టాటా జికా వర్సెస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10: ఇందులో ఏది ఉత్తమం?

By Anil

టాటా మోటార్స్ వారి తరువాత కారు "జికా" మరియు దీని కోడ్ పేరు కైట్. గత రెండు నెలల క్రింత రెనొ క్విడ్ సృష్టించిన సునామినే ఇప్పుడు ఈ టాటా జికా సృష్టించబోతోంది. గత నెలలో హ్యుందాయ్ మోటార్స్ అత్యధికంగా అమ్మిన కార్లలో గ్రాండ్ ఐ10 మోడల్ ఒకటి, ఈ కారుకు ఇప్పుడు టాటా జికా పొటిగా నిలబడింది.
Also Read: టాటా "జికా" రివ్యూ: భారతీయ మార్కెట్లో ఇది ఒక అద్బుతం

మార్కెట్లో గ్రాండ్ ఐ10 కారుకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ తరుణంలో టాటా జికా ఈ కారుకు గట్టి పోటిని ఇవ్వగలదా. ఆయితే ఈ రెండు కార్ల మధ్య ఉన్న తేడాలను క్రింద గల కథనాల ద్వారా తెలుసుకుందా. అప్పుడు ఏ కారు ఉత్తమమైనదో తెలుసుకుందాం.

టాటా జికా డిజైన్ :

టాటా జికా డిజైన్ :

టాటా జికా డిజైన్ ఆద్భుతం- జికా కారును చూసిన ప్రతి ఒక్కరు చెప్పేమాట దీని డిజైన్ అద్భుతం. షార్ఫ్ లైన్స్, స్లోపింగ్ రియర్ విండో, మరియు ఇందులోల కొత్తగా స్నబ్ నోస్ డిజైన్‌ను పరిచయం చేశాడు. అంతే కాకుండా ఇలాంటి డిజైన్‌ మరే ఇతర టాటా మోడల్స్‌లో కూడా లేదు, ఇది దీనికి అతి పెద్ద్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 డిజైన్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 డిజైన్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారు డిజైన్ కూడా పర్వాలేదనిపిస్తుంది. హ్యుందాయ్ ఇంజనీర్లు దీనికి అన్ని వైపులా చక్కటి డిజైన్‌ను కల్పించారు. దీని ఫ్రంట్ గ్రిల్ మీద న్యారో క్రోమ్ ఇన్సర్ట్ చేశారు, స్వెఫ్ట్ బ్యాక్ హెడ్ లైట్స్ ఇందులో అందించారు.

 టాటా జికా ఫీచర్లు:

టాటా జికా ఫీచర్లు:

టాటా జికాలో గల అద్బుతమైన ఫీచర్లు మీ ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేస్తాయి. ముఖ్యంగా ఇందులో రివర్స్ పార్కింగ్ కెమెరా కలదు, బ్లూటూత్ న్యావిగేషన్, స్మార్ట్ ఫోన్‍‌‌తో అనుసంధానం గల ఇన్ఫోటైన్‌మెంట్, పవర్ విండోస్, హర్మాన్ ఆడియో సిస్టమ్ దాదాపుగా బోల్ట్ మరియు జెస్ట్ కార్లలో ఉన్న అన్ని ఫీచర్లు ఇందులోకల్పించారు.

 గ్రాండ్ ఐ10 ఫీచర్లు:

గ్రాండ్ ఐ10 ఫీచర్లు:

ఇందులో కూడా భారీ స్థాయిలో ఫీచర్లు ఉన్నాయి. 2-డిఐయన్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్, వెనుకవైపునకు ఎ/సి, డ్రైవర్ సీటు యొక్క ఎత్తును అడ్జస్ట్ చేసుకునే సౌలభ్యం, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, పుష్ బటన్ స్టార్ట్, కూల్డ్ గ్లూవ్ బాక్స్.

టాటా జికా ఇంజన్:

టాటా జికా ఇంజన్:

ఇందులో రెండు రకాల ఇంజన్‌ ఆప్షన్‌లు కలవు.

  1. మూడు సిలిండర్లు గల 1,199 సీసీ పెట్రోల్ ఇంజన్ దాదాపుగా 84 బిహెచ్‌పి మరియు 114 యన్‌యమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
  2. ఇందులో ఉన్న మూడు సిలిండర్ల 1,047 సీసీ గల డీజల్ ఇంజన్ దాదాపుగా 69 బిహెచ్‌పి మరియు 140 యన్‌యమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఇంజన్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఇంజన్

గ్రాండ్ ఐ10 లో కూడా రెండు రకాల ఇంజన్ ఆప్షన్‌లు కలవు.

  1. 1,197 సీసీ గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ దాదాపుగా 82 బిహెచ్‌‌పి మరియు 113 యన్‌యమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
  2. 1,120 సీసీ గల 3-సిలిండర్ల డీజల్ ఇంజన్ దాదాపుగా 70 బిహెచ్‌పి పవర్ మరియు 160 యన్‌యమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
 టాటా జికా ట్రాన్స్‌మిషన్:

టాటా జికా ట్రాన్స్‌మిషన్:

టాటా జికా రెండు ఇంజన్‌ ఆప్షన్‌లలో కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందించారు.

 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 లో :

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 లో :

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 లో కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు. మరియు ఇందులో ఉన్న పెట్రోల్ వేరియంట్‌లో 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు.

 మైలేజ్

మైలేజ్

టాటా జికా పెట్రోల వేరియంట్ కారు దాదాపుగా లీటర్‌కు 20 కిలోమీటర్లు మరియు డీజల్ వేరియంట్ కారు దాదాపుగా 25 కిలోమీర్ల మైలేజ్‌ని ఇస్తాయి.

 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మైలేజ్:

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మైలేజ్:

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 లో గల పెట్రోల్ వేరియంట్ లీటర్ కు 19 కిలోమీటర్లు, డీజల్ వేరియంట్ లీటర్ కు 24 కిలోమీటర్లు చెప్పున మైలేజ్‌ని ఇస్తాయి.

 భద్రత :

భద్రత :

టాటా జికా లో డ్యుయల్ ఎయిర్ బ్యాగులు కలవు, మరియు ఇది భారతదేశపు క్రాష్ పరీక్షలలో కూడా ఇది నెగ్గింది. ప్రస్తుతం మన దేశంలో ఇది అన్ని వాహనాలకు తప్పనిసరి అయిపోయింది. ఇక హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 లో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ మరియు యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

తీర్పు:

తీర్పు:

టాటా మోటార్స్‌లో ఇంత వరకు వచ్చిన మోడల్స్ ఇది ఎంతో ఉత్తమమైన మోడల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉత్తమమైన ఇంజన్, ఫీచర్లు, డిజైన్ ప్రతిది కూడా ఎంతో బాగున్నాయి, మనం దీని కోసం వెచ్చించే డబ్బుకు సరైన విలువను ఇది ఇస్తుంది. ఇక హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 గురించి అంటారా ? గ్రాండ్ ఐ10 టాటా జికా కన్నా కొంచెం క్రింద స్థానంలో ఉంది. అందుకే మా నిర్ణయం టాటా "జికా". మరి మీరు దేనిని ఎంచుకుంటారు.

మరిన్ని ఆశక్తికరమైన విషయాలకు...
  1. ఓరి నీ కారు మైదానం కాను...!! మీకు ఇలాంటి కారు కావాలా?
  2. భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న నవరత్నాలు(9 మంది)...!!
  3. కన్నడ విద్యార్థి అద్బుత సృష్టి: లీటర్ పెట్రోల్‍‌‌తో 360 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల స్కూటర్

Most Read Articles

English summary
Car Comparo: Tata Zica vs Hyundai i10 Grand
Story first published: Monday, December 7, 2015, 11:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X