జూలై 3న విజిలేయనున్న వోల్వో ఎస్60 టీ6?

స్వీడిష్ ఆటోమెబైల్ తయారీ సంస్థ జూలై 3న తన వోల్వో ఎస్60 టీ6 వేరియంట్ ను భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. లగ్జరీ కార్ సెగ్మెంట్ తర్వాత వోల్వో విడుదల చేయనున్న వాహనం ఇదే.

వోల్వో భారత మార్కెట్ పట్ల అపార నమ్మకాన్ని పెంచుకుంది. లగ్జరీ సెడాన్ భారత్ లో ఇప్పచటికే అమ్మకానికి ఉంది. అయితే కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కొత్త వేరియంట్లను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది.

వోల్వో ఎస్60 టీ6 స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి :

  • ఇంజన్ : 2.0లీ, 4-సిలిండర్, పెట్రోల్ టర్బో చార్జెడ్.
  • హార్స్ పవర్ : 304
  • టార్క్ : 399.91 ఎన్ఎమ్.
  • గేర్ బాక్స్ : 8-స్పీడ్ ఆటోమేటిక్.

ప్రస్తుతం వోల్వో ఇండియా భారత్ లో వి40 క్రాస్ కంట్రీ, ఎక్స్.సీ90 మరియు వి40 హ్యాచ్ బ్యాక్ అనే మూడు మోడళ్లను విడుదలచేసింది. ఎస్60 టీ6 ద్వారా వోల్వో తన నాల్గవ మోడల్ ను విడుదలచేసి దేశంలో అమ్మకాలను పెంచుకోవాలని ప్రయత్నం చేస్తోంది.

ఇప్పుడు వోల్వో తన మోడళ్లను భారత్ కు దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, తయారీ యూనిట్లను స్థాపించే యోచనలో ఉంది. దీంతో ఉత్పత్తుల మీద అదనపు పన్నులు, ఎక్సైజ్ డ్యూటీలు తగ్గనున్నాయి. స్వీడిష్ ఆటోమెబైల్ తయారీ సంస్థ భారత్ లో వాహనాలను అసెంబ్లింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.....

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Saturday, June 27, 2015, 13:20 [IST]
English summary
Swedish automobile manufacturer, Volvo has displayed tremendous faith in Indian market. They have been launching vehicle after vehicle in the luxury car segment.
Please Wait while comments are loading...

Latest Photos