అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా భారతదేశపు మొదటి అత్యాధునిక బస్టాండ్ విజయవాడ

ఏపిఎస్‌‌ఆర్‌టిసి, ఈ పేరు వినగానే దీని నష్టాల చరిత్ర, డొక్కు బస్సులు, అరకొర సర్వీసులు, సదుపాయాలు లేని బస్టాండ్లు అనే విమర్శలు వస్తాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత లోటు బడ్జెట్‌తో ప్రారంభం అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత ధీనంగా తయారయ్యింది. అయితే ఎవ్వరూ కనీవిని ఎరుగని రీతిలో, ప్రంపచ స్థాయి ప్రమాణాలకు ధీటుగా, దేశ వ్యాప్తంగానే ఎన్నో ప్రభుత్వం రవాణా సంస్థలు ఆశ్చర్యపోయే విధంగా ఏపిఎస్ఆర్‌టిసి అభివృద్ది చెందింది.

ప్రతి రోజు, ప్రతి గడియ ప్రజలతో బంధాలు, అనుబంధాలను కలిగి, ప్రజల జీవనయాణాన్ని నిర్దేశిస్తూ, ప్రతినిత్యం ప్రజాజీవితంలో మమేకమైన మన ఏపిఎస్‌ఆర్‌టిసి గురించి మరియు తాజాగా జరిగిన అభివృద్ది తీరుతెన్నులు గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం.

1. 55 లక్షల మందికి సేవలు..

1. 55 లక్షల మందికి సేవలు..

నేడు ఏపిఎస్ఆర్‌టిసి రోజుకు 55 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది.

2. రోజుకు 47.5 లక్షల కిమీలు

2. రోజుకు 47.5 లక్షల కిమీలు

ప్రజల జీవనంలో మమేకమైన ఏపిఎస్‌ఆర్‌టిసి రోజుకు సుమారుగా 47.5 లక్షల కిలోమీటర్ల మేర బస్సులను నడుపుతోంది.

3. 66,846 మంది ఉద్యోగులు

3. 66,846 మంది ఉద్యోగులు

ఏపిఎస్‌ఆర్‌టిసి రోజు వారి ప్రయాణికుల సేవలో సుమారుగా 66,846 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

4. రోజుకు 11,993 బస్సు సేవలు

4. రోజుకు 11,993 బస్సు సేవలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 17,800 వరకు పల్లె మరియు పట్టణ ప్రాంతాలను కలుపుతూ 11,993 బస్సులను నడుపుతున్నారు.

5. మెడికల్ మరియు రిటైల్ షాపులు

5. మెడికల్ మరియు రిటైల్ షాపులు

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలోని బస్టాండుల్లో ప్రయాణికుల అవసరాల మేరకు మెడికల్ షాపులు, డయాగ్నస్టిక్ సెంటర్లు మరియు రిటైల్ షాపులను అందుబాటులోకి తీసుకొచ్చారు.

6. ప్రకటనలు సదుపాయం

6. ప్రకటనలు సదుపాయం

రిటైల్, వ్యాపార మరియు స్వఛ్చంద సంస్థలకు కోసం వారికి అనుగుణంగా ఆధునిక పద్దతుల ద్వారా ప్రకటనలు ఇచ్చుకునే సదుపాయం.

7. పెరిగిన ప్రకటనల ఆదాయం

7. పెరిగిన ప్రకటనల ఆదాయం

ప్రకటనల ద్వారా 54 లక్షల ఆదాయం నుండి 7 కోట్లు ఆదాయం వరకు వచ్చేలా ఏపిఎస్‌ఆర్‌టిసి మార్పులు తెచ్చింది. తద్వారా ప్రకటనల ద్వారా సంస్థకు వచ్చే 10 రెట్లు పెరిగింది.

8. అంతర్జాతీయ పద్దతిలో

8. అంతర్జాతీయ పద్దతిలో

ప్రముఖ ప్రయివేట్ సంస్థలకు ధీటుగా కొరియర్ మరియు పార్శిల‌ సేవలను అంతర్జాతీయ పద్దతిలో అందించడం కోసం ఇ-కామర్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

9. ఎక్కువ దూరం

9. ఎక్కువ దూరం

రోజు వారి నిర్వహణ పరధిని 45.5 లక్షల కిలోమీటర్ల నుండి 47.5 లక్షల కిలోమీటర్లకు పెంచడం జరిగింది.

10. బస్సుల నిర్వహణ

10. బస్సుల నిర్వహణ

సైంటిఫిక్ ప్లానింగ్ మరియు షెడ్యూల్ ద్వారా డిపోలలో బస్సుల నిర్వహణ

11. ఎయిర్ పోర్ట్ తరహా సీటింగ్ సిస్టమ్

11. ఎయిర్ పోర్ట్ తరహా సీటింగ్ సిస్టమ్

రాష్ట్ర వ్యాప్తంగా 100 కు పైగా బస్‌స్టాండులను ఆధునీకరించడం లేదా పునర్నిర్మాణం చేయడం జరిగింది. అందులో ఎయిర్ పోర్ట్‌లలో ఉండేటటువంటి సీటింగ్ వ్యవస్థ కల్పించారు

12. ఎయిర్ పోర్ట్‌ పోలిన నిర్మాణం

12. ఎయిర్ పోర్ట్‌ పోలిన నిర్మాణం

సాధారణంగా ఇలాంటి నిర్మాణాలను ఎయిర్ పోర్ట్‌లలో మాత్రమే చూస్తుంటాం. అయితే ఇది విజయవాడలోని బస్టాండు ఆవరణం యొక్క ఆధునిక నిర్మాణం

13. ఉచిత త్రాగునీరు

13. ఉచిత త్రాగునీరు

సదుపాయాలలో భాగంగా వివిధ రకాలుగా లభించే ఉచిత త్రాగునీటి సదుపాయం.

14. మెగా డిజిటల్ స్క్రీన్ ద్వారా లైవ్ ఛానెల్ ప్రసారాలు

14. మెగా డిజిటల్ స్క్రీన్ ద్వారా లైవ్ ఛానెల్ ప్రసారాలు

ప్రయాణికులకు ఆహ్లాదం కలిగించడానికి మోడల్ ప్రాజెక్ట్‌గా విజయవాడ బస్టాండులో మెగా డిజిటల్ స్క్రీన్‌‌ను ఏర్పాటు చేశారు.

15. ఆట విడుపు కోసం

15. ఆట విడుపు కోసం

ప్రయాణికుల కోసం స్వల్ప సమయం పాటు ఆట విడుపును కల్పించడానికి మిని స్పోర్ట్స్ జోన్‌ను కూడా ఏర్పాటు చేశారు.

16. కంప్లైంట్ మరియు రెస్ట్ రూమ్‌లు

16. కంప్లైంట్ మరియు రెస్ట్ రూమ్‌లు

ప్రయాణికులకు నిరంతరం అందుబాటులో ఉండేవిధంగా సెంట్రల్ కంప్లైట్ సెల్ మరియు రెస్ట్‌ రూమ్‌లను కూడా ఏర్పాటు చేసారు.

17. ఆధునిక మరుగుదొడ్లు

17. ఆధునిక మరుగుదొడ్లు

అత్యున్నత స్థాయి మరియు ఆధునిక ప్రమాణాలతో మరుగుదొడ్లను నిర్మించారు.

18. ముందస్తు బుకింగ్ మీద రాయితీ

18. ముందస్తు బుకింగ్ మీద రాయితీ

ప్రయాణికులు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడం వలన ప్రయాణ మొత్తంలో 5 నుండి 20 శాతం వరకు తగ్గింపు పొందే అవకాశం కల్పించారు.

19. 600 లకు పైగా సర్వీసులు

19. 600 లకు పైగా సర్వీసులు

ప్రస్తుతం ఏపిఎస్ఆర్‌టిసి రోజుకు 600 లకు పైగా సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది

20. 22,000 లకు పైగా సీట్లు

20. 22,000 లకు పైగా సీట్లు

రోజుకు 22,000 లకు పైగా సీట్లు ప్లెక్సీఫెయిర్ గా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

21. హై ఎండ్ అమరావతి బస్సులు

21. హై ఎండ్ అమరావతి బస్సులు

దూర ప్రాంత ప్రయాణాలకు అత్యంత అనువుగా ఉండేందుకు 45 వరకు హై ఎండ్ అమరావతి బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

22. ప్రతి సీటుకు ఒక టీవీ

22. ప్రతి సీటుకు ఒక టీవీ

డైరెక్ట్ శాటిలైట్ లింక్ ద్వారా ప్రతి సీటుకు కూడా 255 కు పైగా లైవ్ ఛానళ్లను మరియు క్రికెట్ మాచ్‌లను వీక్షించేందుకు ప్రత్యేకంగా టీవీలను ఏర్పాటు చేశారు. దీనిని దేశ వ్యాప్తంగా మొదటి సారిగా అందుబాటులోకి తెచ్చిన సంస్థ ఏపిఎస్‌ఆర్‌టిసి

23. బస్సులలో వై-ఫై సేవలు

23. బస్సులలో వై-ఫై సేవలు

ప్రయాణికుల అవసరాల మేరకు ఈ బస్సుల్లో ఇంటర్‌నెట్ వై-ఫై సేవలను అందుబాటులోకి తెచ్చారు.

24. బస్సులలో ప్రయాణికుల భద్రత

24. బస్సులలో ప్రయాణికుల భద్రత

ప్రయాణికుల భద్రత మరియు వారి రక్షణ కోసం ఈ బస్సుల్లో సిసిటీవి కెమెరాలు మరియు ఫైర అలారమ్‌లను ఏర్పాటు చేశారు.

25.నూతన రాయితీ సర్వీసు

25.నూతన రాయితీ సర్వీసు

ముందస్తుగా టికెట్ బుక్ చేసుకునే వారు బస్సులోని చివరి రెండు వరుసలలో ఉన్న సీట్లను బుక్ చేసుకునే వారికి, వారి ప్రయాణ టికెట్ మొత్తంలో 20 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

26. విచారణ కేంద్రాలు

26. విచారణ కేంద్రాలు

ఏపిఎస్ఆర్‌టిసి బస్టాండులలో కేవలం ప్రయాణికుల విచారణల కోసం ఎక్కువ మందితో కూడిన విచారణ కౌంటర్లను ఏర్పాటు చేశారు.

27. బస్సు ట్రాకింగ్

27. బస్సు ట్రాకింగ్

సుమరుగా 40 ప్రధాన రూట్లలోని 453 బస్సులలో అడ్వాన్స్‌ అరైవల్ సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా మీ మొబైల్ నుండి మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎంత సేపట్లో వస్తుందో, ఎక్కడ వస్తుందో అనే సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

28. ఎస్‌ఎమ్‌ఎస్ రూపంలో సమాచారం

28. ఎస్‌ఎమ్‌ఎస్ రూపంలో సమాచారం

స్మార్ట్ ఫోన్ వినియోగించలేని ప్రయాణికుల కోసం RTC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి తాము ఎదురు చూస్తున్న బస్ నెంబర్ టైప్ చేసి 9246022333 అనే నెంబర్‌కు మెసేజ్ పంపితే సమాచారాన్ని ఎస్‌ఎమ్ఎస్‌ రూపంలో పంపించడం జరుగుతుంది.

29. జిపిఎస్ పరిజ్ఞానం

29. జిపిఎస్ పరిజ్ఞానం

జిపిఎస్ పరిజ్ఞానం ద్వారా దూర ప్రాంత బస్సుల నియంత్రణ మరియు పర్యవేక్షించడం జరుగుతోంది.

30. నేర నియంత్రణ కోసం

30. నేర నియంత్రణ కోసం

నేర నియంత్రణకు చాలా వరకు అన్ని ప్రధాన బస్సు డిపోలలో సిసిటివి నిఘాను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

31. మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదులు

31. మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదులు

మొబైల్ యాప్ ద్వారా బస్సు బ్రేక్ డౌన్, యాక్సిడెంట్, మెడికల్ ఎమర్జెన్సీ మొదలగు సమస్యలను ఫిర్యాదు చేయవచ్చు.

32. ఫిర్యాదులకు స్పందన

32. ఫిర్యాదులకు స్పందన

ఏపిఎస్‌ఆర్‌టిసి కాల్‌సెంటర్‌కు అందిన ఫిర్యాదుల కోసం తక్షణం స్పందించి సేవలందించగలదు.

33. తెలుగు ఛానెల్లు

33. తెలుగు ఛానెల్లు

వై-ఫై సేవల ద్వారా మై థియేటర్, తెలుగు వన్ మరియు తోరి అనే ప్రముఖ తెలుగు ఛానళ్లను వీక్షించే సదుపాయం కల్పించారు.

34. నూతన మార్గాలలో సంస్థకు ఆదాయం

34. నూతన మార్గాలలో సంస్థకు ఆదాయం

వినియోగదారులు వినియోగించే మొబైల్ యాప్ ద్వారా వ్యాపార ప్రకటనలు ఇస్తున్నారు, తద్వారా సంస్థకు మరింత ఆదాయం చేకూరుతోంది.

35. ఆర్థిక పరమైన లాభాలు

35. ఆర్థిక పరమైన లాభాలు

మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి కూపన్లు మరియు డిస్కౌంట్ల ద్వారా ప్రయాణికులకు ఆర్థికపరమైన లాభాలను అందిస్తోంది.

36. బస్టాండుల్లో సినిమా థియేటర్

36. బస్టాండుల్లో సినిమా థియేటర్

బస్టాండుల్లో ఎక్కువ సమయం పాటు వేచి ఉండే ప్రయాణికుల కోసం మిని థియేటర్లు నిర్మించారు. ఇది దేశ చరిత్రలో మొదటిది.

37. ఏపిఎస్‌ఆర్‌టిసి నినాదం

37. ఏపిఎస్‌ఆర్‌టిసి నినాదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ - బస్సు చక్రం ప్రగతికి చిహ్నం అనే నినాదాన్ని ఏపిఎస్‌ఆర్‌టిసి ఇప్పుడు నిజం చేస్తోంది.

Most Read Articles

English summary
Apsrtc Offers Huge Facilities For Travellers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X