వ్యవసాయ రంగంలో విప్లవానికి నాంది పలకనున్న సెల్ఫ్ డ్రైవింగ్ ట్రాక్టర్లు

By Anil

గత కొన్ని నెలలుగా ప్రపంచ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో అటానమస్ ట్రాక్టర్లకు సంభందించి చాలా వరకు వార్తలు వెలువడుతున్నాయి. అందులో చాలా వరకు తయారీ సంస్థలు డ్రైవర్ లెస్ ట్రాక్టర్ల తయారీలో బిజీగా ఉన్నాయి. డ్రైవర్ లెస్ కార్లు, బైకులు మరియు విమానాలతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు అయితే రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉండే డ్రైవర్ లెస్ ట్రాక్టర్ల అంశం ముందుకు వచ్చింది. అందుకోసం న్యూ హాలెండ్ సంస్థ ఒక అడుగు ముందుకు వేసి అటానమస్ ట్రాక్టర్‌ను అభివృద్ది చేసింది.

డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్లు

న్యూ హాలెండ్ సంస్థ ప్రస్తుతం కాన్సెప్ట్ దశలో ఉన్న అటానమస్ ట్రాక్టర్‌ను మన ముందుకు తీసుకువచ్చింది. ఎన్‌హెచ్‌డ్రైవ్ ప్రేరణతో దీనిని అభివృద్ది చేశారు. అయితే చూడటానికి సాధారణ ట్రాక్టర్‌ను పోలి ఉంటుంది

డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్లు

ఎన్‌హెచ్‌డ్రైవ్ ట్రాక్టర్ పూర్తి స్థాయిలో అటానమస్ (డ్రైవర్ లెస్) ట్రాక్టర్. దీనిని రైతు దూరం నుండి చరవాణి, ట్యాబ్ లేదా కంప్యూటర్ డెస్క్ టాప్ నుండి నియంత్రించవచ్చు.

డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్లు

ఇది ముందస్తుగా సూచించిన భూ భాగం తాలూకు మ్యాప్ ద్వారా అక్కడికి చేరుకుని సూచించిన నిర్ణీత విస్తీర్ణంలో మనం అందించే కమాండింగ్ ద్వారా అన్ని పనులు చేస్తుంది.

డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్లు

ఈ ట్రాక్టర్ పూర్తిగా కెమెరాల ఆధారంతో పనిచేస్తుంది. అందుకోసం వెనుక వైపు రెండు మరియు ముందు వైపు రెండు కెమెరాలను అమర్చారు.

డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్లు

అంతే కాకుందా ఇందులో ఒక తెర కలదు, దీని ద్వారా ఈ ట్రాక్టర్‌కు సూచించిన పని ఎంత వరకు జరిగింది అనే సమాచారాన్ని స్ఫష్టంగా తెలియజేస్తుంది.

డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్లు

ఇందులో మరొక తెర కూడా కలదు, ఇందులో ట్రాక్టర్ ఇంజన్ వివరాలైన కీ ల గురించి, ఇంజన్ వేగం, ఫ్యూయల్ లెవల్, విత్తనాలు వేసే రేటు, దున్నే సామర్థ్యం వంటి వివరాలను తెలుసుకోవచ్చు.

డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్లు

దీని గురించి న్యూ హాలండ్ ట్రాక్టర్ల సంస్థ మాట్లాడుతూ పొలంలో మనం విత్తాల్సిన విత్తనాన్ని ఇదే విత్తేస్తుంది. ఇందుకు ఇందులో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు తెలిపింది.

డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్లు

ఈ అటానమస్ డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్ వారం రోజుల పాటు, రోజుకి 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది.

డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్లు

న్యూ హాలెండ్ సంస్థ ఈ అటానమస్ ట్రాక్టర్‌ను సిఎన్‌హెచ్ ఇండస్ట్రియల్ మరియు అటానమస్ సొల్యూషన్ ఇన్‌కార్పొరేటెడ్ వారి భాగస్వామ్యంతో అభివృద్ది చేసినట్లు తెలిపారు.

డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్లు

దీనిని వ్యవసాయ వాహనాల సందర్శనలో ఆగష్టు 30 న ప్రదర్శించారు. డ్రైవర్ అవసరం లేని ఈ ట్రాక్టర్ ఎంతో బాగుంది కదా అయితే ఇది పూర్తి స్థాయి అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పట్టనుంది. మరిన్ని ఆటోమొబైల్ కథనాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి .

డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్లు

  • ఇండియాలో ఉన్న టాప్ 10 ఉత్తమ ట్రక్టర్ తయారీ సంస్థలు

Most Read Articles

English summary
After Autonomous Cars, Here Comes Autonomous Tractors
Story first published: Friday, September 2, 2016, 14:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X