చిన్న కారును అభివృద్ధి చేస్తున్న యమహా, 2019లో విడుదల!

By Ravi

జపనీస్ ద్విచక్ర వాహన దిగ్గజం యమహా ఓ చిన్న కారును అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే, వివిధ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న యమహా గ్రూప్ తాజాగా ఫోర్-వీలర్ మార్కెట్లోకి కూడా ప్రవేశించాలని యోచిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, యమహా ఓ చిన్న కారును డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న 2019లో ఈ యమహా కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రధానంగా యూరోపియన్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని యమహా తమ చిన్న కారును ప్రవేశపెట్టనుంది. గడచిన 2013 టోక్యో మోటార్ షోలో యమహా తమ 'మోటివ్.ఈ' (MOTIV.e) అనే సిటీ కారును ప్రదర్శనకు ఉంచిన సంగతి తెలిసినదే. మెక్‌లారెన్ ఎఫ్1తో పాటుగా అనేక ఫార్ములా వన్ కార్లను డిజైన్ చేసిన ప్రముఖ ఆటోమోటివ్ డిజైనర్ గోర్డాన్ ముర్రే ఈ కారును డిజైన్ చేశారు.

yamaha motiv e city car

యమహా తొలుత తమ స్మాల్ కార్ ప్రాజెక్టును యూరోపియన్ మార్కెట్ల కోసం మాత్రమే చేపట్టినప్పటికీ, భవిష్యత్తులో ఈ మోడల్‌కు వచ్చే డిమాండ్‌ను మరియు సాధ్యాసాధ్యాలను బట్టి దీనిని ఇతర మార్కెట్లో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఈ చిన్న కారు కోసం యమహా ఓ ఇంజన్‌ను తామే స్వయంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కారు ఉత్పత్తి వ్యయాన్ని తక్కువగా ఉంచేందుకు గాను, ఇందులో ఉపయోగించే విడిభాగాలను కూడా అవుట్‌సోర్స్ చేసే అవకాశం ఉంది.

కాగా.. యమహా మోటివ్.ఈ విషయానికి వస్తే.. ఇదొక టూ-సీటర్ ఎలక్ట్రిక్ కారు. ఇందులో అమర్చి 8.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సాయంతో ఎలక్ట్రిక్ మోటార్ నడుస్తుంది. ఈ మోటార్ గరిష్టంగా 25 కిలోవాట్ల పవర్‌ను. 896 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే, ఇది ఎలక్ట్రిక్ కారు అయినప్పటికీ, యమహా బైక్‌ల మాదిరిగానే మంచి పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

yamaha motiv e city car launch in 2019

యమహా మోటివ్.ఈ ఎలక్ట్రిక్ కారులో కంపెనీ సింగిల్ స్పీడ్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించింది. ఈ గేర్ బాక్స్ టార్క్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, దానికి అనుగుణంగా పనిచేస్తుంటుంది. మోటివ్.ఈ కేవలం 15 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 105 కిలోమీటర్లకు తగ్గకుండా పరుగులు తీస్తుంది.

yamaha motiv e car in development

మోటివ్.ఈ ఎలక్ట్రిక్ కారును తేలికగా ఉండేలా డిజైన్ చేశారు. ఈ కారు మొత్తం బరువు 726 కేజీలు మాత్రమే. పూర్తి బ్యాటరీ చార్జ్‌పై ఇది 160 కిలోమీటర్ల దూరం నడుస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయటానికి పట్టే సమయం కూడా కేవలం మూడు గంటలు మాత్రమే. ఈ కారు నిర్మాణంలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, దీనిని ఐస్ట్రీమ్ అనే కన్‌స్ట్రక్షన్ టెక్నిక్‌పై నిర్మించారు. గోర్డాన్ ముర్రే ఇదే టెక్నిక్‌ను ఫార్ములా వన్ కార్ల తయారీలో ఉపయోగిస్తాడు. ఇది తేలికైన మరియు సురక్షితమైన నిర్మాణానికి సహకరిస్తుంది.

Most Read Articles

English summary
Yamaha is known to develop one of the best two-wheeler across the globe. Over the years they have decided to enter various other segments to re-ignite their passion. Now the Japanese manufacturer has decided it will compete even in the four-wheeler market.
Story first published: Monday, March 2, 2015, 9:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X