భారత్‌లో రీఎంట్రీ ఇవ్వనున్న స్కొడా ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్

By Ravi

చెక్ రిపబ్లికన్ కార్ కంపెనీ స్కొడా, భారత మార్కెట్లో నిలిపివేసిన తమ పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఫ్యాబియాలో ఓ నెక్స్ట్ జనరేషన్ వెర్షన్‌ను తిరిగి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలో జరిగిన 2014 ప్యారిస్ మోటార్ షోలో స్కొడా ఆవిష్కరించిన యూరోపియన్ వెర్షన్ ఫ్యాబియాను ఆధారంగా చేసుకొని భారత మార్కెట్ కోసం కొత్త ఫ్యాబియాను డిజైన్ చేయనున్నారు.

ఈ సరికొత్త 2015 స్కొడా ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్‌లో అనేక కాస్మోటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉండనున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

2015 స్కొడా ఫ్యాబియా

గ్లోబల్ వెర్షన్ స్కొడా ఫ్యాబియా మూడు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.0 లీటర్, 3-సిలిండర్ ఇంజన్ మరియు 1.2 లీటర్, 4-సిలిండర్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. డీజిల్ వెర్షన్ 1.4 లీటర్, 3-సిలిండర్ ఇంజన్‌తో లభ్యం కానుంది. ఇందులో ఓ గ్రీన్‌లైన్ డీజిల్ ఇంజన్‌ను కూడా పరిచయం చేయనున్నారు. ఈ ఇంజన్లనీ కూడా ఈయూ6 కాలుష్య నిబంధనలను పాటిస్తాయి.

2015 స్కొడా ఫ్యాబియా

ఈ ఇంజన్లన్నీ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో లభిస్తాయి. ఈ ఇంజన్‌లను కస్టమర్ల కోరిక మేరకు ట్యూన్ చేసి ఇస్తారు. ఉదాహరణకు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను 60 బిహెచ్‌పిల నుంచి 110 బిహెచ్‌పిల వరకు, 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను 75 బిహెచ్‌పిల నుంచి 105 బిహెచ్‌పిల వరకు ట్యూన్ చేసిస్తారు.

2015 స్కొడా ఫ్యాబియా

కొత్త 2015 స్కొడా ఫ్యాబియాలో పూర్తిగా రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రీడిజైన్డ్ స్టయిలిష్ 3-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్‌పై వివిధ కంట్రోల్స్, డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద ఏసి వెంట్స్ వంటి మార్పులు ఉండనున్నాయి.

2015 స్కొడా ఫ్యాబియా

ఇండియన్ మార్కెట్‌కు రానున్న నెక్స్ట్ జనరేషన్ స్కొడా ఫ్యాబియాలో 1.2 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. స్కొడా ఇండియా తొలిసారిగా 2008లో ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. నిర్మాణ నాణ్యత, సౌకర్యం, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లతో ఫ్యాబియా మంచి ప్రీమయం కార్‌గా నిలిచింది.

Most Read Articles

English summary
Skoda is planning of re-introducing its premium hatchback for India. The success of Hyundai Elite i20, Maruti Suzuki Swift and several other hatchback is forcing Skoda to bring its Fabia back to India.
Story first published: Monday, March 16, 2015, 17:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X