ఇప్పటికే ఇండియాకు వచ్చి ఉండాల్సిన ఆ 10 కార్లు!

By Ravi

భారత ఆటోమొబైల్ మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఒకప్పుడు భారత్‍‌లో కారు అనే తలంపు రాగానే కొన్ని వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన బ్రాండ్లు, మోడళ్లు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది.

మనదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆటో రంగంలోని అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు దేశ విదేశాలకు చెందిన కార్ కంపెనీలు సరికొత్త ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు పరిచయం చేస్తున్నాయి. వాటిలో కొన్ని మోడళ్లు హిట్ అవుతున్నాయి, మరికొన్ని మోడళ్లు ఫట్ అవతున్నాయి.

ఏదేమైనప్పటికీ, ఇలాంటి విదేశీయ కంపెనీలు గ్లోబల్ మార్కెట్లలో అందిస్తున్న సక్సెస్‌ఫుల్ మోడళ్లను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టడంలో జాప్యం చేస్తున్నాయి. అలా ఇప్పటికే ఇండియాలో విడుదలై ఉండాల్సిన ఆ 10 కార్ల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

టొయోటా వయాస్

టొయోటా వయాస్

సి-సెగ్మెంట్ సెడాన్ మార్కెట్లో హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్ వంటి మోడళ్లకు పోటీగా టొయోటా తమ వయాస్ (Vios) సెడాన్‌ను ఇండియన్ మార్కెట్‌కు తీసుకురావాలని ఎప్పటి నుంచో యోచిస్తోంది. అయితే, ఈ మోడల్ ఇంకా భారత్‌లో విడుదల కాలేదు. వాస్తవానికి ఇదే ముందే ఇండియాకు వచ్చి ఇప్పటికే సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకొని ఉండేది.

దీని ధర రూ.7 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

ఫోర్డ్ కా (నెక్స్ట్ జెన్ ఫిగో)

ఫోర్డ్ కా (నెక్స్ట్ జెన్ ఫిగో)

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్, గడచిన సంవత్సరం జనవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఫోర్డ్ కా పేరిట ఓ నెక్ట్స్ జనరేషన్ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌ని మరియు ఫిగో కాంపాక్ట్ సెడాన్‌ను ప్రదర్శనకు ఉంచింది. అయితే, ఈ రెండు మోడళ్లను కాన్సెప్ట్ నుంచి ప్రొడక్షన్ స్టేజ్‌కి తీసుకువెళ్లటంలో కంపెనీ చాలా జాప్యం చేసినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం అంతంత మాత్రంగా ఫోర్డ్ ఇండియా అమ్మకాలను పెంచుకోవటంలో ఈ రెండు మోడళ్లు ఎంతో చక్కగా సహకరించనున్నాయి.

దీని ధర రూ.5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

హ్యుందాయ్ ఐఎక్స్25

హ్యుందాయ్ ఐఎక్స్25

హ్యుందాయ్ ఐఎక్స్25 ఓ పాపులర్ గ్లోబల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ మోడల్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి విజయాన్ని సాధించింది. కానీ, ఇది ఇండియాకి రావటం మాత్రం ఇంకా అనుమానాస్పదంగానే ఉంది. వాస్తవానికి ఈ మోడల్ ఇప్పటికే ఇండియాలో విడుదలై ఉంటే, హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‌యూవీతో కంపెనీ వృద్ధి మరింత జోరయ్యే అవకాశం ఉండి ఉండేది.

దీని ధర రూ.8 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

షెవర్లే ట్రాక్స్

షెవర్లే ట్రాక్స్

ప్రస్తుతం భారత్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీల ట్రెండ్ నడుస్తోంది. ఈ సెగ్మెంట్లో జనరల్ మోటార్స్ ప్రవేశించడం ఇప్పటికే చాలా జాప్యం అయ్యింది. జనరల్ మోటార్స్ తమ షెవర్లే ట్రాక్‌ను ఇండియాలో విడుదల చేయాలని యోచిస్తోంది. కాకపోతే, ఈ మోడల్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఆడ్రా అనే మరో కొత్త సబ్-ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని గడచిన ఆటో ఎక్స్‌పో 2014లో డిస్‌ప్లే చేసింది. మరో రెండేళ్లలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

దీని ధర రూ.10 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

జీప్ వ్రాంగ్లర్

జీప్ వ్రాంగ్లర్

మనదేశంలో ఆఫ్-రోడింగ్ వాహనాలకు కూడా భలే గిరాకీ ఉంది. ఈ విభాగంలో లభిస్తున్న ప్రాపర్ ఆప్-రోడ్ వాహనం మహీంద్రా థార్ మాత్రమే అనాలి. ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ ఎప్పటి నుంచో తమ జీప్ బ్రాండ్ వాహనాలను ఇండియాలో విడుదల చేయాలని భావిస్తోంది. అయితే, క్రమంగా వాటి విడుదల వాయిదా వేసుకుంటూ వస్తోంది. ఈ బ్రాండ్ వాహనాలను వీలైనంత త్వరగా ఇండియాకు వస్తే బాగుండని చాలా మంది కార్ ప్రియులు ఎదురుచూస్తున్నారు.

దీని ధర రూ.25 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

ఫోక్స్‌వ్యాగన్ అప్

ఫోక్స్‌వ్యాగన్ అప్

భారత ఎంట్రీ లెవల్ కార్ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ ఎలాంటి మోడల్ లేదు. ప్రస్తుతం ఈ కంపెనీ అందిస్తున్న కార్లలో కెల్లా ధర తక్కువగా ఉన్న కారు పోలో మాత్రమే. అయితే, కంపెనీ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో అప్ పేరిట ఓ కాంపాక్ట్ కారును విక్రయిస్తోంది. అనేక మార్కెట్లలో ఇది ఓ మంచి సక్సెస్‌ఫుల్ మోడల్‌గా పేరు తెచ్చుకుంది. ఇది కూడా వీలైనంత తర్వగా ఇండియాకు వస్తే, ఈ సెగ్మెంట్లో గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది.

దీని ధర రూ.4 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

ఆడి ఏ1

ఆడి ఏ1

భారత లగ్జరీ కార్ మార్కెట్లో ఉన్న పోటీని సమర్థవంతంగా తట్టుకొని, అగ్రస్థానంలో నిలదొక్కుకోవాలంటే జర్మన్ కార్ కంపెనీ ఆడి తమ ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్ ఆడి ఏ1ను ఎంత త్వరగా భారత మార్కెట్లో ప్రవేశపెడితే అంత మంచిది. అనేక గ్లోబల్ మార్కెట్లలో ఆడి ఏ1 కారు ఇప్పటికే ఓ సక్సెస్‌ఫుల్ మోడల్‌గా పేరు తెచ్చుకుంది. భారత్‌లో కూడా ఈ మోడల్ సూపర్‌హిట్ అయ్యే అవకాశం ఉంది.

దీని ధర రూ.20 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

రెనో క్లియో

రెనో క్లియో

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో అందిస్తున్న క్లియో హ్యాచ్‌బ్యాక్ మంచి ప్రీమియం లుక్స్‌ని కలిగి ఉండి, ప్రస్తుత పల్స్ కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా అనిపిస్తుంది. వాస్తవానికి రెనో ఈ మోడల్‌ను ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టి ఉండినట్లయితే, ఇది కూడా డస్టర్ మాదిరిగా హాట్ కేకుల్లా అమ్ముడుపోయి ఉండేది.

దీని ధర రూ.5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

నిస్సాన్ క్యాష్‌కాయ్

నిస్సాన్ క్యాష్‌కాయ్

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ కూడా తమ ప్రీమియం ఎస్‌యూవీ క్యాష్‌కాయ్‌ని ఇండియాలో ప్రవేశపెట్టి ఉన్నట్లయితే, అది ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీ కన్నా ఎక్కువగా అమ్ముడుపోయి ఉండేది. ఈ విషయంలో నిస్సాన్ ఇప్పటికే చాలా జాప్యం చేసిందనేది మా అభిప్రాయం.

దీని ధర రూ.12 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

హోండా సిఆర్-వి

హోండా సిఆర్-వి

హోండా తొలిసారిగా అమేజ్ ద్వారా డీజిల్ కార్ల విభాగంలోకి ప్రవేశించింది. అప్పటికే డీజిల్ కార్ల విభాగంలో ప్రవేశించడంపై చాలా జాప్యం చేసిన హోండా ఆ తర్వాత హోండా సిటీ డీజిల్, హోండా మొబిలి డీజిల్ కార్లను ప్రవేశపెట్టింది. ఇక హోండా నుంచి రావల్సిన మరో డీజిల్ కార్ హోండా సిఆర్-వి. ఇందులో డీజిల్ వెర్షన్ వస్తే, ఈ మోడల్ అమ్మకాలు తిరిగి పుంజుకునే ఆస్కారం ఉంది.

దీని ధర రూ.20 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
What is the next car you think the Indian auto market should have? Here is a list of cars we think that should be in India by now.
Story first published: Wednesday, March 25, 2015, 11:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X