ఇంజన్‌లో లోపం కారణంగా షెవర్లే క్రూజ్ సెడాన్ల రీకాల్

By Anil

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ షెవర్లే ఇండియాలో తమ క్రూజ్ సెడాన్ కార్లను వెనక్కి పిలిచింది. ఇంజన్‌లో ఇంధనం మండటానికి కారణమయ్యే పరికరంలో సాంకేతిక లోపం కారణంగా రీకాల్ చేశారు. 2009 నుండి 2011 మధ్య ఉత్పత్తి అయిన క్రూజ్ సెడాన్‌లను దేశవ్యాప్తంగా రీకాల్ చేసినట్లు షేవర్లే ప్రకటిచింది.

ఇంజన్‌లో లోపం కారణంగా షెవర్లే క్రూజ్ సెడాన్ల రీకాల్

షెవర్లే క్రూజ్ సెడాన్‌లను కొనుగోలు చేసిన వారి కార్లు తక్కువ వేగం వద్ద ఉన్నపుడు ఇగ్నిషన్‌లో లోపం వలన పవర్ సరిగ్గా విడుదలవదు. తద్వారా తక్కువ వేగంలో ఉన్నపుడు కారు సరైన పనితీరును కనబరచదు. ఇలాంటి సమస్యను కొంత మంది డ్రైవర్లు నడుపుతున్న సమయంలో గుర్తించినట్లు కూడా తెలిపారు.

ఇంజన్‌లో లోపం కారణంగా షెవర్లే క్రూజ్ సెడాన్ల రీకాల్

ఇంజన్‌లో ఇగ్నిషన్‌లో లోపం కారణంగా 2009 మరియు 2011 మధ్యలో ఉత్పత్తి అయిన కార్లను రీకాల్ చేసినట్లు తెలిపినప్పటికి ఎన్ని కార్లు ఈ బారిన పడ్డాయో అనే విషయాన్ని వెల్లడించడానికి నిరాకరించారు.

ఇంజన్‌లో లోపం కారణంగా షెవర్లే క్రూజ్ సెడాన్ల రీకాల్

వినియోగదారులు తమ క్రూజ్ సెడాన్ కార్లను సమీప షెవర్లే డీలర్ల వద్దకు పరిక్షించడానికి తీసుకెళ్లాలని షెవర్లే ఇండియా తెలిపింది.

ఇంజన్‌లో లోపం కారణంగా షెవర్లే క్రూజ్ సెడాన్ల రీకాల్

అయితే రీకాల్‌ చేసిన క్రూజ్ కార్లలో ఇగ్నిషన్ లోపాన్ని గుర్తించినట్లయితే సాంకేతిక నిపుణులు ఆ లోపాన్ని సరిచేయడం లేదా ఆ పరికరాన్ని మార్చడం చేస్తారు. కేవలం గంట వ్యవధిలోనే ఉచితంగా సమస్యను పరిష్కరిస్తారని షెవర్లే ఇండియా తెలిపింది.

ఇంజన్‌లో లోపం కారణంగా షెవర్లే క్రూజ్ సెడాన్ల రీకాల్

పికప్ సర్వీస్‌ను కూడా షెవర్లే ప్రారంభించింది. ముందస్తుగా సమీప డీలర్ వద్ద అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంటే, వారే స్వయంగా వచ్చి కారులోని పూర్తి విభాగాలను పరిశీలించి సర్వీస్ చేస్తారు.

ఇంజన్‌లో లోపం కారణంగా షెవర్లే క్రూజ్ సెడాన్ల రీకాల్

వినియోగదారుల భద్రత మరియు సంతృప్తి కోసం షెవర్లే ఇండియా ఈ క్రూజ్ సెడాన్ కార్లను రీకాల్ చేసినట్లు ఓ ప్రకనటలో తెలిపారు.

ఇంజన్‌లో లోపం కారణంగా షెవర్లే క్రూజ్ సెడాన్ల రీకాల్

  • విజయ్ మాల్యా పాపాలకు పరిహారం....!!
  • హ్యాట్సాఫ్ టు ఇండియన్ ఆర్మీ: చైనాకు ముప్పు తిప్పలు పెడుతున్న భారతీయ సైన్యం

Most Read Articles

English summary
Recall Alert: Indian Chevrolet Cruze Recalled Over Ignition Issue
Story first published: Saturday, September 3, 2016, 15:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X