టాటా బోల్ట్ పెర్ఫార్మెన్స్ వెర్షన్ వస్తోంది..

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న లేటెస్ట్ మోడల్ టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ పెర్ఫార్మెన్స్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల నుంచి జరగనున్న 2015 జెనీవా మోటార్ షోలో టాటా మోటార్స్ కొన్ని సరికొత్త ఉత్పత్తులను ప్రదర్శించనుంది. వాటిలో టాటా బోల్ట్ పెర్ఫార్మెన్స్ హ్యాచ్‌బ్యాక్ కూడా ఒకటి.

ఈ ఏడాది చివరి నాటికి టాటా బోల్ట్ పెర్ఫార్మెన్స్ హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. రెగ్యులర్ టాటా బోల్ట్‌తో పోల్చుకుంటే, ఈ పెర్ఫార్మెన్స్ వెర్షన్ టాటా బోల్ట్ కారులో అనేక అప్‌డేట్స్ ఉండనున్నాయి. ఈ పెర్ఫార్మెన్స్ కారులో అదే 1.2 లీటర్ రెవోట్రాన్ ఇంజన్‌ను ఉపయోగించినప్పటికీ, ఈ ఇంజన్ గరిష్టంగా 120 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయనున్నారు.

tata bolt at geneva motor show

అంతేకాకుండా.. ఈ కారులో ఫియట్ సి501 గేర్‌బాక్స్‌ను ఉపయోగించనున్నారు. స్పోర్టీ లుక్ కోసం బంపర్లను రీడిజైన్ చేయనున్నారు. సస్పెన్షన్‌ను కూడా అప్‌డేట్ చేయనున్నారు. ఇందులో బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ కోసం 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ అమర్చనున్నారు.

కాగా.. ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి -

టాటా బోల్ట్ పెట్రోల్ ఇంజన్ స్పెసిఫికేషన్స్:
పెట్రోల్ వెర్షన్ టాటా బోల్ట్ కారులో, టాటా మోటార్స్ అందిస్తున్న సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఇందులో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) కానీ లేదా ఫుల్లీ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్ కానీ అందుబాటులో లేదు.

టాటా బోల్ట్ డీజిల్ ఇంజన్ స్పెసిఫికేషన్స్:

డీజిల్ వెర్షన్ టాటా బోల్ట్ కారులో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు ఈ ఇంజన్ గరిష్టంగా 75 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. అయితే, టాటా జెస్ట్ మాదిరిగా డీజిల్ వెర్షన్ బోల్ట్ టాప్-ఎండ్ వేరియంట్‌లో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) ఆప్షన్ అందుబాటులో లేదు.

tata bolt showcased geneva motor show

మైలేజ్:
కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, టాటా బోల్ట్ మైలేజ్ వివరాలు ఇలా ఉన్నాయి:
పెట్రోల్ వెర్షన్ బోల్ట్ - 17.57 కెఎంపిఎల్
డీజిల్ వెర్షన్ బోల్ట్ - 22.95 కెఎంపిఎల్

Most Read Articles

English summary
India's most popular four-wheeler manufacturer, Tata Motors will be present at the 2015 Geneva Motor Show. They will be showcasing an array of products at the motor show. The automobile giant will be showcasing a performance oriented hatchback as well.
Story first published: Saturday, February 28, 2015, 15:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X