వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ అతి త్వరలో విడుదల: ఇంజన్ మరియు ఇతర స్పెసిఫికేషన్స్ కోసం....

By Anil

జర్మనీకి చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యా‍‌గన్ త్వరలో భారతీయ మార్కెట్లో సరి కొత్త పోలో జిటిఐ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ కొన్ని స్పోర్టివ్ లక్షణాలతో మన ముందుకు వస్తోంది.
మరింత చదవండి: మహీంద్రా యక్స్‌యువి5oo,హ్యుందాయ్ క్రెటా కార్ల మధ్య మొదలైన యుద్దం

ఈ పోలో జిటిఐ కారుకు చెందిన కొన్ని మఖ్యమైన పరీక్షలను పూనేలో గల చకన్ వోక్స్‌వ్యాగన్ ప్లాంటులో జరుగుతున్నాయి. వీటి అనంతరం దీని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంభందించిన మరిన్ని వివరాలు క్రింది స్లైడర్‌‌ షో ద్వారా తెలుసుకోగలరు.

ఇంజన్

ఇంజన్

ఈ శక్తివంతమైన పోలో జిటిఐలో 1.8-లీటర్ టియస్‌ఐ పెట్రోల్ ఇంజన్ కలదు

పవర్

పవర్

ఇందులో ఉన్న పెట్రోల్ ఇంజన్ దాదాపుగా 189.30బిహెచ్‌పి పవర్ మరియు 320యన్‌యమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

పోలో జిటిఐలో గల ఇంజన్ 7-స్పీడ్ డియస్‌జి గేర్ బాక్స్‌తో వచ్చింది. మరియు దీనిని భారతీయ మార్కెట్ కోసం మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్షన్‌లో అందివ్వనున్నారు.

మైలేజ్

మైలేజ్

ఈ సరికొత్త పోలో జిటిఐ కారు లీటర్‌కు 8.85 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది. మరియు దీనిని నడిపే విధాన్ని బట్టి కూడా దీని మైలేజ్‌లో మార్పులు ఉంటాయని తెలిపారు.

అత్యధిక వేగం

అత్యధిక వేగం

ఈ హై పర్ఫామెన్స్ కారు కేవలం 6.7 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని అత్యధిక వేగం గంటకు 236 కిలోమీటర్లు.

డిజైన్

డిజైన్

దీని డిజైన దాదాపుగా వోక్స్‌వ్యాగన్ పోలో జిటి మోడల్‌కు చాలా దగ్గరాగ ఉంటుంది. ప్రస్తుతం భారతీ మార్కెట్లో ఈ పోలో జిటి మోడల్‌ అమ్మకంలో ఉంది. అయితే కొన్ని చిన్న మార్పులతో వచ్చిన ఈ జిటిఐ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నారు.

ఫీచర్స్

ఫీచర్స్

వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ కారులో ఉన్న ఫీచర్లు:

ఏరోడైనమిక్ ఫ్రంట్ గ్రిల్, 17-ఇంచుల అల్లాయ్ వీల్స్, ఎరుపు రంగు బార్డర్‌తో గల కొత్త ఫ్రంట్ గ్రిల్, జిటిఐ బ్యాడ్జ్, క్రోమ్ మెటల్ యొక్క రెండు సైలెన్సర్లు మరియు స్పాయిలర్ ఇందులో ఉన్నాయి.

భారతీయ మార్కెట్లోకి

భారతీయ మార్కెట్లోకి

వోక్స్‌వ్యాగన్ ఈ పోలో జిటిఐ కారును కంప్లీట్లి నాక్డ్ డౌన్ అనే ఆప్షన్ ద్వారా భారతీయ మార్కెట్లోకి అందివ్వనుంది. దీనిని 2016 సంవత్సరం మధ్య భాగానికి విడుదల చేయనున్నారు.

ధర

ధర

వోక్స్‌వ్యాగన్ తన జిటిఐ మోడల్ కారును దాదాపుగా రూ. 20 లక్షల రుపాయలకు అందించే అవకాశాలు ఉన్నాయి. అయితే మార్కెట్లోకి దీనిని విడుదల చేసిన తరువాత దీనికి ఇదే పోటి గా నిలుస్తుందని తెలిపారు.

ఇంజన్ మరియు ఇతర స్పెసిఫికేషన్స్ కోసం....
  1. కేవలం లక్షరుపాయలకే వోక్స్‌వ్యాగన్ బీటిల్ కారు బుకింగ్
  2. హ్యుందాయ్ టక్సన్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్

Most Read Articles

English summary
Volkswagen Polo GTI To Be Launched In India By Mid-2016
Story first published: Saturday, November 28, 2015, 14:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X