క్లిష్టమైన ఆర్మీ పరీక్షలను పాసైన మహీంద్రా స్కార్పియో, టాటా సఫారీ

By Ravi

భారత సైన్యం తమ వాహనాలను అప్‌గ్రేడ్ చేసుకోవాలని చూస్తోందా..? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రస్తుతం మారుతి సుజుకి జిప్సీ వాహనాలను అధికంగా ఉపయోగిస్తున్న ఇండియన్ ఆర్మీ, తాజాగా మహీంద్రా, టాటా అందిస్తున్న వానాలను పరీక్షిస్తోంది.

ఆర్మీ నిర్వహించిన కీలక పరీక్షలలో మహీంద్రా స్కార్పియో, టాటా సఫారీ స్టోర్మ్ మోడళ్లు పాసైనట్లు సమాచారం. ఆర్మీ కోసం వాహనాలు తయారు చేయటానికి అనేక కంపెనీలు ఆసక్తి చూపినప్పటికీ, భారత సైన్యం మాత్రం మహీంద్రా, టాటా మోటార్స్ వాహనాలనే విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది.

Mahindra Scorpio

కొత్త వాహనాల కొనుగోలు కోసం ఆర్మీ రూ.500 కోట్ల నుంచి రూ.750 కోట్లు వెచ్చించవచ్చని అంచనా. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు ఆర్మీ వాహనాల కోసం టెండర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఆర్మీ ఉపయోగానికి అనువుగా ఉండేలా మహీంద్రా, టాటా తమ వాహనాలను మరింత ధృడంగా, అనేక ఆఫ్-రోడింగ్ ఫీచర్లతో వీటిని తయారు చేయనున్నాయి. టైర్లు మొదలుకొని ఇంజన్ పెర్ఫార్మెన్స్‌ వరకూ వివిధ అంశాలను ట్యూన్ చేసే అవకాశం ఉంది.

Tata Safari Storme

ఈ ఆర్మీ వెర్షన్ వాహనాలలో కాన్వాయ్ ల్యాంప్స్, బ్లాక్ అవుట్ లైట్స్, నీటిని స్టోర్ చేసుకునే వెసలుబాటు, ఆర్మీ పరికరాలను లాగేందుకు వీలైన హుక్స్ ఇంకా అనేక ఆర్మీ సంబంధిత పరికరాలతో ఈ వాహనాలను కస్టమైజ్ చేస్తారు.
Most Read Articles

English summary
Currently the Army makes use of Maruti Suzuki's Gypsy along with Mahindra's Commander. They now want to acquire new vehicles and have put out a notice for manufacturers to come and showcase their strengths in rigorous tests conducted by the Army. This deal is expected to amount to about INR 500 crore to INR 750 crore.
Story first published: Thursday, January 22, 2015, 18:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X