2015లో మహీంద్రా హాలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ వస్తుందా?

By Ravi

మీకు మహీంద్రా హాలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ గుర్తుందా? మహీంద్రా గ్రూపు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగం మహీంద్రా రేవా, గడచిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన ఈ 2-డోర్, 2-సీటర్ మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును ఈ ఏడాది అందుటాబులోకి గతంలో కంపెనీ పేర్కొంది.

అయితే, ప్రస్తుత పరిస్థితి గమనిస్తుంటే, ఈ మోడల్ ఉత్పత్తి గురించి కంపెనీ ఇంకా ఓ నిర్ణయానికి వచ్చినట్లు కనబటం లేదు. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధాలే ఈ మోడల్ విడుదలకు జాప్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

Mahindra Halo Electric Sports Car

మహీంద్రా హాలో కారు గురించి..
మహీంద్రా హాలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారులో 105 కి.వా. (140 బిహెచ్‌పి)ల శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఈ మోటర్ ఓ హై కెపాసిటీ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది కేవలం 7 సెకండ్ల కన్నా తక్కువ వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుందట. దీని గరిష్ట వేగం గంటకు 200 కి.మీ. పైమాటే.

ఫ్యూచరిస్టిక్ డిజైన్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, అధునాతన సాంకేతికతతో కూడిన ఇంటీరియర్స్‌తో ఈ కారును తీర్చిదిద్దారు. మహీంద్రా హాలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును ఇండియాతో పాటుగా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించాలని మహీంద్రా రేవా భావిస్తోంది. ఇది మనకంటే ముందుగా యూరోపియన్ మార్కెట్లో (మహీంద్రా ఈ2ఓ మాదిరిగా) విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
<center><iframe width="100%" height="450" src="https://www.youtube.com/embed/YdP22aYlIDc?rel=0&showinfo=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Mahindra Reva had showcased its Halo, a two-door, two-seater electric sports car concept at Auto Expo 2014. Mahindra Reva is planing to launch more electric cars in coming years including Halo.&#13;
Story first published: Saturday, February 7, 2015, 16:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X