టాటా జెస్ట్ సేల్స్ పరిస్థితి ఏంటి.. హిట్టా లేక ఫట్టా..!?

By Ravi

టాటా మోటార్స్ నుంచి సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌తో వచ్చిన 'టాటా జెస్ట్' (Tata Zest) కాంపాక్ట్ సెడాన్ కస్టమర్లను ఆకట్టుకోవటంలో అంత విజయవంతం కాలేదనిపిస్తోంది. ఈ మోడల్ మార్కెట్లో విడుదలై దాదాపు ఆరు నెలలు కావస్తున్నప్పటికీ, అమ్మకాలు కంపెనీ మాత్రం ఆశించిన రీతిలో సాగటం లేదని సమాచారం.

కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో టాటా జెస్ట్ పోటీగా ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఎక్సెంట్ మోడళ్ల అమ్మకాలు మాత్రం జోరుగానే సాగుతున్నాయి. కానీ, ఇదే సమయంలో టాటా జెస్ట్ అమ్మకాలు మాత్రం ప్రతినెలా తగ్గముఖం పడుతూ వస్తున్నాయి.

గడచిన మూడు నెలలుగా చూస్తే.. డిసెంబర్‌లో 3825 యూనిట్లు, జనవరిలో 3056 యూనిట్లు, ఫిబ్రవరిలో 2757 యూనిట్లు (మొత్తంగా మూడు నెలలకు కలిపి 9648 యూనిట్ల) టాటా జెస్ట్ కార్లు అమ్ముడుపోయాయి. మరి రానున్న రోజుల్లోనైనా ఈ మోడల్ అమ్మకాలు పుంజుకుంటాయో లేదో వేచి చూడాలి.

Tata Zest Compact Sedan Sales Yet To Improve

ఇక టాటా జెస్ట్ విషయానికి వస్తే.. ఇది మొత్తం 7 వేరియంట్లలో (3 పెట్రోల్, 4 డీజిల్) లభ్యం కానుంది. అన్ని పెట్రోల్ వెర్షన్లు మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభిస్తాయి. కాగా.. డీజిల్‌లో వెర్షన్‌లో టాప్-ఎండ్ వేరియంట్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)తో లభిస్తుంది.

టాటా జెస్ట్ పెట్రోల్ ఇంజన్:
పెట్రోల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో కంపెనీ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఇందులో కంప్లీట్ ఆటోమేటిక్ కానీ లేదా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) కానీ అందుబాటులో లేదు.

టాటా జెస్ట్ డీజిల్ ఇంజన్:
డీజిల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. డీజిల్ వెర్షన్ టాప్-ఎండ్ వేరియంట్ మాత్రం ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)తో లభిస్తుంది. ఈ ఏఎమ్‌టి ఇటలీకి చెందిన మాగ్నెటి మారెల్లీ సంస్థ సహకారంతో తయారు చేశారు.

Tata Zest Compact Sedan

మైలేజ్:
ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) సర్టిఫై చేసిన దాని ప్రకారం, పెట్రోల్ వెర్షన్ టాటా జెస్ట్ లీటరుకు 17.6 కిలోమీటర్ల మైలేజీని, డీజిల్ వెర్షన్ టాటా జెస్ట్ లీటరుకు 23.0 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

ఫీచర్లు:
ప్రీమియం కార్లలో లభించే పాపులర్ హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను టాటా మోటార్స్ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో పరిచయం చేసింది. ఇందులోని 5 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అడ్వాన్స్డ్ వాయిస్ కమాండ్ రికగ్నైజేషన్, ఎస్ఎమ్ఎస్ నోటిఫికేషన్ అండ్ రీడ్ అవుట్స్, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్స్ వంటి ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Zest from Tata Motors, clearly showcases the three key vectors of DesigNext, DriveNext and ConnectNext to deliver best-in-class performance with unparalleled driving pleasure in a spacious, dynamic, comfortable and stylish sedan.
Story first published: Monday, February 16, 2015, 15:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X