2015 నార్త్ అమెరికన్ కార్ ఆఫ్ ది ఇయర్: ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్, గోల్ఫ్ జిటిఐ

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్, అమెరికా మార్కెట్లో విక్రయిస్తున్న 2015 గోల్ఫ్ మరియు 2015 గోల్ఫ్ జిటిఐ మోడళ్లు '2015 నార్త్ అమెరికన్ కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డును దక్కించుకున్నాయని ఫోక్స్‌వ్యాగన్ అమెరికా పేర్కొంది. డెట్రాయిట్‌లో జరుగుతున్న 2015 నార్త్ అమెరికా ఇంటర్నేషనల్ ఆటో షోలో ఈ అవార్డుల ప్రధానం జరిగింది.

గోల్ఫ్, గోల్ఫ్ జిటిఐ మోడళ్లు ఆఫర్ చేస్తున్న ఇన్నోవేషన్, డిజైన్, డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్స్ మరియు అసమాన్యమైన విలువకు గాను ఈ అవార్డును దక్కించుకున్నాయని కంపెనీ తెలిపింది. ఈ కొత్త సంవత్సరాన్ని నార్త్ అమెరికన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ప్రారంభించడంతో తమకెంతో థ్రిల్లింగ్‌గా ఉందని ఫోక్స్‌వ్యాగన్ అమెరికా గ్రూప్ సీఈఓ మైఖేల్ హార్న్ తెలిపారు.

VW Golf And Golf GTI Won 2015 North American Car Of The Year

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ మోడళ్లు ఇప్పటికే అనేక ప్రతిష్టాత్మక ఆటోమోటివ్ అవార్డులను దక్కించుకున్నాయి. జర్మన్ ఫ్యామిలీకి చెందిన ఈ ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ సిరీస్‌లో కంపెనీ స్పోర్టీ గోల్ఫ్ జిటిఐ, ఫన్-టూ-డ్రైవ్ గోల్ఫ్ 1.8టి, గోల్ఫ్ టిడిఐ (డీజిల్), ఆల్-ఎలక్ట్రిక్ అండ్ జీరో ఎమిషన్ ఈ-గోల్ఫ్ మోడళ్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నవి 7వ తరానికి చెందిన గోల్ఫ్ బ్రాండ్ కార్లు.

ఇదిలా ఉండగా.. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ ఫ్యామిలీలోకి మరో కొత్త మోడల్ వచ్చి చేరబోతోంది. అదే సరికొత్త 292 హార్స్‌‌పవర్, ఆల్-వీల్ డ్రైవ్ 'గోల్ఫ్ ఆర్'. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఫోక్స్‌వ్యాగన్ ఈ గోల్ఫ్ కారులో 500 యూనిట్ల కోసం ప్రీ-బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం 10 గంటల్లోనే మొత్తం యూనిట్లు బుక్ అయిపోయాయి.

VW Golf

ఫోక్స్‌వ్యాగన్ నార్త్ అమరికన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకోవటం ఇది రెండవసారి. గతంలో 1999లో ఫోక్స్‌వ్యాగన్ విడుదల చేసిన కొత్త బీటెల్ ఈ అవార్డును దక్కించుకుంది. కాగా.. 2009లో ఫోక్స్‌వ్యాగన్ జెట్టా టిడిఐ, 2010లో ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ టిడిఐ/జిటిఐ మరియు 2012లో ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ మోడళ్లు ఈ అవార్డు కోసం ఫైనలిస్టులుగా నిలిచాయి.
Most Read Articles

English summary
Volkswagen of America, Inc. today announced that the 2015 Golf and 2015 Golf GTI have been named the 2015 North American Car of the Year. The Golf and Golf GTI were recognized for setting new benchmarks in their segments, including innovation, distinguished design, and available driver assistance features, as well as unmatched value. The cars beat out two other finalists, vying for the award in the 22nd annual iteration of the prestigious award.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X