ఆటో ఎక్స్ పో వేదిక మీద కొలువుదీరిన ఫియట్ లీనియా 125 ఎస్

By Anil

ఫియట్ మోటార్స్ వారి ఫాస్ట్ వర్షెన్ కారుగా చెప్పుకునే లీనియా సెడాన్ నుండి లీనియో 125 ఎస్ అనే కారును ఢిల్లీలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించారు.
మరింత చదవండి: హ్యాచ్‌బ్యాక్‌ల మసరంలోకి మూడు డోర్ల పోలో జిటిఐ కారు
ఫియట్ లీనియో 125 ఎస్ సెడాన్ కారు కొన్ని అత్యాధునిక ఫీచర్లితో వచ్చిందని తెలిపారు. ఈ ఫియట్ లీనియా 125 ఎస్ సాంకేతిక వివరాలు మరియు ఫీచర్లు గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 లీనియో 125 ఎస్ ఇంజన్ వివరాలు

లీనియో 125 ఎస్ ఇంజన్ వివరాలు

ఫియట్ మోటార్స్ వారు తమ లీనియా 125 ఎస్ సెడాన్ కారులో 1.4-లీటర్ టర్బోజెట్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఫియట్ వారి పుంటో అబర్త్ కారులో కూడా ఇదే ఇంజన్‌ను వినియోగించారు.

 లీనియా 125 ఎస్ విడుదల చేయు పవర్

లీనియా 125 ఎస్ విడుదల చేయు పవర్

ఇందులోని అత్యంత శక్తివంతమైన ఇంజన్ 5,000 ఆర్‌పిఎమ్ వేగం వద్ద ఉన్నప్పుడు దాదాపుగా 123 బిహెచ్‌పి పవర్‌ను విడుదల చేయును.

 లీనియా 125 ఎస్‌ విడుదల చేయు టార్క్

లీనియా 125 ఎస్‌ విడుదల చేయు టార్క్

లినీయా 125 ఎస్ సెడాన్ లోని ఇంజన్ ఉత్తమ పవర్‌తో పాటు మంచి టార్క్‌ను కూడా విడుదల చేస్తుంది. ఇంజన్ 2,200 ఆర్‌పిఎమ్ వేగం వద్ద ఉన్నప్పుడు గరిష్టంగా 210 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది.

 ట్రాన్స్‌మిషన్ వివరాలు

ట్రాన్స్‌మిషన్ వివరాలు

ఫియట్ మోటార్స్ వారు తమ లీనియా 125 ఎస్ సెడాన్ కారులో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్ బాక్స్‌ కల్పించారు.

డ్రైవ్

డ్రైవ్

ఫియట్ లీనియా 125 ఎస్ కారులోని ఇంజన్ విడుదల చేయు పవర్ మరియు టార్క్‌ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ముందు చక్రాలకు అందుతుంది. అనగా ఫ్రంట్ వీల్ డ్రైవ్‌ సిస్టమ్‌లో అందుబాటులో ఉంది.

డిజైన్

డిజైన్

ఫియట్ మోటార్స్ తమ 125 ఎస్ సెడాన్ కారుని తక్కుల పనితీరును తనబరిచిన లీనియా నుండి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను సేకరించి డిజైన్ చేసింది. పై మెరుగులు అనగా గ్రిల్ సెట్, ప్లాట్‌గా డిజైన్ చేసిన ఫ్రంట్ ఎయిర్ వెంట్ స్లాట్ కొంచెం ఆకర్షణగా నిలిచాయి.

లభించు రంగులు

లభించు రంగులు

కార్ల తయారీదారులు తమ కార్ల ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవడానికి విభిన్న రంగుల్లో అందిస్తారు. కాని ఫియట్ మోటార్స్ వారు తమ లీనియా 125 ఎస్ సెడాన్ కారును సఫ్ఫిరె బ్లూ అనే ఏకైక రంగులో అందిస్తున్నారు. అయితే ఇతర రంగులను ఇష్టపడే వారికి ఇది చేదు వార్త అని చెప్పవచ్చు.

ఫీచర్లు

ఫీచర్లు

  • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
  • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
  • రెయిన్ సెన్సింగ్ వైపర్లు
  • ఆటోమేటిక్ డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ లైట్లు
  • ఫీచర్లు

    ఫీచర్లు

    • పార్కింగ్ సెన్సార్లు
    • తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ
    • వెనుకవైపును గమనించే అద్దాలకు అమర్చిన ఇండికేటింగ్ లైట్లు
    •  అందుబాటులోకి

      అందుబాటులోకి

      ఫియట్ ఇండియా ఈ లీనియా 125 సెడాన్ కారును దేశ వ్యాప్తంగా గల ఫియట్ షోరూమ్‌లకు ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకురానుంది.

      పోటి

      పోటి

      ఇది మార్కెట్లోకి విడుదల అయితే వోక్స్‌వ్యాగన్, ఫోర్డ్ మరియు మారుతి సుజుకి లోని సెడాన్ కార్లకు గట్టి పోటిని ఇవ్వనుంది.

      బెస్ట్ సెడాన్ కారు: ఫియట్ లీనియా 125 ఎస్

      ఫియట్ వారి వాహన శ్రేణిలో అత్యంత శక్తివంతమైన ఈ సెడాన్ కారు పుంటో అబర్త్ కారు కన్నా మెరుగైన ఫలితాలు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

       2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో కొలువైన మరిన్ని వాహనాల గురించి
      • టాటా మోటార్స్ నెక్సాన్ మిని ఎస్‌యువి
      • కార్ లవర్స్ హార్ట్ బీట్ పెంచిన షెవర్లే బీట్
      • ఏఎమ్‌టి, 1.0-లీటర్ ఇంజన్ మార్పులతో సరికొత్త రెనో క్విడ్

Most Read Articles

English summary
Fiat Linea 125 S Debuts At Auto Expo 2016
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X