భారత్ లో కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ పొందిన టయోటా క్యామ్రి హైబ్రిడ్

By Vinay

టయోటా మే నెలలో విడుదల చేసిన క్యామ్రి హైబ్రిడ్ భారత్ మార్కెట్లో కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ పొందుతోంది. 2014 ఏడాది మొత్తానికి 720 యూనిట్లను విక్రయించగా, క్యామ్రి హైబ్రిడ్ ఇప్పటికే 50 రోజుల్లో 280 యూనిట్లను విక్రయించింది.

కొత్త క్యామ్రి హైబ్రిడ్ 730 కన్నా ఎక్కువ కస్టమర్ల ఎంక్వైరీలను పొందుతూ 125 వరకూ పెండింగ్ ఆర్డర్ లను టయోటా పూర్తీచేసింది.

toyota camry hybrid response

ఈ లగ్జరీ కారు పూనే, కలకత్తా, కొయంబత్తూర్, మరియు అహ్మదాబాద్ లాంటి అన్ని మార్కెట్ల లో అమ్మకాలను పెంచడమేకాక హైబ్రిడ్ కేవలం పెద్ద నగరాలకు సరిపడేది మాత్రమే కాదని చాటిచెబుతోంది.

ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఫేమ్ పథకం ద్వారా అందిస్తున్న రూ.70,000 కస్టమర్ల నుంచి ఎక్కువ ఆర్డర్లు పొందడానికి తోడ్పడింది. భారత్ లో తొలిసారిగా 2013లో క్యామ్రి హైబ్రిడ్ ఆవిష్కరించబడింది.

సేల్స్ మరియు మార్కెటింగ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ మరియు డైరెక్టర్ ఎన్.రాజా భారత్ లో క్యామ్రి విజయం గురించి మాట్లాడుతూ...భారత్ లో క్యామ్రి విజయానికి కారకులైన కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. టయోటా క్యామ్రి విక్రయాల్లో హైబ్రిడ్ 80 శాతం దక్కించుకుందన్నారు.

"భారత్ లో ఉన్న రోడ్లు, పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాసిటీవ్ ఆలోచనతో పచ్చని వాతావరణాన్ని పెంచే విధంగా ఈ కారును తయారుచేసినట్లు ఆయన తెలిపారు."

క్యామ్రి హైబ్రిడ్ టయోటా యొక్క హైబ్రిడ్ సినర్జీ డ్రైవ్ (HSD)పవర్ట్రెయిన్. క్యామ్రి హైబ్రిడ్ "పుల్ హైబ్రిడ్" యొక్క పవర్ట్రెయిన్ 2.5 లీటర్ల అట్ కిన్సన్ సైకిల్ నాలుగు-సిలిండర్ గ్యాసోలిన్ ఇంజన్ మరియు అత్యధిక టార్క్ ఎలక్ట్రిక్ మోటార్ ల కలయిక.

toyota camry hybrid response

కొత్త క్యామ్రి హైబ్రిడ్ కంబైన్డ్ పవర్ (ఇంజన్+మోటార్) ఔట్ పుట్ తో 205 పీఎస్ తోపాటు 19.16 కి.మీ/లీ లీడింగ్ ఎడ్జ్ ఫ్యూయల్ ఎకానమీ మరియు కి.మీ డ్రైవింగ్ కు అతి తక్కువగా 122.8 గ్రా.ల సీవో2 ఎమ్మిషన్ ఉత్పత్తి అయ్యేలా తయారుచేయబడింది.

క్యామ్రి హైబ్రిడ్ మెరుగైన డ్రైవింగ్ పర్ఫామెన్స్ తో పాటు ఇంధనాన్ని ఆదా చేసి, తక్కువ ఎన్.వీ.హెచ్ కోసం ఎలక్ట్రానిక్ కంట్రోల్ కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్ మిషన్ (E-CVT)తో తయారుచేయబడింది.

Most Read Articles

Read more on: #toyota #టయోటా
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X