫోర్డ్ ఇంజనీర్, యాపిల్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ జాడెస్కైల ఆధ్వర్యంలో సుమారు 1000 మంది ఈ ప్రాజెక్టుపై పనిచేయటం ప్రారంభించినట్లు కూడా సదరు పత్రిక పేర్కొంది.

ఇదిలా ఉండగా.. యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్ 2012లో మరణించిన తర్వాత కొన్ని అతని మిత్రుడు, యాపిల్ సంస్థ బోర్డ్ సభ్యులైన మైకీ డ్రెక్స్లర్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసినదే. స్టీవ్ జాబ్స్ బ్రతికి ఉన్న సమయంలో తాను ఓ 'ఐకార్' (iCar)ను డిజైన్ చేయాలని కలగనేవారని డ్రెక్స్లర్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసినదే.

Most Read Articles

English summary
According to the Wall Street Journal report, The Cupertino, California based company has several hundred employees working secretly toward creating an Apple-branded electric vehicle. The project, code-named “Titan,” initially is working on the design of a vehicle that resembles a minivan.
Story first published: Saturday, February 14, 2015, 11:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X