ఏప్రిల్ 2015 నుంచి పెరగనున్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం

By Ravi

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం త్వరలోనే రెక్కలు రానున్నాయి. చిన్న కార్లపై (1000సీసీ కన్నా తక్కువ సామర్థ్యం కలిగిన కార్లపై) థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంను 107.79 శాతం వరకూ పెంచాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంచ్ అథారిటీ (ఐఆర్డీఏ) ప్రతిపాదిస్తోంది. కాగా.. ట్రక్కులలోని కొన్ని విభాగాలపై మాత్రం ప్రీమియంను తగ్గించాలని ఐఆర్డీఏ భావిస్తోంది.

కేవలం ఫోర్స్ వీలర్స్ విషయంలోనే కాకుండా టూవీలర్స్ విషయంలో కూడా ఇన్సూరెన్స్‌ను పెంచాలని ఐఆర్డీఏ ప్రతిపాదించింది. ఈ విభాగంలో 75-350సీసీ సెగ్మెంట్ క్రిందకు వచ్చే ద్విచక్ర వాహనాలపై ఇన్సూరెన్స్ ప్రీమియం 14.32 శాతం పెంచాలని, 350సీసీ సామర్థ్యానికి మించిన ద్విచక్ర వాహనాలపై ఇన్సూరెన్స్ ప్రీమియంను 61 వరకూ తగ్గించాలని యోచిస్తోంది.

Third Party Insurance Premium Set To Go Up From April

వాహన ఇన్సూరెన్స్ ప్రీమియం పెరగడానికి ప్రధాన కారణం యాక్సిడెంట్లు పెరుగుతుండటం, ఫలితంగా వస్తున్న క్లెయిమ్‌ల సంఖ్య కూడా పెరుగుతుండటమే. ఐఆర్డీఏ ప్రకారం, డెత్ క్లెయిమ్‌లకు చెల్లిన సగటు పరిహారం నానాటికీ పెరుగుతోంది. గత 2012-13 ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన సగటు డెత్ క్లెయిమ్ రూ.5,45,174. కాగా.. 2013-14లో ఇది రూ.6,09,152కి పెరిగింది.

వాహన బీమా ప్రీమియం పెంపు విషయంలో ఐఆర్డీఏ చేసిన ఈ ప్రతిపాదనపై అభిప్రాయ సేకరణ చేపట్టింది. మార్చ్ 20, 2015 వరకూ స్టేక్‌హోల్డర్స్ నుంచి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. మరి ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయం ఏంటో మా పాఠకులతో పంచుకోగలరు.

Most Read Articles

English summary
The Insurance Regulatory and Development Authority (Irda) has proposed a steep 107.79 per cent hike in third party insurance premium for small cars (less than 1,000cc) while reducing rates for some categories of trucks from April onwards.
Story first published: Wednesday, March 11, 2015, 18:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X