టాటా సఫారి స్ట్రామ్ వారికర్ 400 వియక్స్ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌యువి5OO

By Anil

భారతీయ మార్కెట్లో అతి పెద్ద యస్‌యువి వాహనాల తయారీ సంస్థలు టాటా మోటార్స్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా. చాలా సంవత్సరాల కాలంగా ఈ రెండుసంస్థలు భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లోకి విసృతమైన యస్‌యువి వాహనాలను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండు సంస్థలు మధ్య పోటి విపరీతంగా పెరిగిపోయింది. ఇందులో భాగంగానే ఈ రెండు దేశీయ వాహన సంస్థలు ఒకదాని మీద ఒకటి పోటితో మార్కెట్లోకి వాహనాలను అందిస్తోంది.

టాటా మోటార్స్ వారు ఈ మధ్యనే మార్కెట్లోకి సఫారి స్టార్మ్ వారికోర్ యస్‌యువిని ప్రవేశ పెట్టారు. ఇది మహీంద్రా వారి ఎక్స్‌యువి5OO కారుకు పోటిగా నిలిచింది. అయితే ఈ రెండు యస్‌యువిలలో లగ్జరీ ఫీచర్ల విషయంలో ఏ మాత్రం తీసిపోవు.

అయితే ఆ రెండు యస్‌యువి వాహనాల ధర, ఇంజన్, డిజైన్, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు భద్రత వంటి వాటి గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం.

ధర

ధర

  1. టాటా సఫారి స్టార్మ్ వారికోర్ 400వియక్స్ 4x4 ధర రూ. 14.59 లక్షలు
  2. మహీంద్రా ఎక్స్‌యువి5OO డబ్ల్యూ10 ధర రూ. 15.99 లక్షలు

(గమనిక: రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

సఫారి స్టార్మ్ డిజైన్

సఫారి స్టార్మ్ డిజైన్

టాటా సఫారి స్టార్మ్ వారికోర్ విఎక్స్ చూడటానికి ముందు తరం సఫారి డిజైన్‌ను పోలి ఉంటుంది. అయితే ముందు గల గ్రిల్ డిజైన్‌లో కొన్న మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక దీనిని సైడ్ నుండి ఒక లుక్ వేసుకున్నట్లయితే ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ లుక్ ఇందులో కనపడుతుంది.

 మహీంద్రా ఎక్స్‌యువి 5OO డిజైన్

మహీంద్రా ఎక్స్‌యువి 5OO డిజైన్

సరికొత్త మహీంద్రా ఎక్స్‌యువి 5OO డిజైన్ లో చాలా వరకు చిన్న చిన్న మార్పులు చోటుచేసుకున్నాయి. ఫ్రంట్ బంపర్స్, ఫ్రంట్ గ్రిల్, సరికొత్త ల్యాంప్స్, వీటికి తోడుగా పగటి పూట వెలిగే లైట్లు దీనికి మరింత అందాన్ని చేకూర్చాయి. మొత్తంగా దీని డిజైన్ చూడటానికి ఎంతో బాగుంది.

సఫారి ఇంజన్

సఫారి ఇంజన్

టాటా సఫారి స్టార్మ్ వారికోర్ 400విఎక్స్ లో 2.2-లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 154 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 మైలేజ్ మరియు ట్రాన్స్‌మిషన్

మైలేజ్ మరియు ట్రాన్స్‌మిషన్

టాటా సఫారి స్టార్మ్ వారికోర్ లో గల ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది. మరియు ఇది 13.9 కిలో మీటర్ల మైలేజ్ ఇవ్వడంలో సహాయపడుతుంది. ఇందులో నాలుగు చక్రాలకూడా పవర్ అందివ్వడానికి ఎలక్ట్రానిక్ షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలదు.

 ఎక్స్‌యువి 5OO ఇంజన్

ఎక్స్‌యువి 5OO ఇంజన్

మహీంద్రా వారి ఎక్స్‌యువి 5OO లో 2.2-లీటర్ టర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు, ఇది దాదాపుగా 140 బిహెచ్‌పి పవర్ మరియు 330 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేస్తుంది.

మైలేజ్ మరియు ట్రాన్స్‌మిషన్

మైలేజ్ మరియు ట్రాన్స్‌మిషన్

మహీంద్రా వారి ఎక్స్‌యువి 5OO లో గల ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను అమర్చారు. ఇది మీకు లీటర్‌కు 16 కిలో మీటర్లు మైలేజ్ ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇందులో కూడా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కలదు.

సఫారి స్టార్మ్ ఫీచర్లు

సఫారి స్టార్మ్ ఫీచర్లు

ఇందులో హార్మాన్ వారి కనెక్ట్ నెక్ట్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. మరియు పార్కింగ్ సెన్సార్స్, డ్రైవర్ సీట్‌ను మ్యాన్యువల్ గా అడ్జెస్ట్ చేసుకునే వెసులు బాటును కల్పించారు.

ఎక్స్‌యువి 5OO ఫీచర్లు

ఎక్స్‌యువి 5OO ఫీచర్లు

ఇందులో ఎలక్ట్రానికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే సీట్లు, వివిధ రకాల కంట్రోల్స్ ను కలిగిన స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ గైడెన్స్, పార్కింగ్ సెన్సార్లు, పుష్ బటన్ స్టార్ట్, 2-డిఐయన్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు న్యావిగేషన్ వంటి ఫీచర్లు కలవు.

సఫారి లోని భద్రత

సఫారి లోని భద్రత

ఇందులో యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఎయిర్ బ్యాగ్‌లను కల్పించారు.

ఎక్స్‌యువి 5OO లోని భద్రత ఫీచర్లు

ఎక్స్‌యువి 5OO లోని భద్రత ఫీచర్లు

ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్ మరియు బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు కలవు. అయితే సఫారీలో రెండు ఎయిర్ బ్యాగ్‌ల మాత్రమే ఉన్నాయి.

తీర్పు

తీర్పు

మరి ఇందులో దేనిని ఎంచుకుంటారు ? సఫారి స్టార్మ్ ధర మరియు పవర్ పరంగా బాగానే ఉంటుంది. కాని ఫీచర్లు, భద్రత, వంటి విషయాల దగ్గరికి వస్తే సఫారి ఎక్స్‌యువి 5OO ముందు వెనక్కి తగ్గాల్సిందే. మహీంద్రా ఎక్స్‌యువి 5OO మన డబ్బుకు అసలైన విలువని ఇస్తుందని మా అభిప్రాయం.

మరి కథనాలు....
  1. మహీంద్రా అండ్ మహీంద్రా నుండి సరికొత్త కాంపాక్ట్ యస్‌యువి యస్101
  2. డిసి అవంతి లిమిటెడ్ ఎడిషన్ 310 ఆవిష్కరణ: త్వరలో విడుదల
  3. భారతీయ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ కార్లు: ఇందులో మీ కారు ఉందా?

Most Read Articles

English summary
SUV Comparo: Tata Safari Storme Varicor 400 VX vs Mahindra XUV500
Story first published: Friday, December 18, 2015, 11:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X