86,000 వేల వరకు తగ్గిన షెవర్లే క్రూయిజ్ ధరలు

By Anil

షెవర్లే ఇండియా తమ 2016 ఫేస్‌లిఫ్ట్ క్రూయిజ్ సెడాన్ కారు మీద భారీ స్థాయిలో ధరలో కోతలు విధించింది. దీని టాప్ ఎండ్ వేరియంట్లో గల ఎల్‌టిజడ్ ఆటోమేటిక్ మీద అత్యధికంగా రూ. 86,000 వరకు తగ్గింపును ప్రకటించారు.

షెవర్లే క్రూయిజ్ సెడాన్ కారుకు చెందిన అన్ని వేరియంట్ల మీద ఎంత మేరకు ధరలు తగ్గాయో మరియు వాటి ఇతర వివరాలు క్రింది కథనం ద్వారా అందివ్వడం జరిగింది.

షెవర్లే క్రూయిజ్ పాత మరియు క్రొత్త ధరలు

షెవర్లే క్రూయిజ్ పాత మరియు క్రొత్త ధరలు

ఎల్‌టి వేరియంట్ :

  • పాత ధర రూ. 14.68 లక్షలు
  • క్రొత్త ధర రూ. 13.95 లక్షలు
  • ధరలో తగ్గుదల రూ. 73,000 లు
  •  86,000 వేల వరకు తగ్గిన షెవర్లే క్రూయిజ్ ధరలు

    ఎల్‌టిజడ్ వేరియంట్ :

    • పాత ధర రూ. 16.75 లక్షలు
    • క్రొత్త ధర రూ. 15.95 లక్షలు
    • ధరలో తగ్గుదల 80,000 లు
    • షెవర్లే క్రూయిజ్ పాత మరియు క్రొత్త ధరలు

      షెవర్లే క్రూయిజ్ పాత మరియు క్రొత్త ధరలు

      ఎల్‌టిజడ్ ఎటి వేరియంట్ :

      • పాత ధర రూ. 17.81 లక్షలు
      • క్రొత్త ధర రూ. 16.95 లక్షలు
      • ధరలో తగ్గుదల 86,000 లు
      • ఇంజన్ వివరాలు

        ఇంజన్ వివరాలు

        షెవర్లే క్రూయిజ్ కారులో అత్యంత శక్తివంతమైన 2.0-లీటర్ కెపాసిటి గల విసిడి డీజల్ టర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌ను అందించారు.

         పవర్ మరియు టార్క్

        పవర్ మరియు టార్క్

        ఇందులోని ఇంజన్ దాదాపుగా 163.72 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేస్తుంది.

        ట్రాన్స్‌మిషన్

        ట్రాన్స్‌మిషన్

        షెవర్లే ఇండియా ఈ సరికొత్త క్రూయిజ్ కారులో 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంచారు.

        పోటి

        పోటి

        షెవర్లే వారి క్రూయిజ్ కారు ముఖ్యంగా స్కోడా వారి ఆక్టావియా మరియు వోక్స్‌వ్యాగన్ జెట్టా కార్లకు గట్టి పోటీగా నిలనుంది.

        ధరల భేదం

        ధరల భేదం

        ఆక్టావియా కన్నా క్రూయిజ్ 4.78 లక్షలు తక్కువ ధరతో మరియు జెట్టా కారు కన్నా క్రూయిజ్ 3.23 లక్షలు ధరతో లభిస్తోంది.

         డిజైన్ ఫీచర్లు

        డిజైన్ ఫీచర్లు

        షెవర్లే క్రూయిజ్ కొత్తగా మేకప్ చేసుకుని వచ్చినట్లు ముందు నూతన డిజైన్ శైలి, వెనుక వైపున సరికొత్త స్పాయిలర్ మరియు రెండు సరికొత్త ఎగ్జాస్ట్ పైపులు కలవు. వీటితో పాటు సరికొత్త క్రూయిజ్ కారు నూతన ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే లైట్లను కలిగి ఉంది.

        ఇంటీరియర్ ఫీచర్లు

        ఇంటీరియర్ ఫీచర్లు

        ఇంటీరియర్‌లో గల అత్యంత ముఖ్యమైన వ్యవస్థ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇది 7-అంగుళాల మైలింక్ ఇన్పోటైన్‌మెంట్ వ్యవస్థను కలిగి ఉంది. ఇందులో స్మార్ట్ రేడియో, గ్రాస్ నోట్ మరియు ఎస్‌ఐఎస్ఐ ఐ ఫ్రీ కాంపాటబిలిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

        భద్రత ఫీచర్లు

        భద్రత ఫీచర్లు

        • ముందు వైపున రెండు ఎయిర్ బ్యాగులు
        • సైడ్ ఎయిర్ బ్యాగులు
        • ఎలక్ట్రానిక్ సెన్సార్లుతో పని చేయు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
        • పాసివ్ ఎంట్రీ పాసివ్ స్టార్ట్
        • భద్రత ఫీచర్లు

          భద్రత ఫీచర్లు

          • ఇంజన్ ఇమ్మొబిలైజర్
          • చైల్డ్ సీట్ ప్రొవిసన్
          • యాంటి థెఫ్ట్ అలారమ్
          • ప్రోగ్రామబుల్ ఆటో డోర్ లాక్స్
          •  మరిన్ని ఆసక్తికరమైన కథనాల మీ కోసం....
            • 170 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియన్ రైల్వే గురించి ఆసక్తికరమైన విషయాలు
            • సియాజ్ ఆటోమేటిక్‌ను విడుదల చేసిన మారుతి సుజుకి

Most Read Articles

English summary
Chevrolet Slashes Cruze Prices
Story first published: Friday, February 26, 2016, 18:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X