కేవలం లక్షరుపాయలకే వోక్స్‌వ్యాగన్ బీటిల్ కారు బుకింగ్

By Anil

బీటిల్ కారా ఇదేంటబ్బా అనుకుంటున్నారా? అదే ఈ మధ్య సినిమాలో కనిపిస్తుంటుంది కాదా, కేవలం రెండు డోర్లు మాత్రమే ఉంటాయి. వోక్స్‌‌వ్యాగన్ కార్ల సంస్థ తయారు చేసిన ఆ బీటిల్ కారు అతి త్వరలో మన భారతీయ మార్కెట్లో సందడి చేస్తూ మన దేశ రోడ్ల మీద పరుగులు పెట్టనుంది.
మరింత చదవండి: 2017కి వోక్స్ వ్యాగన్ నుంచి 5 కొత్త మోడళ్లు

ప్రస్తుతం మార్కెట్లో కుప్పలు తెప్పలుగా ఎన్నో రకాల మోడల్స్, డిజైన్స్ అంటూ చాలా కార్లే ఉన్నాయి. కాని అవన్ని ఒక ఎత్తు ఇలాంటివి ఒక ఎత్తు. కూసంత కొత్తదనాన్ని కోరుకునే వారు దీనిని ఏ మాత్రం వదలరు. చూడ్డానికి ముద్దుగా ఉన్న ఈ బుజ్జి బీటిల్ కారును కొనాలంటే మన దేశం వోక్స్‌వ్యాగన్ ప్రకటిచింన బుకింగ్స్‌ మీ పేరు నమోదు చేసుకుని బుకింగ్ ఫీజు క్రింద లక్ష రుపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
మరింత చదవండి: భారత్‌లో ఫోక్స్‌వ్యాగన్ ఐటి సెంటర్

వోక్స్‌వ్యాగన్ బీటిల్ కారు గురించి మరిన్ని ఆశక్తికరమైన విశయాలు క్రింద కథనాల ద్వారా తెలుసుకుందాం రండి....

బుకింగ్

బుకింగ్

ఈ కారును పొందాలంటే ముందుగా వోక్స్‌వ్యాగన్ అధికారిక వెబ్‌సైట్‌లో మీ పేరు మరియు ఇతర వివరాలు నమోదు చేసుకుని మీకు దగ్గరలోని వోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్ వివరాలను నింపాల్సి ఉంటుంది. ఆ తరువాత బుకింగ్‌నకు సంభందించిన వివరాలు నమోదు చేసిన తరువాత బుకింగ్ ఫీజు క్రింది లక్ష రుపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం తతంగం తరువాత బీటిల్ కారును అందజేస్తారు.

లభించు రంగులు

లభించు రంగులు

వోక్స్‌వ్యాగన్ వారి బీటిల్ కారు నాలుగు రంగుల్లో లభించనుంది.

  • ఆరెంజ్
  • నీలం
  • ఎరుపు
  • తెలుపు
  • మరియు ఇది రెండు డోర్లు మాత్రమే కలిగి ఉంటుంది.

    ఇంజన్

    ఇంజన్

    వోక్స్‌వ్యాగన్ భారతీయ మార్కెట్లో ప్రవేశ పెట్టనున్న రెండు డోర్ల బీటిల్ కారులో 1.4-లీటర్ టియస్ఐ పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ మీకు ఇస్తుంది 147.52బిహెచ్‌పి వపర్‌.

    ట్రాన్స్‌మిషన్

    ట్రాన్స్‌మిషన్

    బీటిల్ కారులో గల 7-స్పీడ్ ఆటోమేటిక్ డైరక్ట్ షిఫ్ట్ గేర్ బాక్స్ ట్రాన్స్‌మిషన్ ఇంజన్ విడుదల చేయు మొత్తం పవర్‌ను 16-ఇంచుల చక్రాలకు అందజేస్తుంది.

    భద్రత

    భద్రత

    భద్రత పరంగా ఇందులో గల ఫీచర్లు:

    • యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఎబియస్)
    • ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్(ఇయస్‌పి)
    • ప్రాథమికంగా ఇందులో ఆరుఎయిర్ బ్యాగ్‌లను కల్పించారు. మరియు కెఇయస్‌యస్‌వై అనే ఆప్షన్‌ అందించారు అనగా కీ లెస్ ఆక్సెస్ మరియు పుష్ బటన్ స్టార్ట్ అని అర్థం.
    • ల్యాంప్స్

      ల్యాంప్స్

      వోక్స్‌వ్యాగన్ బీటిల్ బి-జెనాన్ అనే హెడ్ లైట్లతో వస్తోంది. మరియు ఇవి పగటి పూట వెలిగే యల్‌‌ఇడి లైట్లను కలిగి ఉంది. మరియు ఇది మూడు రకాల ఆంబియంట్ లైటింగ్‌ను అందివ్వగలగదు.

      మరిన్ని ఫీచర్స్

      మరిన్ని ఫీచర్స్

      వోక్స్‌వ్యాగన్ బీటిల్ కారు ఇంటీరియర్‌లో పైబాగం మొత్తం లెథర్ తో రూపొందించారు. మరియు కారు టాపు మీద గల డోరు ద్వారా బయటి ప్రపంచాన్ని చూడటానికి వీలుంది. ఇటువంటి ఆప్షన్ గల రూఫ్‌ను ప్యానరోమిక్ సన్ రూఫ్ అంటారా.

      ధర

      ధర

      ఈ వోక్స్‌వ్యాగన్ బీటిల్ కారును మన దేశంలో ఎప్పుడు విడుదల చేస్తారో ఖచ్చితంగా చెప్పలేదు. కాని దీనిని కోరుకునే వారికోసం ముందస్తుగా బుకింగ్స్ ‌ను ప్రారంభించారు. అయితే దీని ధర దాదాపుగా రూ. 25 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.

      మరిన్ని కార్ల విశేషాలు...
      • రెండు రోజుల్లో 4500 బుకింగ్స్ నమోదు చేసిన సుజుకి బాలెనొ
        • ఎగుమతికి కోసం మారుతి సుజుకి ఇగ్నిస్ కారు

Most Read Articles

English summary
Volkswagen Beetle Bookings Accepted In India From Rs. 1 Lakh Onwards
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X