మూడు ఆఫ్ రోడ్ వాహనాలతో మొదటిసారి దేశీయ మార్కెట్లోకి : జీప్ బ్రాండ్

By Anil

అంతర్జాతీయంగా ఆఫ్ రోడ్ వాహనాలకు ఎంతో పేరుగాంచిన జీప్ బ్రాండ్ సంస్థ దేశీయ మార్కెట్లోకి మొదటి సారిగా ప్రవేశించింది. గత వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో ను వేదికగా చేసుకుని జీప్ బ్రాండ్ సంస్థ మూడు ప్రత్యేక ఆఫ్ రోడ్ వాహానలతో ఎంట్రీ ఇచ్చింది.

జీప్ బ్రాండ్


ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ కు చెందిన ఈ లగ్జరీ ఆఫ్ రోడ్ వాహనాల తయారీ సంస్థ జీప్ బ్రాండ్ తమ 75 వ వార్షికోత్సవం సందర్భంగా మన దేశ ఆఫ్ రోడ్ వాహనాల మార్కెట్లోకి ఆరంగ్రేటం చేసింది. ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించిన మూడు వాహనాలు:
  • వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్
  • గ్రాండ్ చిరోకి
  • గ్రాండ్ చిరోకి ఎస్‌ఆర్‌టి

వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్:
దేశ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్‍‌‌ను ప్రస్తుతం కంప్లీట్లి బిల్ట్ యూనిట్ గా దిగుమతి చేసుకోనున్నారు. అయితే త్వరలో వీటిని దేశీయంగా తయారు చేయనున్నారు.


సాంకేతిక వివరాలు:
దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన వ్రాంగ్లర్ ఎస్‌యువి లో 2.8-లీటర్ డిఒహెచ్‌సి ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 5-స్పీడ్ ఆటోమోటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. ఇందులో గల ఇంజన్ దాదాపుగా 177 బిహెచ్‌పి పవర్ మరియు 409 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఎస్‌యువి 4x4 డ్రైవ్‌సిస్టమ్‌తో అందుబాటులో ఉండనున్నాయి.

Most Read Articles

English summary
Auto Expo Jeep Rolls Wrangler Unlimited Into India
Story first published: Tuesday, February 9, 2016, 15:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X