విలువైన పురాతన కార్లు కూడా చెత్త మాదిరిగానే..!

By Ravi

పురాతన (వింటేజ్) కార్లను సేకరించే వారికి షాకింగ్ న్యూస్.. వింటేజ్ కార్లను రోడ్లపై తిప్పడానికి వీళ్లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొంది. న్యూఢిల్లీలో 15 ఏళ్లకు పైబడిన పాత వాహనాలను నిషేధిస్తున్నట్లు గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొన్న సంగతి తెలిసినదే.

ఈ నేపథ్యంలో, పురాతన కార్లు కూడా ఈ అంశం క్రిందకు వస్తాయని, కాబట్టి వాటిని కూడా రోడ్లపై తిప్పడానికి వీళ్లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ ఆదేశించింది. ఇది వరకటి ఆదేశాల అనుసరిస్తూ, వింటేజ్ కార్లు కూడా ఈ నిషేధం క్రిందకు వస్తాయి కాబట్టి, వాటిని కూడా ఢిల్లీ రోడ్లపై తిరగటాన్ని నిషేధించాలని గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొంది.

Vintage Car 01

న్యూఢిల్లీలో 21 గన్ సెల్యూట్ ర్యాలీ జరిగిన రెండు రోజులకే ఈ నిషేధం వార్త రావటం విశేషం. ఢిల్లీ రోడ్లపై వింటేజ్ కార్ ర్యాలీని నిర్వహించడానికి అనుమతి కోరుతూ 21 గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ ర్యాలీ డైరెక్టర్ మదన్ మోహన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఈ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చింది.

కానీ వింటేజ్ కార్ వినియోగదారులు మాత్రం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాదనలను వ్యతిరేకిస్తున్నారు. వింటేజ్ కార్లు నిత్యం నడపబడేవి కావని, పురాతన ఆటోమొబైల్ వాహనాల చరిత్రను డిజైన్‌ను గుర్తుకు చేసేందుకు మిగిలిన సాక్ష్యాలు ఇవని వారు అభిప్రాయ పడుతున్నారు. ప్రజలు వీటిని అత్యంత అరుదుగా నడుపుతారు కాబట్టి, వీటి వలన అంతటి అధిక కాలుష్యం ఉండదని వారంటున్నారు.

Vintage Cars
Most Read Articles

English summary
The National Green Tribunal (NGT) has shattered the dreams of many vintage car collectors in India by saying that vintage cars too fall under the ban of vehicles that are older than 15 years, thus they cannot ply on public roads in Delhi. 
Story first published: Tuesday, February 24, 2015, 17:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X