కొత్త ఎత్తుగడతో భారతీయ మార్కెట్లో 720 కోట్ల పెట్టుబడిపెడుతున్న వోక్స్‌వ్యాగన్

By Anil

జర్మనీకి ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త వినాల్సి వస్తోంది. కాని ఈ సారి శుభవార్త తెలిపింది. వోక్స్‌వ్యాగన్ సంస్థ భారతీయ మార్కెట్లోకి ఒక కాంపాక్ట్ సెడాన్‌ను విడుదల చేయాలని పథకం రచించింది. అందుకోసం ప్రత్యేకంగా దీనిని కోసం దాదాపుగా 720 కోట్లను భారత్‌లో పెట్టుబడి పెడుతోంది.
Also Read: మహీంద్రా నుండి ఎక్స్‌యువి500 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్

2014 లో వోక్స్‌వ్యాగన్ కంపెనీ చెప్పిన విధంగా ఈ మొత్తం 720 కోట్ల రుపాయలును 1500 కోట్ల బడ్జెట్‌లో భాగంగా ఇప్పుడు రీసెర్చ్‌ కోసం విడుదల చేసినట్లు తెలిపింది. దేశీయంగా తయారు చేయబోతున్న కాంపాక్ట్ సెడాన్ ‌కోసం ఈ మొత్తాన్ని ఉపయోగిస్తున్నామని తెలిపారు. త్వరలో ఈ కాంపాక్ట సెడాన్ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
Also Read: కొత్తతరం టయోటా ఇన్నోవా: ఫోటోలు మరియు స్పెసిఫికేషన్స్.

ముఖ్యంగా ఈ వోక్స్‌వ్యాగన్ కాంపాక్ట్ సెడాన్ కారును ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ మరియు హ్యుందాయ్ జెంట్ మోడల్ కార్లకు పోటిగా దీనిని తీసుకురానున్నారు. ఈ వోక్స్‌‌వ్యాగన్ కాంపాక్ట్ సెడాన్ కారును పూనేలో గల చకన్ ప్లాంటులో దీనిని అభివృద్దిని ప్రారంభించారు.

వోక్స్ వ్యాగన్
Most Read Articles

English summary
Volkswagen Invests 720 Crores On India Spec Compact Sedan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X