హిస్టరీలో భారీగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్లు

By Anil

ప్రస్తుతం ఆధునిక కాలంలో కొత్త ఫీచర్ల పోకడలతో సకల సౌకర్యాలతో అధునాతనమైన కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో అన్ని అంశాల పరంగా బెస్ట్‌గా నిలిచిన కార్లనే వినియోగదారులు ఎక్కువగా ఎంచుకుంటారు. కాని చరిత్రను ఒక సారి తిరగేస్తే అందులో చాలా వరకు ఇప్పుడు మనకు నచ్చకపోవచ్చు. కాని ఆ కాలానికి వాటిని మించిన కార్లు ఉండేవి కావు.

చరిత్రలో బెస్ట్ సెల్లింగ్ కార్లు అనే విషయానికి వస్తే, అప్పట్లో ఫీచర్లు మరియు సదుపాయాలు మరియు డిజైన్ అంశాలను ప్రక్కన పెట్టి మరీ ఆ కాలంలో కార్లను కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆలాంటి కార్లు వీధుల్లో పురాతణ కార్లలా అక్కడక్కడ దర్శనమిస్తూనే ఉంటాయి.

హిస్టరీలో ఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ కార్లుగా నిలిచిన టాప్ 10 కార్ల గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

10. షెవర్లే ఇంపాలా

10. షెవర్లే ఇంపాలా

అమెరికాకు చెందిన షెవర్లే సంస్థ 1958లో తమ మొదటి ఇంపాలా కారును అందుబాటలోకి తెచ్చారు. అప్పటి నుండి సుమారుగా 14 మిలియన్ (140 లక్షల) కార్ల అమ్మకాలు జరిపారు. షెవర్లే సంస్థ 2014 లో కొత్త ఇంపాలాను విడుదల చేశారు.

ఇంపాలా

ఇంపాలా

ఇంపాలా ఫుల్ సైజ్ సెడాన్‌లో 195బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 2.5-లీటర్ ఎకోటెక్ పెట్రోల్ మరియు 304బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 3.6-లీటర్ వి6 డైరెక్ట్ ఇంజెక్షన్ డీజల్ ఇంజన్‌ను అందించారు. మరియు 260బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 3.6-లీటర్ వి6 బయో ఫ్యూయల్ ఇంజన్‌ను కూడా పరిచయం చేశారు.

 09. వోక్స్‌వ్యాగన్ పస్సాట్

09. వోక్స్‌వ్యాగన్ పస్సాట్

వోక్స్‌వ్యాగన్ సంస్థ ప్రపంచ మార్కెట్లోకి తమ పస్సాట్ మొదటి కారును 1973లో అందుబాటులోకి తెచ్చారు. ఆ తరువాత సుమారుగా ఎనిమిది జనరేషన్లుగా విడదలవుతూ వచ్చింది. ఇప్పటి వరకు సుమారుగా 15.5 మిలియన్ పస్సాట్ కార్లు అమ్ముడుపోయాయి.

పస్సాట్

పస్సాట్

వోక్స్‌వ్యాగన్ సంస్థ ఈ పస్సాట్‌ను మూడు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంచింది. 1.8-లీటర్ టిఎస్ఐ టర్బోఛార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల ఇంజన్, 3.6-లీటర్ వి6 మరియు 2.0-లీటర్ టిడిఐ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్‌.

08. ఫోర్డ్ మోడల్ టి

08. ఫోర్డ్ మోడల్ టి

ఫోర్డ్ సంస్థ తమ ప్రస్థానం మొదలు పెట్టింది దీనితో అని ఒకరకంగా చెప్పవచ్చు. సగటు వినియోగదారులు కోరుకునే విధంగా దీనిని ఉత్పత్తి జరిగింది. 1908 లో హెన్నీ ఫోర్డ్ ఈ మోడల్ టి ను మొదటి సారిగా ఉత్పత్తి చేశాడు.

మోడల్ టి

మోడల్ టి

గత 86 ఏళ్లుగా ఫోర్డ్ మోడల్ టి కారు ఉత్పత్తి నిలిచిపోయింది. అయినప్పటికీ ఇది ఈ జాబితాలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. దీని ఉత్పత్తి ప్రారంభించిన కాలం నుండి నిలిచిపోయే వరకు 16.5 మిలియన్ మోడల్ టి కార్ల అమ్మకాలు జరిపింది ఫోర్డ్ సంస్థ.

07. హోండా అకార్డ్

07. హోండా అకార్డ్

హోండా కార్స్ 1976 లో మొదటి అకార్డ్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారుగా 17.5 మిలియన్ కార్లు అమ్ముడుపోయాయి. హోండా సంస్థ అమెరికాలో ఉత్పత్తి చేసిన మొదటిది ఇదే. ఇప్పటి వరకు ఎనిమిది జనరేషన్లలో విడుదలైంది. ఇది నాలుగు డోర్ల సెడాన్ మరియు రెండు డోర్ల కూపే మోడళ్లలో లభించును.

అకార్డ్

అకార్డ్

అకార్డ్ మూడు ఇంజన్ ఆప్షన్‌లలో లభించును. అందులో 183బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 2.5-లీటర్ 16 వాల్వ్ నాలుగు సిలిండర్ల, 277బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 3.5-లీటర్ 24-వాల్వ్ వి6 ఇంజన్ మరియు 2.4-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్.

06. హోండా సివిక్

06. హోండా సివిక్

హోండా సంస్థ సుమారుగా 18.5 మిలియన్ కన్నా ఎక్కువ కార్ల అమ్మకాలు జరిపింది. హోండా తమ మొదటి సివిక్ ను 1972 లో పరిచయం చేసింది. ఇప్పుడు 10 వ జనరేషన్ సివిక్ అందుబాటులోకి వచ్చింది.

సివిక్

సివిక్

హోండా సివిక్ 1.8-లీటర్, 2.4-లీటర్, 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ అనే ఇంజన్ ఆప్షన్‌లలో లభించును. అన్ని ఇంజన్‌లు కూడా పెట్రోల్ తో నడిచేవే.

05. ఫోర్డ్ ఎస్కార్ట్

05. ఫోర్డ్ ఎస్కార్ట్

ఫోర్డ్ సంస్థ ఈ ఎస్కార్ట్‌ను 1981 లో మొదటి సారిగా పరిచయం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 18 మిలియన్ల ఎస్కార్ట్ కార్లు అమ్ముడుపోయాయి. ఆరు జనరేషన్లలో ఇది విడుదలైంది. అయితే 2004 నాటికి దీని ఉత్పత్తిని నిలిపివేసింది.

 ఎస్కార్ట్

ఎస్కార్ట్

ఫోర్డ్ ఎస్కార్ట్ వివిధ రకాల ఇంజన్ ఆప్షన్‌లలో లభించేది. అందులో 1.3-లీటర్ నుండి 2.0-లీటర్ మధ్య వివిధ రకాల సామర్థ్యాలతో ఇది అందుబాటులో ఉండేది.

04. వోక్స్‌వ్యాగన్ బీటిల్

04. వోక్స్‌వ్యాగన్ బీటిల్

వోక్స్‌వ్యాగన్ మొదటి బీటిల్ కారును 1938 లో అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కాలం పాటు కొనసాగుతున్న కారుగా బీటిల్ నిలిచింది. విడుదల కాలం నాటి నుండి ఇప్పటి వరకు సుమారుగా 23.5 మిలియన్ కార్లు అమ్ముడుపోయాయి.

బీటిల్

బీటిల్

వోక్స్‌వ్యాగన్ సంస్థ ఈ బీటిల్ లో 148బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను అందించింది.

03. వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్

03. వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్

వోక్స్‌వ్యాగన్ వారి బెస్ట్ సెల్లింగ్ కారు గోల్ఫ్ ఒకటి. సుమారుగా 27.5 మిలియన్ కన్నా ఎక్కువ కార్లను అమ్మేశారు. వోక్స్‌వ్యాగన్ ఈ గోల్ఫ్ కారును 1974 లో మొదటి సారిగా విడుదల చేశారు. సుమారుగా ఏడు జనరేషన్లలో దీనిని విడుదల చేస్తూ వచ్చారు.

గోల్ఫ్

గోల్ఫ్

ప్రస్తుతం ఉన్న జనరేషన్ గోల్ఫ్ లో నాలుగు సిలిండర్ల 2.4-లీటర్ టర్భో చార్జ్‌డ్ ఇంజన్ కలదు. అందులో గోల్ఫ్ టిఎస్ఐ, జిటిఐ అనే పెట్రోల్ పవర్ మరియు గోల్ఫ్ టిడిఐ, జిటిడి డీజల్ పవర్ గోల్ఫ్ కార్లు ఉన్నాయి.

02. ఫోర్డ్ ఎఫ్ సిరీస్

02. ఫోర్డ్ ఎఫ్ సిరీస్

ఫోర్డ్ సంస్థ ఈ ఎఫ్ సిరీస్‌ను మొదటగా 1948 లో బోనల్ బిల్ట్ అనే పేరుతో విడుదల చేశారు. సుమారుగా 35 మిలియన్ యూనిట్లు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడుపోయాయి. పికప్ ట్రక్కుల ప్రపంచంలో ఇది రారాజుగా నిలిచింది.

 ఎఫ్ సిరీస్

ఎఫ్ సిరీస్

ప్రస్తుతం 13 వ తరానికి చెందిన ఎఫ్-సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఫోర్డ్ ఎఫ్ సిరీస్‌లో 3.5-లీటర్ వి6, 2.7-లీటర్ ఎకో బూస్ట్ ట్విన్ టుర్బో వి6, 3.-లీటర్ ఎకో బూస్ట్ ట్విన్ టుర్బో వి6 మరియు 5.0-లీటర్ వి8 అనే ఇంజన్ ఆప్షన్‌లలో ఇది అందుబాటులో ఉంది.

01. టయోటా కరోలా

01. టయోటా కరోలా

టయోటా మోటార్స్ మొదటి కరోలాను 1966 లో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. 1974 కాలం నాటికి ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. ప్రస్తుతానికి 40 మిలియన్లకు పైగా కరోలా కార్లు అమ్ముడుపోయాయి.

కరోలా

కరోలా

ఈ కరోలా ను ప్రస్తుతం 11 వ జనరేషన్‌లో అందించారు. 2011లో జపాన్‌లో మరియు 2013 నాటికి అంతర్జాతీయంగా ఈ కరోలా 11 వ తరానికి చెందిన కరోలా విడుదల చేశారు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఇదే అందుబాటులో ఉంది. ఈ కరోలా లో 1.8-లీటర్ పెట్రోల్ మరియు 1.4-లీటర్ డీజల్ ఇంజన్ అందుబాటులో ఉంది.

హిస్టరీలో బెస్ట్ సెల్లింగ్ కార్లు

  • వరల్డ్ వైడ్ టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు: అందులో ఐదు ఇండియావే

Most Read Articles

English summary
Top 10 History’s Best-Selling Cars Of All Time
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X