ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్-10 రోల్స్‌రాయిస్ కార్లు, వాటి లక్షణాలు !

By Anil

రోల్స్‌రాయిస్ కార్లు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ప్రముఖ రోల్స్‌రాయిస్ కార్ల తయారీదారులు తమదైన శైలిలో వీటిని అన్ని విధాలుగా ఒక కొత్త నమూనాతో రూపొందించారు. ఈ ఆటోమొబైల్ పోటి ప్రపంచంలో తమకు తామే పోటిగా నిలబడుతూ అత్యంత ఖరీదైన కార్లను సృష్టిస్తున్నారు.

అందులో మీకోసం పది ఖరీదైన కార్లను అందిస్తున్నాము ఒక లుక్కేయండి.

Also Read:బిఎమ్‌డబ్ల్యు ఎక్స్1ఎమ్ స్పోర్ట్స్ కారు విడుదల:ధర రూ.39.7 లక్షలు

10.ఫాంటమ్ కూపె

10.ఫాంటమ్ కూపె

ఈ మోడల్ కారును నిజానికి కాలిఫోర్నియాలోని సింబాలిక్ మోటర్ కార్ కంపెని వారిచే రూపొందించబడినది. అయితే మిగతా వాటితో పోల్చినపుడు ఇందులో దాదాపుగా ఎక్కువ లగ్జరీ లక్షణాలు లేవని చెప్పవచ్చు అయితే దీనిని తేలికపరచడానికి ఇంటీరియర్ మొత్తం కార్బన్ ఫైబర్ వాడినట్లు తెలుస్తోంది. దీనిని స్పోర్ట్స్ కారుగా కూడా వాడుకోవచ్చు ఎందుకంటే ఇందులో స్పోర్టివ్ లక్షణాలు ఎక్కువగానే ఉన్నాయి. ఫాంటమ్ కూపె లో గల 6.75 లీటర్ వి12 ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా మీకు ఇస్తుంది 453 హార్స‌పవర్. దీని యొక్క ఇంటీరియర్ లగ్జరీ ఫైబర్‌తో తయారై ఉంది అంతే కాదు రోల్స్ రాయిస్ నుండి మీరు ఊహించిన అన్ని హంగులు ఇందులో ఉన్నాయి. ఫాంటమ్ కూపె యొక్క ధర 650,000 అమెరికన్ డాలర్లు.

9.ఫాంటమ్

9.ఫాంటమ్

2003 లో టాప్ గేర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఈ కారును వరించింది. ఒక సారి ఊహించుకోండి 44,000 బాహ్య మరియు అంతర్బాగంగా ఇన్ని రంగుల్లో కారు లభ్యమైతే ఎలా ఉంటుందో అన్ని రంగులు ఇందులో లభ్యమైనట్లు ఉన్నాయి కదా? ఫాంటమ్ 6.75 లీటర్ వి12 ఇంజన్‌ను కలిగి ఉంది ఇది మీకు ఇస్తుంది 453 హార్స్‌పవర్. దీని డ్రైవ్ చేసినపుడు ఒక అత్భుతమైన అనుభూతిని పొందుతారు. దీని ధర 670,000 అమెరికన్ డాలర్స్.

 8.ఫాంటమ్ హియర్సే బి12

8.ఫాంటమ్ హియర్సే బి12

ఈ 23 అడుగులు పొడవున్న కారు బహుశా ప్రపంచంలో అత్యంత ఖరీదైన అంత్యక్రియల కారు కావచ్చు.ఇందులో 6.75 లీటర్ల వి12 ఇంజిన్ కలదు అయితే ఇందులో కొన్ని ప్రత్యేక్యమైన లక్షణాలు ఉన్నాయి వాటిలో లెవలింగ్ ఎయిర్ సస్పెన్షన్ కూడా ఒక కీలకమైన అంశం. ఇందులో ఎక్స్‌ట్రా లాంగ్ బాడి ఉంది దీని కోసం 600 అసెంబ్లింగ్ పనులు కోసం 650 అడుగుల పొడవైన వెల్డింగ్స్ జరిగాయి. ఈ రోల్స్ రాయిస్ బి12 కారును 2012 జరిగిన అంత్యక్రియల కార్ షోలో దీనిని ప్రదర్శించారు. వీరు అందించిన అత్యంత సొగసైన మరియు అధునాతన నమూనాలలో ఇది ఒకటి అని చెప్పవచ్చు. దీని ధర 700,000 అమెరికా డాలర్లలో.

7. ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపె

7. ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపె

ఈ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపె ను మొదటి సారిగా నార్త్ అమెరికాలోని డెట్రాయిట్ లో జరిగిన 2007 ఇంటర్‌నేషనల్ ఆటో షోలో దీనిని ప్రదర్శించారు. దీనిని ప్రదర్శనకు ఉంచిన అనతి కాలంలోనే భారి విజయాన్ని సాధించింది. ఎల్టన్ జాన్ వారి ఏ.ఐ.డి.యస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటలో ఇది 1.6 మిలియన్ డాలర్లు పలికింది, కాని దీని అసలైన ధర 700,000 డాలర్లు. టెక్నిల్ పరంగా ఇది 6.75 లీటర్ వి2 ఇంజన్‌ని కలదు ఇది 453 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేయగలదు.

6. ఫాంటమ్ మ్యాన్‌సోరి కాన్‌క్విస్టడోర్

6. ఫాంటమ్ మ్యాన్‌సోరి కాన్‌క్విస్టడోర్

ఈ మోడల్ అదరికి ఎంతో ఇష్టమైనది, ఫాంటమ్ మ్యాన్‌సోరి కాన్‌క్విస్టడోర్ రోల్స్ రాయిస్ కారు యొక్క లుక్ చాలా అందంగా ఉంటుంది. ఒక వేళ మీకు జర్మన్ ట్యూనర్ కారు కనుక మీకు నచ్చకపోతే రోల్స్ రాయిస్ వారు మీకోసం ఈ కారుకు మరిన్ని ప్రత్యేకతలు జోడించి సరి కొత్త మ్యాన్‌సోరిని నవీకరించారు మరియు ఇందులో గ్రిల్ ట్రిప్స్ , అల్యూమినియం సైడ్ స్కర్ట్ ఫ్లాంక్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్.ఇ.డి లైట్స్‌ను అమర్చారు. దీనిని ధర 1 మిలియన్ అమెరికన్ డాలర్స్.

Photo credit: Mansory

 5.ఫాంటమ్ ఇయర్ ఆఫ్ ద డ్రాగన్ ఎడిషన్

5.ఫాంటమ్ ఇయర్ ఆఫ్ ద డ్రాగన్ ఎడిషన్

ఈ మోడల్‌‌ను విభిన్న ఆసక్తికరమైన విషయాలతో తయరు చేశారు. దీనిని చైనాలో విడుదల చేసినప్పుడు కేవలం రెండు నెలల కాలవ్యవదిలోనే అన్ని అమ్ముడుపోయాయి. ఇందులో ప్రత్యేకమైన మరిన్ని మోడల్స్ డ్రాగన్ కోచ్ లైన్, డ్రాగన్ ఎంబ్రాయిడరీ హెడ్‌రెస్ట్, డ్రాగన్ ఫాంటమ్ పాసింజర్ పేన్ వంటి ఇతర మోడల్లను కంపెని అప్పటికే విడుదల చేసింది.

 4.ఘోస్ట్ ఫెనిస్ మిలానో

4.ఘోస్ట్ ఫెనిస్ మిలానో

ఇక్కడ చూడండి పర్పుల్ మరియు గోల్డ్ కాంబినేషన్ లో గల రోల్స్ రాయిస్ కారు ఎంతో అందంగా ఉంది కదూ, ఇంతే కాదండోయ్ పర్పుల్ మరియు వైట్ కాంబినేషన్ లో కూడా ఉంది. ఇది ఎలా ఖరీదైన కార్ల లిస్ట్‌లో చేరిందని ఆలోచిస్తున్నారా ? ఆలోచించడం మాని కాస్త ముందుకు పదండి, మీకు తెలుసా ఇందులో తలుపులు, కంట్రోల్ ప్యానెల్, రియర్ వ్యివ్ మిర్రర్, సీట్ ప్యానెల్స్ వంటి వగైరా విడిభాగాలను 24-క్యారెట్స్ బంగారంతో చేయించారట మరి అందుకే కాబోలు ఇది ధర, మీకు ఇంకా దీని ధర చెప్పలేదు కదా, దీని ధర అక్షరాల 19,67,93,580 రుపాయలు.

Photo credit: Fenicemilano

3. హైపెరియన్ ఫినిన్ఫారినా

3. హైపెరియన్ ఫినిన్ఫారినా

అత్యంత ఖరీదైన వాటిలో హైపెరియన్ ఫినిన్ఫారినా ఒకటి. దీనిని 2008 లో కన్కోర్స్ లో పరిచయం చేశారు. ఈ మోడల్ అమెరికాలో గల క్లాసిక్ మోడల్ కు అత్యంత పోటిని ఇస్తోంది. ఇది 1930 లో గల చెక్క తలుపులు, కార్బన్ ఫైబర్ బాడీతో ప్రేరణ పొందింది. ఆ కాలం నాటి అనుభూతులను, వాటిలోని నక్షత్ర ప్రదర్శనలను వారు ఇందులో ఎంతో బాగా ఇముడింపచేశారు. దీనిని చూసినప్పుడు వారి అత్భుతమైన పనితనం బయటపడుతుంది. మొత్తంగా దీని ధర 6 మిలియన్ అమెరికన్ డాలర్లు.

Photo credit: Pininfarina

 2.రోల్స్-రాయిస్ 10హెచ్‌పి

2.రోల్స్-రాయిస్ 10హెచ్‌పి

ఆశ్చర్యపోయారా? ఇక్కడ ఉన్న రోల్స్-రాయిస్ 10హెచ్‌పి కారు తమ రోల్స్ రాయిస్ కు చెందిన మొదటి మోడల్, దీనిని ఛార్లెస్ రోల్స్ మరియు హెన్రీ రాయిస్ సంయుక్తంగా 1904 సంవత్సరంలో రూపొందించారు. దీనిని మాంచెస్టర్‌లో గల ట్రాఫ్ఫోర్డ్ పార్క్ పారిశ్రామిక ప్రాంతంలో తయారు చేయబడింది. దీని అసలైన ధర 664 డాలర్లు. ఈ కారును1904 డిసెంబర్ న పారిస్‌లో ప్రదర్శించబడింది. ఆ ప్రదర్శనలో ఇది గంటకు 63 కిలోమీటర్లుగా నమోదు చేసుకుంది. ఆ తరువాత 2007లో లండన్‌లో జరిగిన వేలంలో ఇది 8,250,867 డాలర్లకు అమ్ముడుపోయింది.

Photo credit: Terry Whalebone/Wiki Commons

1.ఫాంటమ్ సాలిడ్ గోల్డ్

1.ఫాంటమ్ సాలిడ్ గోల్డ్

ఇది గల్ఫ్‌లోని ఒక బిలియనీర్ వ్యాపారవేత్త వద్ద ఉంది అతడు దీనిని పూర్తిగా బంగారంతో చేయించుకన్నాడు. ఈ రోల్స్‌రాయిస్ లో మొత్తం 120 కేజిల బంగారంతో దీనిలో గల ముందు వైపు గ్రిల్, సైడ్ ట్రిమ్స్, వీల్స్ మరియు మరిన్ని విడిభాగాలు తయారు చేయబడ్డాయి. మరియు ఆ దేశ ప్రభుత్వం దీనిని అధికారికంగా కూడా ధృవీకరించింది దీనిలో గల ఇంటీరియర్ కూడా బంగారంతో చేయించుకున్నాడంటే మరి ఇతగాడు ఎంత ఘనుడో అర్థమవుతోంది. అంత్యంత విలాసవంతమైన వాహనంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. ఇక మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ధర విషయానికి వస్తే 8.5 మిలియన్ అమెరికన్ డాలర్లు, అక్షరాల 55,73,025,00 రుపాయలు.

Photo credit: Yahoo

Most Read Articles

Read more on: #ఆఫ్ బీట్
English summary
world’s most expensive editions of these special Rolls Royce cars here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X