సెకండ్ సీజన్ టాటా ట్రక్ రేస్ టైటిల్ కూడా స్టువర్ట్ ఆలివర్‌దే

By Ravi

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ గడచిన ఆదివారం నిర్వహించిన సెకండ్ సీజన్ 2015 టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో వరసుగా రెండవ సారిగా క్యాస్ట్రాల్ జట్టే నెగ్గింది. క్యాస్ట్రాల్ వెక్టన్ జట్టుకు చెందిన స్టువర్ట్ ఆలివర్ వరుసగా రెండవ సీజన్‌లో కూడా ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు.

శనివారం జరిగిన సూపర్ క్వాలిఫైయింగ్‌‍లో గ్రిడ్‌పై సెకండ్ పొజిషన్‌లో స్టార్ట్ అయిన ఆలివర్, ఆదివారం నాడు జరిగిన 16-ల్యాప్ ఫైనల్ రేసులో అద్భుతమైన ప్రతిభను చూపించి జట్టుకు టైటిల్ తెచ్చిపెట్టాడు.

కాగా.. గడచిన శనివారం నిర్వహించిన క్వాలిఫైయింగ్ రౌండ్‌లో ఫాస్టెస్ట్ డ్రైవర్‌గా నిలిచిన టీమ్ అల్లీడ్ పార్ట్‌నర్స్ జట్టుకి చెందిన స్టీవ్ థామస్ ఆదివారం జరిగిన ఫైనల్ రేసులో తొలి రన్నరప్‌గా నిలువగా, టాటా టెక్నాలజీస్ జట్టుకి చెందిన స్టీవెన్ పౌవెల్ రెండవ రన్నరప్‌గా నిలిచాడు.

Stuart Oliver Wins In Season II T1 Prima Truck Racing

సెకండ్ సీజన్ టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్‌ను వీక్షించేందుకు సుమారు 45,000 మందికి పైగా వీక్షకులు బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌‌కి విచ్చేశారు. ఈ రేసులో మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి (1. క్యాస్ట్రాల్ వెక్టన్ 2. కమ్మిన్స్ 3. టాటా టెక్నాలజీస్ మోటార్‌స్పోర్ట్స్ 4. డీలర్ వారియర్స్ 5. డీలర్ డేర్‌డెవిల్స్ 6. అల్లైడ్ పార్ట్‌నర్స్).

టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ కోసం టాటా మోటార్స్ ప్రత్యేకంగా మోడిఫై చేసిన 12 టాటా ప్రైమా బ్రాండ్ ట్రక్కులను ఉపయోగించారు. బ్రిటీష్ మరియు యూరోపియన్ ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లలో పేరుగాంచిన అంతర్జాతీయ ట్రక్ రేసింగ్ డ్రైవర్లు ఈ ట్రక్కులను నడిపారు. సెకండ్ సీజన్ టాటా ప్రైమా ట్రక్ రేస్ కోసం ఉపయోగించిన ట్రక్కులు మునుపటి సీజన్‌లో ఉపయోగించిన ట్రక్కుల కన్నా మరింత సమర్థవంతమైనవి.

మొదటి సీజన్‌లో ఉపయోగించిన టాటా ప్రైమా ట్రక్కులతో పోల్చుకుంటే ఈ రెండవ సీజన్‌లో ఉపయోగించిన టాటా ప్రైమా ట్రక్కులు మరింత ఉత్తమ ఏరోడైనమిక్ డిజైన్‌ని కలిగి ఉండి 10 శాతం ఎక్కువ వేగాన్ని, 10 శాతం ఎక్కువ యాక్సిలరేషన్‌ను మరియు 10 శాతం తక్కువ బరువును కలిగి ఉంటాయని కంపెనీ వివరించింది.

Most Read Articles

English summary
At the action-packed, rain-hit Season II T1 Prima Truck Racking, STUART OLIVER of TEAM CASTROL VECTON captured glory yet again. Starting second on the grid in SUPER QUALIFYING, he went on to clinch the title for the second time, in the 16-lap FINAL RACE, helping TEAM CASTROL VECTON grab Team Title.
Story first published: Monday, March 16, 2015, 9:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X