మిరాయ్ హైడ్రోజెన్ కార్ ఉత్పత్తిని మూడు రెట్లు పెంచనున్న టొయోటా

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టొయోటా మొట్టమొదటి సారిగా, ఇతర ఆటోమొబైల్ కంపెనీల కంటే ముందుగా హైడ్రోజెన్ ఫ్యూయెల్-సెల్ (నీటి)తో నడిచే కారును వాణిజ్య పరంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసినదే. కంపెనీ అందిస్తున్న టొయోటా మిరాయ్ సెడాన్‌లో కంపెనీ ఈ హైడ్రోజెన్ ఫ్యూయెల్-సెల్ ఇంధన ఆప్షన్‌ను పరిచయం చేశారు.

కంపెనీ ఊహించని రీతిలో ఈ మోడల్‍‌కు స్పందన లభిస్తుండటంతో దీని ఉత్పత్తిని మూడు రెట్లు పెంచాలని కంపెనీ భావిస్తోంది. టొయోటా గడచిన డిసెంబర్ 2014 నెలలోనే తమ హైడ్రోజెన్ ఫ్యూయెల్-సెల్ మిరాయ్ కోసం బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించిది. ఇప్పటి వరకూ సుమారు 1500 యూనిట్లకు పైగా ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

Toyota To Triple Production Of Mirai Hydrogen Car

వాస్తవానికి టొయోటా తొలుత తమ ఫ్యూయెల్-సెల్ మిరాయ్ కోసం 2015 చివరి నాటికి 400 ఆర్డర్లు రావచ్చని అంచనా వేసింది. కానీ వాటి సంఖ్య 1500 లకు మించిపోయింది. టొయోటా మిరాయ్ హైడ్రోజెన్ ఫ్యూయెల్-సెల్ కోసం వచ్చిన ఆర్డర్లలో 60 శాతం ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పోరేట్ కస్టమర్ల నుంచి రాగా మిగిలిన 40 శాతం సాధారణ కస్టమర్ల నుంచి వచ్చాయి.

గాలిలోని ఆక్సిజెన్ మరియు హైడ్రోజెన్ మధ్య జరిగే రసాయన చర్యలో భాగంగా జనించే విద్యుత్‌ని ఆధారంగా చేసుకొని ఈ కారు పనిచేస్తుంది. ఇది నీటితో నడుస్తుంది కాబట్టి ఈ కారు వలన పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. హైడ్రోజెన్ ఫ్యూయెల్-సెల్ వాహనాల కోసం సాధారణ నీటిని ఉపయోగించకూడదు, ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన హైడ్రోజన్ ఫ్యూయెల్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. జపాన్‌లో ఈ ఏడాది చివరి నాటికి 100 స్థానిక హైడ్రోజెన్ ఫ్యూయెల్-సెల్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Most Read Articles

English summary
Japanese carmaker Toyota will triple its production of the company's Hydrogen powered car the Mirai, after registering 1,500 bookings in the first month itself, all in Japan.
Story first published: Tuesday, January 27, 2015, 18:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X