అన్ని పరీక్షల్లో పాసైన డ్రైవర్ లెస్ బస్సు: త్వరలో రోడ్ల మీదకు

By Anil

డ్రైవర్ లేకుండా నడిచే వాహనాల మీద ప్రయోగాలకు ప్రపంచ మొత్తం ఒకే సారి నడుం బిగించింది. ఇందులో మొత్తం వాహన తయారీ సంస్థలే ఉన్నాయి. అయితే ఒక దేశ ప్రభుత్వం కూడా ఇలాంటి పరిశోధనలకు శ్రీకారం చుట్టి విజయం సాధించింది. పశ్చిమ ఆస్ట్రేలియా లో ఒక డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ బస్సును అధికారికంగా ప్రయోగించి విజయం సాధించింది.

డ్రైవర్ లెస్ బస్సు

పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో ఆ ప్రభుత్వం ఈ ఎలక్ట్రిక్ మరియు డ్రైవర్ లెస్ బస్సును ప్రయోగాత్మకంగా నడిపింది. అయితే ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా విజయవంతంగా నడిచింది ఈ బస్సు.

డ్రైవర్ లెస్ బస్సు

పెర్త్ నగరంలో సర్ జేమ్స్ మిట్చెల్లీ పార్క్ నుండి ఓల్డ్ మిల్ వరకు గల రూటును 25 నిమిషాల్లో చేరుకుంది. దీని గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లుగా ఉంది మరియు సగటు వేగం గంటకు 25 కిలోమీటర్లుగా ఉంది.

డ్రైవర్ లెస్ బస్సు

ఇంటెల్లీబస్ అనే పేరు గల దీనిని ఆర్‌ఎసి మరియు పశ్చిమ ఆస్ట్రేలియా చొరవతో ఫ్రెంచ్‌కు చెందిన సంస్థ నవ్వ ఎస్ఏఎస్ దీనిని రూపొందించింది.

డ్రైవర్ లెస్ బస్సు

చూడటానికి బొమ్మ బస్సులా ఉండే ఈ ఎలక్ట్రక్ మరియు డ్రైవర్ లెస్ ఇంటెల్లీ బస్సులో సుమారుగా 15 మంది వరకు సౌకర్యవంతంగా ప్రయాణించే వీలు కలదు.

డ్రైవర్ లెస్ బస్సు

ఈ బస్సు ఇంటీరియర్‌లో అంతర్గత కెమెరాలు, జిపిఎస్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, 2డి మరియు 3డి LIDAR వంటి ఫీచర్లున్నాయి. ఈ ఫీచర్లన్నింటిని మనం ప్రస్తుతం ఉన్న కార్లలో గమనించవచ్చు. అయితే మనిషి ప్రమేయం లేకుండా ఒకదానికొకటి స్వయంగా ప్రయాణిస్తాయి.

డ్రైవర్ లెస్ బస్సు

ఈ ఇంటెల్లీ డ్రైవర్ లెస్ బస్సును మరో మూడు వారాల పాటు పరీక్షించనున్నారు. అత్యంత చౌకగా ఈ బస్సులో ప్రయాణించడానికి అక్కడి ప్రజలు ఆర్ఎసి అనే వెబ్‌సైట్‌లో తమ వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది.

డ్రైవర్ లెస్ బస్సు

ఆస్ట్రేలియా ఎలక్ట్రిక్ మరియు డ్రైవర్ లెస్ ఇంటెల్లీ బస్సు

డ్రైవర్ లెస్ బస్సు

ఆస్ట్రేలియా ఎలక్ట్రిక్ మరియు డ్రైవర్ లెస్ ఇంటెల్లీ బస్సు

డ్రైవర్ లెస్ బస్సు

  • భవిష్యత్ ప్రయాణం ఇలా ఉంటుందంటే నమ్మగలరా...?

Most Read Articles

English summary
Australian Autonomous Bus Trial Goes Without Trouble (Or Driver)
Story first published: Saturday, September 3, 2016, 15:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X