కేవలం ఏప్రిల్ నెలకు మాత్రమే లక్ష వరకు ఆఫర్ ప్రకటించిన ఫియట్ మోటార్స్

Written By:

ఫియట్ ఇండియా దేశీయంగా అందుబాటులో ఉంచిన కొన్ని ఉత్పత్తుల మీద కేవలం ఈ ఏప్రిల్ నెలకు మాత్రమే అత్బుతమైన ఆఫర్లను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఫియట్ డీలర్ల వద్ద ఎంచుకోదగ్గ మోడళ్ల మీద డిస్కౌంట్లు మరియు ఆఫర్లను అందిస్తున్నారు.

ఫియట్ ఇండియా ఏయే మోడళ్ల మీద ఏ మేరకు ఆఫర్లను ప్రకటించిందో క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

పుంటో ఎవో

ప్రస్తుతం ఏప్రిల్ నెల ఆఫర్ల సందర్భంగా పుంటో ఎవో ప్రారంభ ధరను 5.05 లక్షలు ఎక్స్ షోరూమ్‌ (ఢిల్లీ)గా ప్రకటించారు. ఈ సమ్మర్ కోనుగోళ్లు ద్వారా 30,000 రుపాయల వరకు తగ్గింపును పొందగలరు.

పుంటో ఎవో హ్యాచ్‌బ్యాక్ కారు మీద ఆకర్షణీయ ఫైనాన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. నెల వారిగా 7,255 రుపాయల ఇఎమ్‌ఐ అవకాశాన్ని అందిస్తున్నారు.

అవెంచురా

ఫియట్ వారి మరొక హ్యాచ్‌బ్యాక్ అవెంచురా మీద దాదాపుగా 30,000 వరకు లాభాలను ప్రకటించింది. మరియు దీనిని ఆకర్షణీయమైన 8,678 రుపాయల నెల వారీ కంతుల చొప్పున చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

అర్బన్ క్రాసోవర్ బేస్ వేరియంట్‌ మీద ప్రత్యేక ధరను ప్రకటించారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.81 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ప్రకటించారు

ఫియట్ లీనియా

ప్రస్తుతం ఏప్రిల్ మాసం అమ్మకాలలో ఫియట్ వారి లీనియా సెడాన్ కారు ప్రారంభ ధర రూ. 7.23 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా అందిస్తున్నారు.

ఈ ప్రీమియమ్ సెడాన్ కారును మీద 35,000 రుపాయల వరకు లాభాలను ప్రకటించారు. మరియు నెల వారీ కంతుల రూపంలో చెల్లించేందుకు 10,698 లను ప్రకటించారు.

లీనియా క్లాసిక్

ఫియట్ ఈ వేసవి కాలం ఆఫర్ల సందర్భంగా క్లాసిక్ లీనియా కారు మీద గరిష్టంగా 1,00,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించింది.

ప్రస్తుతం లీనియా సెడాన్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 6.46 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ప్రకటించారు. అన్ని ఆఫర్లు కూడా ఫియట్ ఢీలర్ల వద్ద స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

Read more on: #ఫియట్ #fiat
English summary
Fiat India Offering Benefits Up To Rs. 1 Lakh For April
Please Wait while comments are loading...

Latest Photos