టాటా మోటార్స్ నుంచి ఆరు కొత్త ఎస్‌యూవీలు వస్తున్నాయ్!

By Ravi

భారత ఆటోమొబైల్ మార్కెట్లోని యుటిలిటీ వాహన విభాగంలో నానాటికీ అధికమవుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు గాను దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.

రానున్న రోజుల్లో ఆరు కొత్త ఎస్‌యూవీలను మార్కెట్‌కు పరిచయం చేయాలని టాటా మోటార్స్ భావిస్తోంది. టాటా తమ ఎస్‌యూవీలకు మరింత అప్‌మార్కెట్ ఫీల్‌నిచ్చేందుకు గాను ల్యాండ్ రోవర్ నుంచి ఇన్‌పుట్స్ సేకరించనున్నట్లు సమాచారం.

Tata Hex 01

టాటా మోటార్స్ మొత్తం 9 వాహనాలను విడుదల చేయనుంది. ఇందులో ఆరు సరికొత్త ఎస్‌యూవీలు, మిగిలి మూడు రిఫ్రెష్డ్ మోడళ్లుగా ఉండనున్నాయి. క్రాసోవర్, కాంపాక్ట్ ఎస్‌యూవీ, ప్రీమియం వంటి విభిన్న సెగ్మెంట్లలలో ఈ వాహనాలను ప్రవేశపెడుతారు.

ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న సఫారీ స్టోర్మ్, సఫారీ, సుమో వాహనాల్లో కూడా కొత్త వెర్షన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే, టాటా అందిస్తున్న ఆరియా క్రాసోవర్‌లో కూడా ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Tata Hexa 02

ఇటీవల జరిగిన పలు ఆటో షోలలో టాటా మోటార్స్ నెక్సన్, హెక్సా వంటి పలు ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ వాహనాలను ప్రదర్శనకు ఉంచింది. ఇందులో కొన్ని వాహనాలు ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.
Most Read Articles

English summary
Tata Motors was one of the pioneers in introducing Utility Vehicles for the masses. They have, however, lost their market share and have been struggling selling their products in India.
Story first published: Monday, March 23, 2015, 9:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X